ఆంధ్ర ప్రదేశ్
Raghu Rama Krishna Raju Files Nomination: టీడీపీ, జ‌న‌సేన కూట‌మికి షాక్ ఇచ్చిన ర‌ఘురామ కృష్ణంరాజు, బీ ఫాం ఇవ్వ‌క‌పోయినప్ప‌టికీ ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేష‌న్ దాఖలు, రెబ‌ల్ గా పోటీ చేస్తారా?
VNSటీడీపీ తరపున ఎవరికీ బీఫాం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నామినేషన్ (Raghu Rama Krishna Raju Nomination) వేశారు. రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) భార్య, కుమారుడు భరత్ శుక్రవారం ఉండి రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
EC Notices To Ys Sharmila: వైయ‌స్ ష‌ర్మిల‌కు ఎన్నిక‌ల సంఘం షాక్, వివేకా హ‌త్య‌కేసులో వ్యాఖ్య‌ల‌పై 48 గంట‌ల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ఆదేశం
VNSవైఎస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికల వేళ విపక్షాలు వివేకా హత్య కేసు విషయంలో వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
Andhra Pradesh: ఎన్నికల ప్రచారాన్ని ఆపేసి తల్లీ బిడ్డను రక్షించేందుకు ఆస్పత్రికి పరిగెత్తిన టీడీపీ దర్శి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, వీడియో ఇదిగో..
Hazarath Reddyసమాచారం వచ్చిన వెంటనే స్పందించిన డాక్టర్ లక్ష్మి.. గైనకాలజిస్టు కావడంతో వెంటనే దర్శిలోని ఆసుపత్రికి వెళ్లారు. ఎమర్జెన్సీగా మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. మహిళ బంధువులు గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ, మనవడ్ని కాపాడిన లక్ష్మికి మహిళ తల్లి ధన్యవాదాలు తెలిపారు.
Kakinada Memantha Siddham Sabha: జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌ పారిపోయాడు, చంద్రబాబు సంకలో పిల్లి ఈ పవన్ కళ్యాణ్ అంటూ కాకినాడలో విరుచుకుపడిన సీఎం జగన్
Hazarath Reddyమేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 18వ రోజు తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు.కాకినాడలో ఉప్పొంగి ప్రవహిస్తన్న నిండు గోదావరి కనిపిస్తోందన్నారు.
Andhra Pradesh Elections 2024: వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విశాఖ ఈస్ట్ మాజీ ఇన్‌చార్జి అక్కరమాని విజయనిర్మల, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు
Hazarath Reddyవిశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఎ) మాజీ చైర్‌పర్సన్‌, తూర్పు నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్‌చార్జి అక్కరమాని విజయనిర్మల, ఆమె భర్త వెంకటరావు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి అధినేత నారా చంద్రబాబునాయుడు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Telugu States Weather Update: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరిక
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఉదయం నుంచే మంట పుట్టిస్తున్న సూర్యుడి భగభగలు రెండు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి.సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి
CM Jagan Stone Attack Case: సీఎం జగన్‌పై రాయిదాడి కేసులో నిందితుడు సతీష్‌ అరెస్ట్‌, కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయి దాడి కేసులో సతీష్‌ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్‌ ఏ1గా ఉన్నాడు. నిందితుడు సతీష్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు కేసు నమోదు చేశారు.
Cash-For-Vote Case: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జూలై 24కి వాయిదా, వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరఫున న్యాయవాది కోరడంతో విచారణను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం జూలై 24కి వాయిదా వేసింది
Andhra Pradesh Elections 2024: తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్‌కు భారీ షాక్, వైసీపీలో చేరిన రాజోలు జనసేన ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు, ఇతర నేతలు
Hazarath Reddyఏపీ ఎన్నికలవేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. సీఎం వైయస్ జగన్ రాజోలు ఇంఛార్జ్, బొంతు రాజేశ్వరరావు, ఇతర నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటుగా అమ‌లాపురం ఇంఛార్జ్ రాజబాబు, ముమ్మడివరం ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ, పిఠాపురం ఇంఛార్జ్ శేషు కుమారి, కాకినాడ మాజీ మేయర్ సరోజ తదితరులు వైసీపీలో చేరారు.
Notification For 4th Phase Elections: నాలుగో ద‌శ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ గెజిట్ విడుద‌ల‌, నామినేష‌న్ల ప్ర‌క్రియ షురూ, తెలుగు రాష్ట్రాలు స‌హా ఎక్క‌డెక్క‌డ ఎన్నిక‌లున్నాయంటే?
VNSరాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ పత్రాలను స్వీకరిస్తారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 3.30 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనుండగా, వారి కోసం 35 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
Vijayawada Fire Accident: విజ‌య‌వాడంలో భారీ అగ్ని ప్ర‌మాదం, గోడౌన్ లో చెల‌రేగిన మంట‌లు, ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
VNSఓ గోడౌన్ లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకుంది. మొద‌టి అంత‌స్తు వ‌రకు మంట‌లు వ్యాపించాయి. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు శ్ర‌మిస్తున్నారు. అయితే గోడౌన్ లోప‌ల ఎవ‌రైనా చిక్కుకుపోయారా? అన్న విష‌యం తెలియాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ఏపీ, తెలంగాణ పోలింగ్‌కు నోటిఫికేషన్ తేదీ ఇదిగో, నాలుగో విడతలో మొత్తం 96 లోక్ సభ స్థానాలకు పోలింగ్
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 18 నుంచి నోటిఫికేషన్ వెలువడిన అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఈసారి 7 దశల్లో జరగనుండగా... తెలుగు రాష్ట్రాల్లో నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
AP SSC 10th Results 2024 Date: ఏపీ పదో తరగతి ఫలితాలపై లేటెస్ట్ అప్‌డేట్, ఏప్రిల్ చివరి వారంలో bse.ap.gov.in ద్వారా రిజల్ట్స్ విడులయ్యే అవకాశం
Vikas Mబోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, BSEAP ఏప్రిల్ 25 నాటికి AP SSC ఫలితాలు 2024 ని ప్రకటించాలని భావిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షెడ్యూల్ తేదీల్లో 10వ తరగతి బోర్డు పరీక్షకు హాజరైన అభ్యర్థులు AP SSC 10వ ఫలితాలు మనబడి అధికారిక వెబ్‌సైట్ - bse.ap.gov.in నుండి ఒకసారి విడుదల చేసిన తర్వాత తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల, జూలై నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల
Hazarath Reddyతిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Nellore Road Accident: కావలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆగి ఉన్న లారీని వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టిన లారీ, ఐదుగురు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyనెల్లూరు జిల్లా కావలి ముంగమూరు జాతీయ రహదారి నెత్తురోడింది. కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. రహదారిపై ఆగి ఉన్న ఓ లారీని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.
Memantha Siddham in Bhimavaram: భార్యల్ని మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకులు ఏం కావాలి, చూడయ్యా దత్తపుత్రా అంటూ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన సీఎం జగన్,భీమవరం మేమంతా సిద్ధం సభ హైలెట్స్ ఇవే..
Hazarath Reddyభీమవరం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..భీమవరంలో జన సముద్రం కనిపిస్తోంది.ఉప్పొంగిన ప్రజాభిమానం కనిపిస్తోంది. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్థమా? అని అన్నారు.
Venkatayapalem Head Tonsure Case: 1996 వెంకటాయపాలెం శిరోముండనం కేసు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సహా ఆరు మందికి 18 నెలల జైలు శిక్ష, రూ.2.50లక్షల జరిమానా
Hazarath Reddyవెంకటాయపాలెంలో సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
Skill Development Scam: చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడంపై సుప్రీంకోర్టు సీరియస్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణ మే 7కి వాయిదా, కోర్టులో రెడ్ బుక్ ప్రస్తావన
Hazarath Reddyస్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై విచారణను మే 7 వరకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
Andhra Pradesh Rains: ఏపీకి వానలే వానలు, ఆగస్టు- సెప్టెంబరు మధ్యలో సాధారణానికి మించి అధికంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్(జూన్- సెప్టెంబరు)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆగస్టు- సెప్టెంబరు మధ్యలో లా నినా ప్రభావంతో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Andhra Pradesh: రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కుపోయిన ఏడేళ్ల చిన్నారిని కాపాడిన పోలీసులు, తల్లిదండ్రులకు అప్పగించిన తాడిపత్రి పోలీసులు
Hazarath Reddyతాడిపత్రి రూరల్‌లో ఓ ఏడేళ్ల చిన్నారి రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కుపోయింది, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోడను తొలగించి చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.