ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet Meeting: మరికాసేపట్లో ఏపీ కేబినెట్ మీటింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
VNSఏపీ కేబినెట్ సమావేశం (Cabinet Meet) నేడు జరుగనుంది. సీఎం జగన్ (Cm YS Jagan) అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్ లో ఈ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ (Cabinet Meet) ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.
Video: వీడియో ఇదిగో, స్మార్ట్‌గా హుండీలో నుంచి డబ్బులు కాజేసిన ఆలయ సెక్యూరిటీ అధికారి, కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘటన
Hazarath Reddyహుండీలో డబ్బులు కాజేసిన ఆలయ సెక్యూరిటీ అధికారి. అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి చేతివాటం ప్రదర్శించారు. హుండీలో నుంచి డబ్బులు దొంగతనం చేశారు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ వెలుగులోకి వచ్చింది. వీడియో ఇదిగో..
Skill Development Scam Case: చంద్రబాబుకు మరో కేసులో షాకిచ్చిన సీఐడి, ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్
Hazarath Reddyచంద్రబాబు పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైల్ నంబర్ 2916/2023 పేరుతో మరో పీటీ వారెంట్ దాఖలు అయింది.ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ను నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ వేసింది సీఐడి. తెరాసాఫ్ట్ కంపెనీ కి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపిస్తోంది
Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు పూర్తి, తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా
Hazarath Reddyఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. కాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
Jana Sena Gets Glass Tumbler Symbol: జనసేనకు మళ్లీ గాజు గ్లాసు గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం, ఈసీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyజనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గాజు గుర్తును కేటాయించింది. ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గుర్తును మళ్లీ కేటాయించింది.
Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్ట్ వెనకాల కేసీఆర్, మోడీ హస్తం, కుట్ర చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారని తెలిపిన మధుయాష్కీ
Hazarath Reddyచంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు అరెస్ట్ వెనకాల కేసీఆర్, మోడీ హస్తం ఉంది. కుట్ర చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారు - కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ
Chandrababu Arrest Row: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుపై విచారణ ఈ నెల 21కి వాయిదా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు
Hazarath Reddyఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం కేసును ఎల్లుండికి (ఈ నెల 21కి) ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. హైకోర్టు ముందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం నేడు వచ్చిన సంగతి విదితమే.ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు పిటిషన్‌ వేశారు.
Andhra Pradesh: నేను మీ బిడ్డను, సీమ నీటి కష్టాలు నాకు తెలుసు, లక్కసాగరం వద్ద పంప్‌హౌస్‌ ప్రారంభించిన ముఖ్యమంత్రి, డోన్‌ సభలో సీఎం జగన్‌ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లా పర్యటన కొనసాగుతోంది.హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు నీటిని నింపే ప్రాజెక్టును సీఎం జగన్‌ జాతికి అంకితం చేశారు.
Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్, నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన
Hazarath Reddyఏపీ సీఎం జగన్ తిరుపతి, తిరుమల పర్యటన ముగిసింది. తిరుపతిలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత తిరుమల చేరుకున్నారు. తిరుమలలో సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
Nara Brahmani On CBN Arrest: ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు, అభివృద్ధి చేయడమే ఆయన చేసిన తప్పా అంటూ ప్రశ్నించిన నారా బ్రాహ్మణి
VNSయువతకు బడా కంపెనీల్లో ఉద్యోగాలు రావడానికి మార్గం సుగమం చేశారని తెలిపారు. ఇన్ని మంచి పనులు చేయడం నేరమా? అని అన్నారు. తమకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందని, చంద్రబాబు నాయుడు త్వరలోనే విడుదలవుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ గెలిచి, అభివృద్ధికి బాటలు వేస్తారని అన్నారు.
Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ, బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే.
Andhra Pradesh Road Accident: వీడియో ఇదిగో, ప్రకాశంజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, యర్రగొండపాలెం వద్ద బోల్తాపడిన ఆర్టీసీ ఇంద్ర బస్సు, 8 మందికి గాయాలు
Hazarath Reddyప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది.హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Mekapati Chandrasekhar Reddy: ఉదయగిరి నియోజకవర్గంలో తాను తప్ప ఎవరూ గెలవలేరు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, త్వరలో టీడీపీలో చేరుతానని ప్రకటన
Hazarath Reddyచంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు రావాలంటూ నెల్లూరు (Nellore) జిల్లా మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (mekapati chandrasekhar reddy) 37వేల లడ్డూలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
CM Jagan Tirupati Tour: రూ.684 కోట్లతో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ ప్రారంభించిన సీఎం జగన్, తిరుమలలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటన కొనసాగుతోంది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో.. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు,అలాగే పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవం కోసం సీఎం జగన్ తిరుమలలో పర్యటించారు
Special Parliament Session 2023: వీడియో ఇదిగో, తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, రెండు రాష్ట్రాల ఏర్పాటు వల్ల సంబరాలే లేవని వెల్లడి
Hazarath Reddyతెలంగాణ (Telangana) ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగింది. కానీ, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదు. వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగింది.
Tirumala Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం, నేడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్, 9 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Hazarath Reddyతిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు
Vinayaka Chavithi Wishes: ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, విఘ్నాలన్నీ తొలగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
Hazarath Reddyవినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుడి శుభ దృష్టి మన రాష్ట్రంపై ఉండాలి. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి.
Andhra Pradesh Students in UN: ప్రపంచ ప్రఖ్యాత వేదికపై మాట్లాడిన ఏపీ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో అమలవుతున్న సంస్కరణలపై స్పీచ్
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు (సెప్టెంబర్ 15 - 28) పర్యటిస్తోంది. కాగా ఇలా పర్యటించడం ఇదే మొదటిసారి.
Khairatabad Maha Ganapathi LIVE: ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతికి తొలిపూజ (లైవ్)
Rudraహైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు
Minister Roja On Pawan Kalyan: పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తాం..మంత్రి ఆర్‌కే రోజా హెచ్చరిక
ahanaపవన్ కల్యణ్ బ్రతుకు ఎంత? స్థాయి ఎంత అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పవన్ కల్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరింది అని చెప్పుకొచ్చారు. పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తాం అని అన్నారు.