రాష్ట్రీయం

Dasara Holidays: ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. 13 తారీఖు నుంచి 25 వరకూ దసరా సెలవులు.. అక్టోబర్ 26 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం

Rudra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 25 తారీఖు వరకూ 13 రోజుల పాటు సెలవులు ఇచ్చింది.

Tirumala Sarvadarshan: తిరుమలలో ఐదురోజుల పాటూ సర్వదర్శనం టోకెన్లు రద్దు, శ్రీవారి దర్శనానికి ఏకంగా 48 గంటలు సమయం, పెరటాసి అమవాస్య నేపథ్యంలో భారీగా పెరిగిన రద్దీ

VNS

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ లో ఐదు రోజులు సర్వదర్శనం (Tirumala Sarvadarshan) టైం స్లాట్ టోకెన్లు రద్దు చేసింది. సెలవులు, పెరటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. అధిక రద్దీ కారణంగా అక్టోబర్ 1,7,8,14,15వ తేదీల్లో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు రద్దు చేసినట్లు టీటీడీ (TTD) పేర్కొంది.

TDP Protest: మోత మోగించిన టీడీపీ, చంద్రబాబు అరెస్టుపై 5 నిమిషాల పాటూ సౌండ్‌తో నిరసన, రాజమండ్రిలో బ్రాహ్మణీ, ఢిల్లీలో లోకేష్‌

VNS

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కోడలు నారా బ్రాహ్మణి (Brahmani) సాయంత్రం మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడి అరెస్టుకు (CBN Arrest) నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆ పార్టీ నేత నారా లోకేశ్ కార్యాలయంలో 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు బ్రాహ్మణితో పాటు పలువురు మహిళలు ఢమరుకం, డోలు వాయిస్తూ, విజిల్ వేస్తూ మోతమోగించారు.

ACB Raids Viral Video: మర్రిగూడ తహసీల్దార్ ఇంటిపై ఏసీబీ దాడి, రెండు కోట్లకు పైగా కరెన్సీ నోట్లు లభ్యం, కేజీల కొద్దీ బంగారం..వీడియో చూస్తే షాకే

ahana

మర్రిగుడ ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు. ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్ది నోట్ల కట్టలు. ఒక్క ట్రంక్ పెట్టెలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యం. మహేందర్ రెడ్డి ఇంట్లో కిలోల కొద్ది బంగారం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నాడని ఆరోపణలు. మహేందర్ రెడ్డి కి చెందిన 15 చోట్ల కొనసాగుతున్న సోదాలు.

Advertisement

CID Notices To Nara Lokesh: ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు, A1గా లోకేష్ పేరు, ఢిల్లీలో నేరుగా కలిసి నోటీసులు అందజేత, అక్టోబర్ 4న విచారణ

VNS

టీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ (AP CID Notices To Nara Lokesh) నోటీసులు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో (Inner Ringroad) నారా లోకేష్ కు సీఐడీ అధికారులు అందజేశారు. శనివారం ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో నారా లోకేష్ ను (Nara Lokesh) సీఐడీ అధికారులు కలిసి నోటీసులు అందించారు. 41 ఏ కింద లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Minister Mallareddy Dance Video: మంత్రి మల్లా రెడ్డి ఊర మాస్ డాన్స్ వీడియో చూస్తే..అల్లు అర్జున్ కూడా చేతులు పైకెత్తి దండం పెట్టడం ఖాయం..

ahana

ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి మంత్రి మల్లారెడ్డి 70 ఏళ్ల వయసులో యువకుడిలా స్టెప్పులు వేశారు.

UPI Services in City Buses: తప్పిన చిల్లర తిప్పలు.. సిటీ బ‌స్సుల్లో యూపీఐ సేవ‌లు.. 2,500 పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియ త్వరలోనే

Rudra

హైదరాబాద్ లోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్‌ లావాదేవీల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది.

Hyderabad Ganesh Idol Immersion: గణేశ్ నిమజ్జనంలో పోకిరీల ఆగడాలు.. కేసులు నమోదు చేసి 250 మందిని అరెస్ట్ చేసిన షీ టీమ్స్

Rudra

హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన గణేశ్ నిమజ్జనం సందట్లో మహిళలు, యువతులపై వేధింపులకు దిగిన పోకిరీలను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Vizag Beach Mystery: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె.. చూసేందుకు ఎగబడిన జనం.. అందులో విలువైన సంపద ఉండే అవకాశం ఉందని చర్చ

Rudra

విశాఖపట్టణం తీరానికి ఇటీవల ఓ పెద్ద పురాతన పెట్టె ఒకటి కొట్టుకొచ్చింది. ఇప్పుడు ఈ బాక్స్ ఓ పెద్ద మిస్టరీగా మారింది. తీరానికి ఓ పెద్ద పురాతన పెట్టె కొట్టుకు వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో దానిని చూసేందుకు జనం ఎగబడ్డారు.

Rains in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ ప్రకటన

Rudra

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది.

2000 Note Exchange Deadline: రూ.2 వేల నోటు మార్పిడికి నేడే ఆఖరు.. నేటితో ఆర్బీఐ ఇచ్చిన గడువు పూర్తి.. రేపటి నుంచీ రూ.2 వేల నోట్లు చెల్లవా? పూర్తి వివరాలు ఇదిగో..

Rudra

ఏడేండ్ల కిందట తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకున్నట్టు గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని గడువు విధించింది.

Aarogya Suraksha: ఏపీ ప్రభుత్వం మరో సంచలన కార్యక్రమం, అందరికీ ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం

Hazarath Reddy

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు.

Advertisement

IMD Alert for Telangana: తెలంగాణకు మరో మూడు రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, ఏయే జిల్లాల్లో భారీ వర్షాలంటే?

VNS

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) పడతాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈశాన్య ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించిందని తెలిపింది.

Inner Ring Road Case: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కి వాయిదా, అప్పటి వరకు లోకేశ్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ అక్టోబరు 3వ తేదీకి వాయిదా పడింది. రెండ్రోజుల క్రితం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు.

Andhra Pradesh Shocker: తిరుపతిలో విషాదం, భార్యతో గొడవపడి ఆటోలో నుంచి దూకేసిన భర్త, ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపే మృతి

Hazarath Reddy

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో భార్యతో తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆటో రిక్షా నుంచి దూకి (35) ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఇటుక బట్టీల కార్మికుడు కోట్లపాటి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు.

Diskshith Reddy Murder Case: పాపం పండింది, మూడేళ్ల క్రితం జరిగిన బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

Hazarath Reddy

మూడేళ్ల కిత్రం జరిగిన బాలుడు దీక్షిత్‌ రెడ్డి హత్య కేసులో నేడు మహబూబాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీక్షిత్‌ రెడ్డి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్‌ ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు.

Advertisement

YSR Vahana Mitra: త్వరలో కురుక్షేత్ర యుద్ధం, మీకు మంచి జరిగిందనిపిస్తే నా పక్షాన నిలవండి, వాహనమిత్ర నిధుల కార్యక్రమంలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

ఏపీలో త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని తెలిపారు.పేదలకు, పెత్తందారులకూ మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు

Andhra Pradesh: విశాఖలో విషాదం, తల్లిదండ్రులు గొడవలు చూడలేక కూతురు ఆత్మహత్య, నా అంత్యక్రియలకు డబ్బులు ఖర్చు చేయవద్దని, అవయువాలు దానం చేయాలని సూసైడ్ నోట్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ దురదృష్టకర సంఘటనలో పాతపట్నం పట్టణంలో 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. టీనేజ్ అమ్మాయి తన కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలకు హాజరైన ఒక రోజు తర్వాత ఈ షాకింగ్ సంఘటన జరిగింది.

YSR Vahana Mitra Scheme: వైఎస్సార్‌ వాహన మిత్ర నిధులు విడుదల చేసిన సీఎం జగన్, డ్రైవర్ల అకౌంట్లోకి నేరుగా రూ. 10 వేలు..

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం మరో పథకానికి సంబంధించి నిధుల్ని విడుదల చేసింది. సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు వైఎస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra) పథకం నిధులను నేడు సీఎం జగన్ విడుదల చేశారు.

Inner Ring Road Case: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు, విచారణకు సహకరించాలని ఆదేశాలు, నోటీసులు అందజేయాలని సీఐడీకి సూచన

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

Advertisement
Advertisement