ఆంధ్ర ప్రదేశ్
TDP on Muslim Reservation: ఏపీలో ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని టచ్ చేయం, సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన టీడీపీ, ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని గతంలో తెలిపిన బీజేపీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ముస్లిం రిజర్వేషన్లను టీడీపీ (తెలుగుదేశం పార్టీ) టచ్ చేయదని పార్టీ తెలిపింది. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు, జూన్ 7, శుక్రవారం టిడిపి నాయకుడు కె రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతాయని అన్నారు.
Neerabh Kumar Prasad: ఏపీ నూతన సీఎస్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు
Chandrababu Naidu Slams Opposition: కులగణనపై చంద్రబాబు గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు, తాజాగా వీడియో బయటకు..
Hazarath Reddyమోడీ 3.0కి ఢిల్లీలో సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయడంతోపాటు ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. కాగా, కుల గణన చేయాలంటే నైపుణ్య గణన చేయాలని గత నెలలో చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి ఎజెండాను ఉద్దేశించినట్లుగా విమర్శించారు.
Chandrababu Naidu Meet TDP MPs: టీడీపీ ఎంపీలతో భేటీ అయిన చంద్రబాబు, కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, టీడీపీకి ఉన్న ప్రాధాన్యంపై ప్రముఖంగా చర్చలు
Hazarath Reddyఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఎంపీలతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. అందుబాటులోని లేని వారు జూమ్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
Jagan Meeting with YCP Leaders: వైసీపీ నేతలతో జగన్ భేటీ, కార్యకర్తలకు తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని నాయకులకు ఆదేశాలు
Hazarath Reddyవైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఎన్నికల్లో గెలిచిన గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అయ్యారు. పార్టీ శ్రేణులకు తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని నాయకులను వైయస్‌ జగన్‌ ఆదేశించారు
Parni Nani on TDP Attacks: రెండు రోజులకే బీహార్‌ని తలపిస్తున్నారు, టీడీపీ దాడులపై మండిపడిన పేర్ని నాని, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన వైసీపీ నేతలు
Hazarath Reddyరాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని అన్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగిందని ఫైర్ అయ్యారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, నూజివీడులో పట్టపగలే వైసీపీ నేతపై కత్తులతో దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో..
Hazarath Reddyరాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నూజివీడులో పట్టపగలే టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతపై కత్తులతో దాడి చేశారు.
Telugu States Weather Forecast: మరో మూడు రోజులు పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అలర్ట్, హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షాలు
Hazarath Reddyఅరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
Terrible Atmosphere in AP: టీడీపీ దాడులతో ఆంధ్రప్రదేశ్‌లో భయానక వాతావరణం, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని తెలిపిన జగన్
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ (TDP) దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan) అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది
Andhra Pradesh: ఓటమి తర్వాత నేతలతో జగన్ తొలి సమావేశం, పరాజయంపై కారణాలు విశ్లేషణ చేయనున్న వైసీపీ అధినేత
Hazarath Reddyఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అతి కొద్దిమంది వైఎస్సార్సీనీ నేతలు మాత్రమే మీడియా ముందుకొచ్చారు, ధైర్యంగా మాట్లాడారు. ఓటమిని కొందరు స్వాగతిస్తే, మరికొందరు నెపం ఈవీఎంలపైకి నెట్టేశారు. సాక్షాత్తూ జగన్ కూడా ఓటమి తనకు ఆశ్చర్యం కలిగించిందని, సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా వేసిన ఓట్లు ఏమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు
CM Stalin Meets Chandrababu: ఢిల్లీ విమానాశ్ర‌యంలో చంద్ర‌బాబును క‌లిసిన స్టాలిన్‌, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడి
Hazarath Reddyత‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ బుధ‌వారం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించినందుకు బాబుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. "ఢిల్లీ విమానాశ్ర‌యంలో వీరిద్దరి కలయిక జరిగింది. త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాం.
Guntur Shocker: రెడ్డి అని పేరు ఉన్నందుకు హాస్టల్ యజమానిపై దాడిచేసిన జనసేన కార్యకర్తలు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyహాస్టల్ నేమ్ బోర్డుపై రెడ్డి అని ఉన్నందుకు.. హాస్టల్ యజమానిపై జనసేన కార్యకర్తలు దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాడి చేయడమే కాకుండా ఆ వృద్ధుని చేత కాళ్లు పట్టించుకున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది.
Chandrababu Naidu Oath Date: న‌రేంద్ర మోదీ కోసం వెన‌క్కు త‌గ్గిన చంద్ర‌బాబు, ప్ర‌మాణ స్వీకారం తేదీ మార్పు, ఇంత‌కీ కొత్త డేట్ ఎప్పుడంటే?
VNSఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి (AP Kutami) చారిత్రాత్మక విజయం నమోదు చేయటంతో కూటమి శ్రేణులు విజయోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన వైసీపీ (YSRCP) ఈసారి 11సీట్లకే పరిమితమయ్యి ఘోర పరాభవం మూట కట్టుకుంది.
Ashwini Dutt: టీటీడీ ఛైర్మన్ గా ఆ స్టార్ ప్రొడ్యూస‌ర్ కు అవ‌కాశం, చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డంతో చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌, ఇందులో నిజ‌మెంత‌?
VNSటాలీవుడ్ స్టార్ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ (Ashwini Dutt) ముందు నుంచి కూడా టీడీపీ పార్టీనే. ఎన్టీఆర్ ఉన్నప్పట్నుంచి ఆ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తూనే వచ్చారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ ని ఖండించి, కూటమి భారీగా గెలుస్తుందని చెప్పాడు.
Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పెద్ద ఎత్తున అధికారుల ద‌ర‌ఖాస్తులు, డిప్యుటేషన్ పై వ‌చ్చిన అధికారుల విష‌యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
VNSఏపీకి డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యుటేషన్‌పై (Deputation) వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు ఇచ్చింది. డెప్యుటేషన్‌పై వచ్చి పని చేస్తున్న పలువురు అధికారులు (Officers on Deputation) రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు, 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు అయింది. ఈ మేరకు 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే. కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది
Andhra Pradesh: టీడీపీ గెలుపు సంబరాల్లో తీవ్ర విషాదం, ట్రాక్టర్ కింద పడిన యువకుడు, తీవ్రగాయాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించిన సంగతి విదితమే. టీడీపీశ్రేణులు గెలుపు సంబరాలను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.అయితే ఈ సంబరాల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గెలుపు సంబరాల్లో భాగంగా ట్రాక్టర్ మీద టీడీపీ జెండాను కట్టి రౌండ్ తిప్పుతుండగా ఓ యువకుడు దానికింద పడిపోయాడు
Mudragada Padmanabham: ప‌ద్మ‌నాభ‌రెడ్డిగా మార్చుకుంటున్నట్లు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సంచలన ప్రకటన, దేశంలో సీఎంగా జగన్ చేసిన సాహసం మరెవరూ చేయలేదని వెల్లడి
Hazarath Reddy2024 ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి వచ్చిన కాపు సామాజికవర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఎన్నికల్లో పవన్‌ని ఓడించకుంటే పేరు మార్చుకుంటానని సవాల్‌ విసిరారు.