రాష్ట్రీయం

Ponguleti Joins Congress: ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జూపల్లి, పొంగులేటి, కూచుకుంట్ల దామోదర్ రెడ్డి..

kanha

ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జూపల్లి, పొంగులేటి, కూచుకుంట్ల..? రాహుల్‌ గాంధీతో జూమ్‌లో మాట్లాడిన పొంగులేటి, రేవంత్.. జూమ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన డీకే శివకుమార్‌..

Andhra Pradesh: పరిశ్రమల నుంచి విద్యుత్ బకాయిలు వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం..

kanha

విద్యుత్ బకాయిలు, ముఖ్యంగా పరిశ్రమల నుంచి బకాయిలు వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఏపీ విద్యుత్ శాఖా శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అధికారులను ఆదేశించారు.

Vande Bharat Passenger Looted: సికింద్రాబాద్ స్టేషన్ లో ఘోరం, వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికురాలిని కొట్టి బంగారం, వజ్రభరణాలు దోచుకెళ్లిన దుండగులు..

kanha

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. ఘటన జరిగినప్పుడు మహిళ తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేరంలో పాత నేరస్తుడి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Prof Haragopal: ప్రొఫెసర్ హరగోపాల్ మీద పెట్టిన UAPA కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీని ఆదేశించిన సీఎం కేసీఆర్

kanha

హైదరాబాద్ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త జి. హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపై UAPA కేసు ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అంజనీకుమార్‌ను ఆదేశించారు.

Advertisement

TTD Seva Tickets: సెప్టెంబరు నెలకు సంబంధించి సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ.. ఈ నెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం.. మరిన్ని వివరాలు ఇవే..

Rudra

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ నెల 19న తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది.

Accident in Konaseema: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాను-కారు ఢీ.. నలుగురి దుర్మరణం.. మరో 9 మందికి గాయాలు

Rudra

కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Rupee Biryani Offer: రూపాయ్‌ నోటుకు బిర్యానీ ఆఫర్‌.. ఎండను సైతం లెక్క చేయకుండా జనాలు బారులు.. బయటకు వచ్చి చూస్తే జరిమానా.. అసలేంటి విషయం..

Rudra

తెలంగాణలోని కరీంనగర్‌లో ఓ రెస్టారెంట్‌ ఓపెనింగ్‌ సందర్భంగా దాని ఓనర్‌ బిర్యానీకి సంబంధించి ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. రూపాయ్‌ నోటుకు బిర్యానీ అంటూ ప్రకటించారు.

Jogu Ramanna: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న.. కాంగ్రెస్ ఓడిపోతే, రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని ఎమ్మెల్యే సవాల్

Rudra

వచ్చే ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. లేదంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు.

Advertisement

Pawan Kalyan’s Varahi Yatra: అన్ని చోట్లకు పవన్ కళ్యాణ్ రావాలంటే ఎలా ? జనసేన నేతలకు క్లాస్, నన్ను ఒకసారి ముఖ్యమంత్రిని చేసి చూడాలని విన్నపం

Hazarath Reddy

ఏపీలో వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నేతలతో భేటీ అయ్యారు. ఇందులో ఇతర పార్టీలకూ, తమ పార్టీకి ఉన్న వ్యత్యాసం, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు.

Pawan Kalyan Meeting: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ పిఠాపురం మీటింగ్‌లో తీవ్ర విషాదం,చెట్టు కొమ్మ విరిగిపడి 20 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు అభిమానులు చెట్టెక్కెడంతో ఆ చెట్టు కొమ్మలు ఒక్కసారిగా విరిగిపోయాయి. దీంతో వారంతా కిందపడ్డారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.. వీడియో ఇదే..

Jagananna Ammavodi: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఈ నెల 28న విద్యార్ధులకు జగనన్న అమ్మ ఒడి, ఇది లేకపోతే అమ్మ ఒడి డబ్బులు పడవు

VNS

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న అమ్మఒడి పథకం అమలు తేదీని ఫిక్స్ చేసింది. ఈ నెల 28న అమ్మఒడి డబ్బులు అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి స్కీమ్ వర్తిస్తుంది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది సర్కార్. బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13వేలు వేయనుంది.

Andhra Pradesh Shocker: గుండెలు పగిలే విషాదకర ఘటన. పాడె మోస్తూ విద్యుత్ షాక్‌తో ముగ్గురి మృతి, కుప్పంలో అంతిమయాత్రకు వచ్చి అనంతలోకాలకు..

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలో అంతిమయాత్రకు వచ్చిన వారిలో ముగ్గురు విద్యుదాఘాతంతో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం.. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని తంబిగాని పల్లెకు చెందిన రాణి (65) అనారోగ్యంతో మృతి చెందింది

Advertisement

President Murmu Hyd Tour: హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, గవర్నర్‌ తమిళిసై

Hazarath Reddy

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, డీజీపీ స్వాగతం పలికారు.

Tirupati Fire: గోవిందరాజుస్వామి రథం అగ్నికి ఆహుతి వార్తలను ఖండించిన టీటీడీ, సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని వెల్లడి

Hazarath Reddy

తిరుపతిలో లావణ్య ఫోటో ప్రేమ్స్‌ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గోవిందరాజుస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయినట్లు వస్తున్న వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేసింది

Adudam Andhra: ఐపీఎల్‌‌కు ఏపీ నుంచి త్వరలో మెగా టీం, సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్, భవిష్యత్తులో చెన్నై, ముంబై జట్ల సహాయం తీసుకుంటామని వెల్లడి

Hazarath Reddy

పీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో క్రీడలు, యువజన సర్వీసులశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబురాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

KS Bharat Meets CM Jagan Video: సీఎం జగన్‌ను కలిసిన టీమిండియా వికెట్ కీపర్ కేఎస్‌ భరత్‌, టీమిండియా క్రికెటర్లు ఆటోగ్రాఫ్‌లు చేసిన జెర్సీ బహుమతి

Hazarath Reddy

టీమిండియా క్రికెటర్‌, భారత టెస్ట్‌ జట్టు సభ్యుడు (వికెట్‌ కీపర్‌) కోన శ్రీకర్‌ భరత్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా భరత్‌.. టీమిండియా క్రికెటర్లు ఆటోగ్రాఫ్‌లు చేసిన జెర్సీని సీఎంకు బహుకరించారు.

Advertisement

AP LAWCET Results 2023 Declared: ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల, 13,402మంది క్వాలిఫై, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

Hazarath Reddy

ఏపీ లాసెట్‌(AP LAW CET), పీజీ ఎల్‌‌సెట్‌(PG LCET) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు

AP PECET Result 2023 Declared: ఏపీ పీఈసెట్‌ ఫలితాలు విడుదల, మొత్తం 977 మంది ఉత్తీర్ణత, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో పీఈటీ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 31న నిర్వహించిన ఏపీ పీఈసెట్‌ (AP PECET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ విడుదల చేశారు. ఈ సెట్‌లో మొత్తం 977 మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఆయన వెల్లడించారు

Visakha MP Family Kidnap Case: డబ్బు కోసమే విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్, ఏడుమందిలో ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు వివరాలను వెల్లడించిన డీజీపీ

Hazarath Reddy

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌తో పాటు ఆడిటర్‌, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) కిడ్నాప్‌ (Visakha MP Family Kidnap Case) కావడం కలకలం రేపిర సంగతి విదితమే.ఈ కిడ్నాప్‌ ఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు.

CM KCR on Alliance in Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో పొత్తుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అన్ని సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం

Hazarath Reddy

మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడితో భారత రాష్ట్ర సమితి పొత్తు పెట్టుకోదని, రాష్ట్రంలోని పౌర, అసెంబ్లీ, సాధారణ స్థానాల్లో ప్రతి స్థానంలోనూ తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం అన్నారు.

Advertisement
Advertisement