రాష్ట్రీయం

Visakha Fishing Harbour Fire: విశాఖ పట్నం ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదం, బాధితులకు రెండు రోజుల్లోనే పరిహారం చెక్కులను అందజేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

విశాఖ పట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులను ఏపీ ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది. ప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే బాధితులకు పరిహారం చెక్కులను అందజేసింది.

YSR Kalyanamasthu: కొత్తగా వివాహం చేసుకున్న జంటల అకౌంట్లలోకి రూ. 81.64 కోట్లు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని విడుదల చేసిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

Heavy Rain In Hyderabad:హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం, ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం, మరో రెండురోజుల పాటూ ఇదే పరిస్థితి ఉంటుందంటూ ఐఎండీ అలర్ట్

VNS

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటూ మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సోమాజిగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Nara Lokesh Yuvagalam: నారా లోకేష్ యువగళం పునః ప్రారంభానికి ముహుర్తం ఖరారు, ఈ నెల 27 నుంచి జనంలోకి లోకేష్, విశాఖలో ముగియనున్న యువగళం పాదయాత్ర

VNS

సెప్టెంబరు9న సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నారా లోకేష్‌ ఈ ఏడాది జనవరి 27న కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు (Nara Lokesh Yuvagalam Padayatra) తాత్కాలిక విరామం ప్రకటించారు.

Advertisement

Palnadu Crime: కూతుర్ని వేధిస్తున్నందుకు అల్లుడితో పాటూ కుటుంబం మొత్తాన్నినరికి చంపిన బంధువులు, పల్నాడులో కలకలం రేపిన మూడు హత్యలు, స్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు

VNS

పల్నాడు (Palnadu) జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య గావించబడ్డారు. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో అర్ధరాత్రి ఒకే కుటుంబంలోని ముగ్గురిని సమీప బంధువులు దారుణంగా హత్య చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన అనంత సాంబశివరావు(50), అది లక్ష్మి(47), నరేష్(30)లను సమీప బంధువులు కత్తులతో విచక్షణారహితంగా నరికి (Killed) చంపారు.

Food Poison in Mid-day Meal: బల్లిపడిన మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్ధులు, 51 మందికి అస్వస్థత, పలువురి పరిస్థితి విషమం, అన్నమయ్య జిల్లాలో ఘటన

VNS

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను (Students) ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో విద్యార్థులంతా కోలు కుంటున్నారు. జిల్లాలోని మదనపల్లె మండలం టేకుల పాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం( Midday meals) వండి పెట్టారు.

Telangana Assembly Election 2023: కేటీఆర్‌ ఫోన్‌ కాల్‌ లీక్‌ వీడియో ఇదిగో, సిరిసిల్లలోనే ప్రచారానికి పోవాలంటే క్యాడర్‌ వెనకాడుతుందంటూ ఎక్స్‌లో ఆడియో షేర్‌ చేసిన కాంగ్రెస్‌

Hazarath Reddy

కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే ప్రచారానికి పోవాలంటే క్యాడర్‌ వెనకాడుతుందని, ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందని విమర్శిస్తూ..కేటీఆర్‌ వాయిస్‌తో ఉన్న ఆడియోను పోస్టు చేసింది.కేటీఆర్‌ ఫోన్‌ కాల్‌ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Telangana Assembly Election 2023: వెలమలు, రెడ్లను తట్టుకుని కొల్లాపూర్ కోటలో బర్రెలక్క పాగా వేయగలదా, కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల సమరంపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

మరి కొద్ది రోజుల్లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఓ సామాన్య యువతి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తోంది. నిండా పాతికేళ్లు కూడా లేని ఈ అమ్మాయి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది

Advertisement

Aadhar Enabled Payment System Fraud: ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సాయంతో రూ. 10 లక్షల మేర మోసపూరిత లావాదేవీలు, ఆరుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

Hazarath Reddy

పిన్ లేదా మొబైల్ పరికరం నమోదు చేయకుండా చిన్న లావాదేవీలు చేయడానికి ఉపయోగపడే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS)ను అనేక మోసపూరిత లావాదేవీలు చేయడానికి ఒక ముఠా దుర్వినియోగం చేసింది. ఈ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారని జాయింట్ కమిషనర్ Gajarao Bhupal చెప్పారు.

Barrelakka Manifesto: నిరుద్యోగుల అంశమే లక్ష్యంగా బర్రెలక్క మేనిఫెస్టో, ఏడు ప్రధాన అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష

Hazarath Reddy

కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్న బర్రెలక్క తాజాగా తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కొల్లాపూర్ లో తనను గెలిపిస్తే ఏం చేస్తాననే అనే విషయంపై తక్కువ అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది.

Barrelakka Crying Video: తమ్ముడిపై దాడి, భోరున విలపించిన బర్రెలక్క, తాను ఏం పాపం చేశానని ఇలా దాడులు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్న కొల్లాపూర్ స్వతంత్య్ర అభ్యర్థి

Hazarath Reddy

ఓట్లు చీల్చుతాననే భయంతోనే తనపై కొంత మంది రాజకీయ నాయకులు దాడి చేపించారని బర్రెలక్క ఆరోపించింది. అయితే.. దాడి చేసింది ఏ పార్టీ వాళ్లు అన్నది తెలిదయని చెప్పింది. రాజకీయాలు అంటేనే రౌడీయిజం అని చాలా మంది అనేవారని.. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

JD Lakshminarayana on Barrelakka: బర్రెలక్క కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించండి, తెలంగాణ డీజీపీని కోరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన సామాన్య యువతి బర్రెలక్క అలియాస్ శిరీష సోదరుడిపై దాడి కలకలం రేపిన సంగతి విదితమే. దీనిపై శిరీష సోదరుడిపై దాడిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Advertisement

Telangana Elections 2023: వీడియో ఇదిగో, అక్బ‌రుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని దూషించారనే అభియోగాలపై కేసు బుక్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పోలీస్ అధికారిని దూషించారనే ఆరోపణల్లో భాగంగా ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)పై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఓ వీడియో వైరల్‌ కావడం కూడా తెలిసిందే.

PM Modi Telangana Tour Schedule: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదిగో, ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లో రోడ్ షో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం కూడా కీలకదశకు చేరుకుంది. ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో ప్రచార గడువు ముగిసిన దృష్ట్యా అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం కోసం క్యూ కడుతున్నారు.

IMD Weather Alert: భారీ వర్షాలు, ఆ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్, స్కూళ్లు మూసివేతకు సర్కారు ఆదేశాలు, తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు జోరు వానలు

Hazarath Reddy

ఈశాన్య రుతుపవనాలు తీవ్రతరం కావడంతో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

Hyderabad: గత నెల రోజుల నుంచి హాస్టల్లో నీళ్లు రావడం లేదంటూ రోడ్డెక్కిన నిజాం కళాశాల విద్యార్థులు, అదుపులోకి తీసుకున్న అబిడ్స్ పోలీసులు

Hazarath Reddy

లేడిస్ హాస్టల్‌లో గత నెల రోజులుగా సరైన నీటి సదుపాయం లేదని, కళాశాల సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని నిజాం కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అబిడ్స్ పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.వీడియోలు ఇవిగో..

Advertisement

Visakhapatnam Road Accident: ఎవరో చేసిన తప్పుకు అభం శుభం తెలియని చిన్నారులు... విశాఖపట్నం రోడ్డు ప్రమాదంపై సజ్జనార్ ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వీడియో షేర్ చేస్తూ.. విశాఖపట్నంలో స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురవడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాద దృశ్యాలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి.

Visakhapatnam Road Accident: ఆటో డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణం, మూడు పల్టీలు కొట్టిన ఆటో, 100 మీటర్లు దూరం వెళ్లి ఆగిన లారీ, విశాఖపట్నం రోడ్డు ప్రమాదంలో కీలక విషయాలు

Hazarath Reddy

విశాఖ నగరంలోని సంగం శరత్‌ థియేటర్‌ కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లలను స్కూలుకు తీసుకెళుతున్న ఆటో సిగ్నల్ దగ్గర వేగంగా దూసుకువస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది.ఆటో బోల్తా పడగా అందులోని చిన్నారులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.

Visakhapatnam Accident Video: విశాఖ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, సిగ్నల్ దగ్గర లారీని బలంగా ఢీకొట్టిన స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న ఆటో

Hazarath Reddy

Visakhapatnam Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం,స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ, ఎనిమిది మంది చిన్నారులకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

విశాఖపట్నంలోని సంగం శరత్‌ థియేటర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బేతని స్కూల్‌ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement