రాష్ట్రీయం
Telangana Weather Update: తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
Hazarath Reddyతెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు, ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
HC Clarifies On Adoption: దత్తత వెళ్లిన పిల్లలకు పుట్టింటి ఆస్తిలో పైసా కూడా రాదు, తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు, పూర్వీకుల ఆస్తిలో మాత్రమే హక్కు ఉంటుందని వెల్లడి
Hazarath Reddyదత్తత పిల్లలకు ఆస్తి పంపకం విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దత్తత వెళ్లిన వారికి తాము జన్మించిన కుటుంబం ఆస్తిలో హక్కు ఉండదని తెలంగాణ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది.
Telangana Assembly Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయం, ఖమ్మంలో 10 సీట్లే మావేనని ధీమా వ్యక్తం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Hazarath Reddyఖమ్మం 10కి 10 సీట్లు కాదు తెలంగాణలో 100 సీట్లు గెలబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో స్టేజ్ మీద కాంగ్రెస్ నాయకుల తోపులాట మీద స్పందించిన పొంగులేటి..కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, తోపులాటలు ఎక్కువ, ప్రేమ ఎక్కువ అని అన్నారు.
Miss Shetty Mr Polishetty: అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. ఆగస్టులో విడుదల
Rudraఅనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.
Earthquake in JK: జమ్ముకశ్మీర్‌ లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 4.7 తీవ్రత నమోదు
Rudraజమ్ముకశ్మీర్‌లో భూకంపం చోటుచేసుకుంది. నేటి ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా నమోదైంది.
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం కారణంగా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
President Hyderabad Visit: నేడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Rudraరాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. గచ్చిబౌలిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటారు.
LPG Price Hike: మరోసారి గ్యాస్‌ మంట.. కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 వాత.. ఢిల్లీలో రూ. 1,780కి చేరిన ఎల్పీజీ
Rudraమరోసారి గ్యాస్‌ మంట భగ్గుమన్నది. ఎల్పీజీ ధరలను ఆయిల్ కంపెనీలు మళ్లీ పెంచాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో జనం అల్లాడిపోతుండగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 పెంచాయి.
Sri Lankan REP Met CM Jagan: శ్రీలంకలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించండి, సీఎం జగన్‌ను కోరిన శ్రీలంక ప్రతినిధులు
Hazarath Reddyతాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శ్రీలంక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీలంక ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ సెంథిల్‌ తొండమాన్‌, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ డి.వెంకటేశ్వరన్‌, ఇతర అధికారులు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా తమ దేశంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని శ్రీలంక ప్రతినిధులు కోరారు.
Hyderabad Shocker: తార్నాకలో కామాంధుడు, లిఫ్ట్ పేరుతో యువతికి లైంగిక వేధింపులు. బైక్ మీద నుంచి దూకడంతో యువతికి తీవ్రగాయాలు
Hazarath Reddyహైదరాబాద్‌ నగరంలో తార్నాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్‌ ఇచ్చే వంకతో ఓ కామాంధుడు.. ఓ యువతిపై నడిరోడ్డుపై అదీ బైక్‌ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది.
Anam Jayakumar Reddy Joins YSRCP: నెల్లూరులో టీడీపీకి షాక్, వైసీపీ కండువా కప్పుకున్న ఆనం జయకుమార్‌రెడ్డి,సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక
Hazarath Reddyనెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆనం జయకుమార్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరడం గమనార్హం. సోమవారం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లిన ఆనం జయకుమార్‌రెడ్డి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Vande Bharat Express: ఏపీకి మరో వందేభారత్ రైలు, విజయవాడ-చెన్నై మీదుగా రాకపోకలు సాగించనున్న ట్రైన్, ఈ నెల 7న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Hazarath Reddyఏపీలో మరో వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈనెల 7 నుంచి మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అయిదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.
Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటెల రాజేందర్..కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం
kanhaTelangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటెల రాజేందర్..
Telangana: వికారాబాద్ జిల్లాలో ఘోర విషాదం, రైలు ఢీకొని అరవై మేకలు మృతి, రైలు పట్టాలు దాటుతుండగా ఢీ కొట్టిన ట్రైన్
Hazarath Reddyతెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సుమారు అరవై మేకలు రైలు ఢీకొని మృతి చెందినట్లు అధికారులు సోమవారం తెలిపారు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం దోర్నాల్ గ్రామంలో మేకలు రైలు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
AP Weather Forecast: ఏపీలో మూడు రోజులు అలర్ట్, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyదక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం మధ్య భాగాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంపైకి వాయవ్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ తెలిపారు.
146 New Ambulances in AP: 146 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్, 108 సేవల కోసం ఏటా రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
Hazarath Reddyవైద్యరంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు మరో దిశగా ముందడుగు వేసింది. 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌­లను కొనుగోలు చేసింది
MLA Raghunandan Rao: వీడియో ఇదిగో, నాకు నచ్చితే ఉంటా, లేకపోతే వెళ్లిపోతా, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyనన్ను గౌరవించని చోట నేను పనిచేయాలేను. నాకు నచ్చినన్ని రోజులే పనిచేస్తాను, నాకు నచ్చకపోతే ఎవరూ నన్ను బలవంతం చేయలేరు - దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
TS Weather Forecast: తెలంగాణకు గుడ్ న్యూస్, ఈ నెలంతా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలంగాణలో ఈ నెలంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. నైరుతి రుతుపవనాల సీజన్‌ జూన్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు పరిగణిస్తారు.
Weather Forecast: దేశంలో పలు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లో ఈవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐంఎడీ
Hazarath Reddyఈరోజు దేశంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. IMD ప్రకారం, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, రాయలసీమ, బీహార్‌లోని ఘాట్ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Fire Accident: శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాపులో మంటలు.. వీడియోతో
Rudraహైదరాబాద్ శంషాబాద్‌లోని ఓ ఆటోమొబైల్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న దుకాణంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ.. ఘటన సమయంలో దుకాణం మూసివేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.