Visakhapatnam, July 23: ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో మరో ప్రత్యేకాకర్షణ జత అయింది. ఇప్పటికే ఆ నగరంలో అనేక టూరిస్ట్ స్పాట్ లు ఉన్నాయి. అయితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఓ ప్రాజెక్టు టూరిజం స్పాట్ గానే కాకుండా...పర్యావరణ హితంగా, డబ్బులు ఆదా చేసేదిగా ఉంది. దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ ను (floating solar power plant) నిర్మించి రికార్డు సృష్టించింది జీవీఎంసీ. పర్యావరణానికి హాని చేయకుండా... రిజర్వాయర్‌లోని నీటిని కూడా ఆవిరి కానివ్వని ఈ ప్రాజెక్టులో ఎన్నో విశిష్టతలున్నాయి. నగర వాసులకు తాగునీటిని అందిస్తున్న మేఘాద్రిగడ్డను (Meghadri Gedda reservoir) సోలార్ పవర్ ప్లాంట్ గా మార్చేసి అద్భుతమైన రీతిలో మలిచి జీవీఎంసీ గుర్తింపు పొందింది.
#WATCH | Andhra Pradesh: A floating solar power plant commissioned by Greater Visakhapatnam Municipal Corporation (GVMC) on Meghadri Gedda reservoir in Visakhapatnam (22.07) pic.twitter.com/awAhT0w7t7
— ANI (@ANI) July 22, 2022
రిజర్వాయర్ నీటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఓవైపు నీటిని ఆవిరికాకుండా అడ్డుకోవడం, రెండోవైపు సోలార్ పవర్ ఉత్పత్తి (Solar power) ద్వారా అవసరాలు తీర్చడం వంటివి ఏకకాలంలో జరగడం విశేషం. ఇక తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను జీవీఎంసీ (GVMC) షేర్ చేసింది. ఈ డ్రోన్ విజువల్స్ లో (Drone visuals) సౌర విద్యుత్ ను అందించే విద్యుత్ ప్యానెళ్లు నీటిపై తేలియాడడాన్ని గమనించవచ్చు.
12 ఎకరాల విస్తీర్ణంలో ఈ పవర్ ప్లాంట్ (Power plant) నిర్మించామని, ఇది ప్రతి సంవత్సరం 4.2 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదని జీవీఎంసీ కమిషనర్ జి.లక్ష్మీశ తెలిపారు. అదనంగా, మేము సంవత్సరానికి 54,000 టన్నుల బొగ్గును (Coal) ఆదా చేస్తున్నామన్న ఆయన.. సంవత్సరానికి 3,022 టన్నుల ఉద్గారాలను తగ్గిస్తున్నామని స్పష్టం చేశారు.