రాష్ట్రీయం

Ladies Special Bus: హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ప్రారంభమైన లేడీస్‌ స్పెషల్‌ బస్సు, జేఎన్‌టీయూ-వేవ్‌ రాక్‌ మార్గంలో ఉదయం, సాయంత్రం నడవనున్న ప్రత్యేక బస్సు

Hazarath Reddy

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో లేడీస్‌ స్పెషల్‌ బస్సు ఈ రోజు ప్రారంభమైంది. జేఎన్‌టీయూ-వేవ్‌ రాక్‌ మార్గంలో ఈ ప్రత్యేక బస్సు ఉదయం, సాయంత్రం నడుస్తుంది. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేయనుంది. ఐటీ కారిడార్‌లో రాకపోకలకు ఈ సదుపాయాన్ని మహిళలు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.

Kodangal Road Accident: వీడియో ఇదిగో, ఓవర్ లోడ్ దెబ్బకు తిరగబడిన ఆటో, 20 మంది విద్యార్థులకు గాయాలు, వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఘటన

Hazarath Reddy

వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఆటో రిక్షా అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ 20 మంది పాఠశాల విద్యార్థులు ఆటో రిక్షాలో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ ఓవర్‌లోడ్ చేయడంతో కంట్రోల్ కాక బండి అదుపుతప్పింది.

Video: వీడియో ఇదిగో, జలపాతంలో కొట్టుకుపోతున్న తండ్రి, కొడుకులను కాపాడిన పర్యాటకులు, సంగారెడ్డిలో ఘటన

Hazarath Reddy

Telangana Road Accident: వీడియో ఇదిగో, అదుపుతప్పిన బైక్, టీ తాగుదామని బయటకుకి వచ్చిన బావ, బావమరిది మృతి

Hazarath Reddy

జనగాంకు చెందిన ఉల్లెంగుల నరేష్ (23) కాప్రాలో ఉంటున్న మేనమామ కొడుకు క్రాంతి(23)తో కలిసి ఆదివారం తెల్లవారుజామున టీ తాగుదామని బైక్ మీద బయటకు వెళ్లి ఈసీఐఎల్ చౌరస్తాలో స్కిడ్ అయ్యి పడిపోయి అంబేడ్కర్ విగ్రహం గద్దెకు ఢీకొని తలలకు తీవ్రగాయాలై మృతి చెందారు.

Advertisement

Visakha old woman Murder Case: సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన బయటకు వెళుతున్న గ్రామ వాలంటీర్‌

Hazarath Reddy

బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన గ్రామ వాలంటీర్‌ దొరికాడు. వైజాగ్ - పెందుర్తిలో బంగారం కోసం 73 ఏళ్ళ వృద్ధురాలు వరలక్ష్మిని హత్య చేసిన గ్రామ వాలంటీర్‌ వెంకట్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన అనంతరం ఇంటి నుండి బైటికి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.

CID DSP Booked for Harassing Woman: డీఎస్పీ కాదు కామాంధుడు, నా కౌగిలిలో నలిగిపోవాలంటూ ఉద్యోగికి వేధింపులు, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

దక్షిణాది డిస్కమ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) సీనియర్‌ అకౌంటెంట్‌కు పోలీస్ ఉన్నతాధికారి లైంగగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు సీఐడీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కిషన్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు.

Visakhapatnam Horror: విశాఖలో వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్.. కొంత కాలంగా బాధితురాలి షాపులో పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్న నిందితుడు

Rudra

విశాఖలో ఘోరం చోటు చేసుకుంది. వరలక్ష్మి అనే 73 ఏండ్ల వృద్ధురాలిని వాలంటీర్ గా పని చేస్తున్న వెంకటేశ్ రాత్రి 10.30 గంటల సమయంలో హత్య చేశాడు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు నిర్వహిస్తున్న షాప్ లో వెంకటేశ్ గత కొంత కాలంగా పార్ట్ టైమ్ వర్కర్ గా పని చేస్తున్నాడు.

TS Cabinet Meeting Today: కేసీఆర్ అధ్యక్షతన నేడు క్యాబినెట్ మీటింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో భేటీ.. 40 నుంచి 50 అంశాలపై చర్చ.. నిరుద్యోగభృతి వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Rudra

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Conjunctivitis in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కళ్ల కలక కేసులు.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు

Rudra

తెలంగాణలో కళ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు బాధితులు క్యూ కడుతున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోనూ కేసులు పెరుగుతున్నాయని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు.

Hyderabad Crime Case: హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి.. పాస్‌ పోర్టు కోసం నగరానికి వచ్చిన మణిరాజ్.. స్నేహితుడి ఇంటికి వెళ్లి బాత్రూంలో అనుమానాస్పద మృతి.. మృతుడు వరంగల్ వాసిగా గుర్తింపు

Rudra

వరంగల్‌ కు చెందిన సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ హైదరాబాద్‌ లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పాస్‌పోర్టు తీసుకునేందుకు త్రిపురాది మణిరాజ్ (30) తండ్రి నవీన్‌కుమార్‌ తో కలిసి ఈ నెల 28న హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత

Dil Raju: ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ గెలుపు, ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్‌ గెలుపు..

kanha

ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ గెలుపు సాధించింది. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్‌ గెలుపొందింది.

Viral Video: తన పిల్లలని కాపాడమని రోడ్డు మీద వెళ్లే వాహనాల వెంటపడి వేడుకున్న కుక్క, తల్లి వద్దకు పిల్లలను చేర్చిన పోలీసులు, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..

kanha

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరద నీటిలో చిక్కుకున్న కుక్క పిల్లల కోసం తల్లి కుక్క ఆవేదన. తన పిల్లలను కాపాడాలని వాహనాలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న మూగజీవి ఆవేదనను గమనించి వరదనీటిలో ఓ ఇంట్లో కుక్క పిల్లలను గమనించి తల్లి వద్దకు చేర్చి మానవత్వం చాటిన పోలీసులు.

Advertisement

Hyderabad Shocker: గాజు పెంకుతో తండ్రి గొంతు కోసిన కూతురు, అంబర్ పేటలో దారుణం..

kanha

తండ్రి మందలించాడని గొంతు కోసిన కూతురు. అంబర్‌పేటలో తండ్రి మందలించాడని కోపంతో తండ్రి గొంతు కోసిన కూతురు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి. కూతురుని అరెస్ట్ చేసిన పోలీసులు.

Ambati Rambabu: 'బ్రో'లో అంబటిని ట్రోల్ చేసేలా సీన్.. పవన్ పై అంబటి కౌంటర్ ట్వీట్.. ఏంటా విషయం??

Rudra

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి' అని అంబటి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశారు.

NSR Prasad Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూత.. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రసాద్

Rudra

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) ఆకస్మిక మరణం చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఆర్యన్ రాజేశ్ హీరోగా దివంగత డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు.

Jitta Balakrishna Allegations On Kishan Reddy: కిషన్ రెడ్డి పచ్చి సమైఖ్యవాది, కేసీఆర్ ఆదేశాలతోనే నన్ను సస్పెండ్ చేశారంటూ జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు

VNS

కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై(Kishan Reddy) బీజేపీ బహిష్కృత నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy) సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్ రెడ్డి నన్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని జిట్టా ఆరోపించారు. పార్టీలో మరో నాయకుడు ఎదగొద్దనేది కిషన్ రెడ్డి ఆలోచన అని జిట్టా మండిపడ్డారు.

Advertisement

Brahmanandam Meets CM KCR: సీఎం కేసీఆర్ ను కలిసిన బ్రహ్మానందం దంపతులు

kanha

హైదరాబాదులో జరుగనున్న తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ.. శనివారం నాడు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కుటుంబ సమేతంగా కలిసి.. వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన సినీ నటుడు బ్రహ్మానందం. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

MP Vijay Sai Reddy: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖ పర్యటన సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు

kanha

నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖ పర్యటన సందర్భంగా వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు.

Jayasudha: బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే జయసుధ ? ముషీరాబాద్‌ నుంచి జయసుధ పోటీ చేసే అవకాశం ?

kanha

ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోనున్నాన్నారు.

Hyderabad Shocker: లహరి రెడ్డి మృతి కేసులో ట్విస్ట్, భర్త వల్లభ్ రెడ్డి మృతురాలి తల గోడకు గట్టిగా బాదడంతో మృతి - పోలీసు విచారణలో షాకింగ్ నిజాలు..

kanha

వల్లబ్ కొట్టడంతోనే లహరి చనిపోయినట్లు కేసు తేలింది. లహరి తలపై గాయాలు ఉన్నట్లు కనిపిస్తున్నా లహరి తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేయడం లేదు. లహరి తల్లితండ్రులను వల్లబ్ బెదిరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement
Advertisement