రాష్ట్రీయం
Group 2 Candidates Protest: గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాల్సిందే, TSPSC కార్యాలయాన్ని ముట్టడించిన అభ్యర్థులు, ప్రిపరేషన్‌కు తగిన సమయం ఇవ్వాలంటూ డిమాండ్
Hazarath Reddyతెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలను (Group 2 Exams) వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు ప్రయత్నించారు. హైదరాబాద్ లోని ఆఫీస్ వద్దకు భారీగా అభ్యర్థులు తరలివచ్చారు.
Video: వీడియో ఇదిగో, బోర్ స్విచ్ వేస్తూ కరెంట్ షాక్ కొట్టి మహిళ అక్కడికక్కడే మృతి, సీసీటీవీ పుటీజీ బయటకు
Hazarath Reddyకూకట్‌పల్లిలో బోర్ స్విచ్ వేస్తూ షాక్ కొట్టి మహిళ మృతి. ఆల్విన్ కాలనీ పైప్ లైన్ రోడ్డులో ఉన్న ప్రేమ్ సరోవర్ అపార్ట్ మెంట్‌లో విద్యుత్ షాక్ కొట్టి గంగాభవాని(33) అనే వివాహిత మృతి
Telangana: వీడియో ఇదిగో, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలంటూ అతని ఇంటి ఎదుట కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం
Hazarath Reddyఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని కుటుంబం ఆత్మహత్యాయత్నం. గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాసానికి ఆరున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు.
Viral Video: కర్మ ఫలితం ఇలానే ఉంటుంది, కారును తప్పించుకుని డివైడర్‌ని ఢీకొట్టిన బైకర్, క్యాప్షన్ ఇవ్వండంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్
Hazarath Reddyఈ వీడియోలో ఓ వ్యక్తి క్రాస్ రోడ్డు నుంచి నేరుగా మెయిన్ రోడ్డు మీదకు దూసుకువచ్చాడు. మెయిన్ రోడ్డు మీద నుంచి వస్తున్న కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆ తర్వాత కారు డ్రైవర్ కి సెల్యూట్ చేస్తూ ముందుకు వెళుతే రోడ్డు డివైడర్ ని ఢీకొట్టాడు బైకర్..ఈ వీడియోని షేర్ చేస్తూ క్యాప్సన్ ఇవ్వండి అన్నారు సజ్జనార్
Devudu Name: చిన్నారికి 'దేవుడు' అని పేరుపెట్టిన సీఎం జగన్... గోదావరి ముంపు ప్రాంత పర్యటనలో ఘటన.. వీడియో వైరల్
Rudraగోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ జంట తమ పసికందును సీఎం జగన్ చేతుల్లో పెట్టి, తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరింది. అంతేకాదు, ఆంగ్లంలో డీ అనే అక్షరంతో ఆ పేరు మొదలయ్యేలా ఉండాలని ఆ దంపతులు తెలిపారు.
Fumes in Vande Bharat Train: వీడియో ఇదిగో, వందే భారత్ టాయిలెట్‌లో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో రైలు నిండా పొగలు, ఆందోళనకు గురైన ప్రయాణికులు
Hazarath Reddyవందే భారత్ ట్రైన్ లో పోగలు వెలువడ్డాయి. తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ రైలులో ఈ ఘటన జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ రైలులో పొగలు వెలువడ్డాయి. గూడూరు-మనుబోలు మధ్య రైలును నిలిపివేశారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. పొగలు వెలువడడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి ఎస్సై మీద దాడి చేసిన మందుబాబు, రోడ్డుపై పడుకొని హల్‌చల్ చేసిన యువకుడు
Hazarath Reddyనిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో రాత్రిపూట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కోటగిరి మండలం, కొత్తపల్లికి చెందిన ఓ యువకుడు బాగా మద్యం తాగి భార్యతో స్వగ్రామానికి వెళ్తుండగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా 360 శాతం ఆల్కహాల్ ఉన్నట్టు మిషన్లో వచ్చింది.
Bholashankar's Movie: చిరంజీవి భోళాశంకర్ మూవీకి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిరాకరించిన జగన్ సర్కారు
Hazarath Reddyఈ నెల 11న రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి తిరస్కరించింది. దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందంటూ చిరు అభిమానులు ఆరోపిస్తున్నారు.
Andhra Pradesh:పేద పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, కొత్తగా పెళ్లైన వధువుల తల్లుల ఖాతాల్లోకి రూ.141.60 కోట్ల నిధులు జమ చేసిన సీఎం జగన్
Hazarath Reddy2023 ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందుకు అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
Viral Video: ఒక్క బైక్‌పై ఏడుగురు ప్రయాణమా? షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని హెచ్చరిక
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్‌. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్దం.
Bhumana Karunakar Reddy Met CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, వీడియో ఇదిగో
Hazarath Reddyసీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మన్‌ గా నియమితులైన భూమన కరుణాకర్‌ రెడ్డి. ఈ సందర్భంగా సీఎంకు తిరుపతి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
Telangana: ఎంపీడీఓ ఆఫీసులో పైనుంచి ఊడి పడిన సీలింగ్‌పై ప్లాస్టర్లు, భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే సమయంలో అధికారులు హెల్మెట్ ధరించడం ద్వారా భద్రతా చర్యలను అవలంబించారు. నాసిరకం భవనాలు ప్లాస్టర్లు పడిపోవడంతో వారికి ముప్పు పొంచి ఉంది. అందుకని వారు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యోగం చేయలేమంటూ ఇలా హెల్మెట్లతో ఆఫీసుకు వచ్చారు. వీడియో ఇదే..
Video: జాగ్రత్త.. దొంగలు ఏ వస్తువును వదలడం లేదు, షాపు ముందు ఉన్న కరెంట్ బల్బ్ ను దొంగ ఎలా ఎత్తుకెళ్లాడో వీడియోలో చూడండి
Hazarath Reddyదొంగలు ఏ వస్తువును వదలడం లేదు. తాజాగా కరెంట్ బల్బ్ దొంగతనం చేసిన వీడియో బయటకు వచ్చింది. హైదరాబాద్ లోని కిషన్ బాగ్‌లో ఓ వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ దారిలో షాపు ముందు ఉన్న కరెంట్ బల్బ్ దొంగతనం చేసి ఎత్తుకువెళ్లాడు. వీడియో ఇదిగో..
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఒంటరి మహిళ బ్యాంకు ఖాతా నుండి రూ.1.70 లక్షలు కాజేసిన వాలంటీర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
Hazarath Reddyఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో కొట్ర నాగమణి అనే మహిళ వేలిముద్ర ద్వారా ఆమె ఖాతానుండి వాలంటీర్ డబ్బులు కాజేసాడు, మోసపోయిన మహిళ పోలీసులకి ఫిర్యాదు చేసింది. వీడియో ఇదిగో..
Annamayya Violence Case: ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా, టీడీపీ అధినేతతో సహా 20 మందిపై కేసు నమోదు చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు
Hazarath Reddyఅన్నమయ్య జిల్లాలోని ముదివేడు పీఎస్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటుగా 20 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Kodali Nani on Chiranjeevi: వీడియో ఇదిగో, ప్రతి పకోడీ గాడు సలహాలు ఇచ్చే వాడే, చిరంజీవి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కొడాలి నాని
Hazarath Reddyఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై మెగాస్టార్ చిరంజీవి ఇవాళ వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీని బలంగా తాకడంతో నేతలు ఎదురుదాడికి దిగారు
TSRTC MD VC Sajjanar Tweet: ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, తప్పెవరిదో మీరు చూసి చెప్పండి
Hazarath Reddyఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అంటూ వీడియో షేర్ చేశారు. వీడియోలో రోడ్డు మీద కారు వెళుతుంటే అటు పక్క నుంచి స్కూటర్ వచ్చి ఢీకొట్టింది. స్కూటీ మీద ఉన్న వ్యక్తి అమాంతం ఎగిరి పడి పక్కనున్న మ్యాన్ హోల్ లో పడ్డాడు.
Vaarahi Yatra: పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సర్వం సిద్ధం, వైజాగ్‌ నుంచి మూడో విడత యాత్రను ప్రారంభించనున్న జనసేనాని, ఆగస్టు 19 వరకు మూడో విడత యాత్ర
VNSజనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మూడో విడత వారాహి యాత్ర (Vaarahi Yatra) ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్రను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న జనసేనాని (Janasena) ఇక మూడో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు.
TSRTC MD Sajjanar Tweet: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, రైలు డోర్ దగ్గర నిలబడిన యువతి, రెప్పపాటులో పక్కనుంచి ట్రైన్ రావడంతో షాక్
Hazarath Reddyరైల్లో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి డోర్ వద్ద నిల్చొని తల బయటకు పెట్టింది. క్షణాల్లోనే మరో రైలు పక్కనే ఉన్న పట్టాలపైకి రాగా.. వెంటనే ఇతర ప్రయాణికులు ఆ అమ్మాయిని లోపలికి లాగగా.. ప్రాణాలతో బయట పడింది.
Andhra Pradesh: అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం, అనకాపల్లి జిల్లాలో డోలి యాత్ర నిర్వహించిన ఆదివాసీలు, గ్రామానికి రోడ్లు, కరెంట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్
Hazarath Reddyఅంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా గిరిజన సంఘం ఆధ్వర్యంలో 'డోలి యాత్ర' నిర్వహించారు. జిల్లాలోని గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదీవాసీలు డిమాండ్ చేశారు. వీడియో ఇదిగో..