ఆంధ్ర ప్రదేశ్
Fumes in Vande Bharat Train: వీడియో ఇదిగో, వందే భారత్ టాయిలెట్‌లో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో రైలు నిండా పొగలు, ఆందోళనకు గురైన ప్రయాణికులు
Hazarath Reddyవందే భారత్ ట్రైన్ లో పోగలు వెలువడ్డాయి. తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ రైలులో ఈ ఘటన జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ రైలులో పొగలు వెలువడ్డాయి. గూడూరు-మనుబోలు మధ్య రైలును నిలిపివేశారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. పొగలు వెలువడడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
Bholashankar's Movie: చిరంజీవి భోళాశంకర్ మూవీకి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిరాకరించిన జగన్ సర్కారు
Hazarath Reddyఈ నెల 11న రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి తిరస్కరించింది. దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందంటూ చిరు అభిమానులు ఆరోపిస్తున్నారు.
Andhra Pradesh:పేద పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, కొత్తగా పెళ్లైన వధువుల తల్లుల ఖాతాల్లోకి రూ.141.60 కోట్ల నిధులు జమ చేసిన సీఎం జగన్
Hazarath Reddy2023 ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందుకు అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
Bhumana Karunakar Reddy Met CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, వీడియో ఇదిగో
Hazarath Reddyసీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మన్‌ గా నియమితులైన భూమన కరుణాకర్‌ రెడ్డి. ఈ సందర్భంగా సీఎంకు తిరుపతి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఒంటరి మహిళ బ్యాంకు ఖాతా నుండి రూ.1.70 లక్షలు కాజేసిన వాలంటీర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
Hazarath Reddyఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో కొట్ర నాగమణి అనే మహిళ వేలిముద్ర ద్వారా ఆమె ఖాతానుండి వాలంటీర్ డబ్బులు కాజేసాడు, మోసపోయిన మహిళ పోలీసులకి ఫిర్యాదు చేసింది. వీడియో ఇదిగో..
Annamayya Violence Case: ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా, టీడీపీ అధినేతతో సహా 20 మందిపై కేసు నమోదు చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు
Hazarath Reddyఅన్నమయ్య జిల్లాలోని ముదివేడు పీఎస్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటుగా 20 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Kodali Nani on Chiranjeevi: వీడియో ఇదిగో, ప్రతి పకోడీ గాడు సలహాలు ఇచ్చే వాడే, చిరంజీవి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కొడాలి నాని
Hazarath Reddyఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై మెగాస్టార్ చిరంజీవి ఇవాళ వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీని బలంగా తాకడంతో నేతలు ఎదురుదాడికి దిగారు
Vaarahi Yatra: పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సర్వం సిద్ధం, వైజాగ్‌ నుంచి మూడో విడత యాత్రను ప్రారంభించనున్న జనసేనాని, ఆగస్టు 19 వరకు మూడో విడత యాత్ర
VNSజనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మూడో విడత వారాహి యాత్ర (Vaarahi Yatra) ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్రను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న జనసేనాని (Janasena) ఇక మూడో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు.
Andhra Pradesh: అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం, అనకాపల్లి జిల్లాలో డోలి యాత్ర నిర్వహించిన ఆదివాసీలు, గ్రామానికి రోడ్లు, కరెంట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్
Hazarath Reddyఅంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా గిరిజన సంఘం ఆధ్వర్యంలో 'డోలి యాత్ర' నిర్వహించారు. జిల్లాలోని గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదీవాసీలు డిమాండ్ చేశారు. వీడియో ఇదిగో..
Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి వ్యాఖ్యలు, జనసేనకు సపోర్ట్ చేస్తారనే వార్తలకు ఈ కామెంట్లు బలం చేకూరినట్లేనా..
Hazarath Reddyమీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం గురించి ఆలోచించాలని, సంక్షేమ పథకాలు, ఉద్యోగ-ఉపాధి అంశాలపై దృష్టిసారించాలన్నారు. పేదరికం కడుపు నింపే దిశగా ఆలోచించాలని, అలాచేసినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు
Jahnavi Dangeti: పేద విద్యార్ధి కల సాకారం కోసం ఆర్థిక భరోసా అందించిన సీఎం వైఎస్ జగన్, జాహ్నవి దంగేటి పైలెట్‌ శిక్షణ కోసం ఆర్థిక సాయానికి సానుకూల స్పందన
Hazarath Reddyగ్రామీణ పేద విద్యార్ధి కలను సాకారం చేసేందుకు ఆర్థిక భరోసా అందించిన సీఎం వైఎస్ జగన్. అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి. సానుకూలంగా స్పందించిన సీఎం.
Pinnelli vs Nara Lokesh: లోకేష్ నువ్వు మగాడైతే, చంద్రబాబుకే పుట్టి ఉంటే.. అంటూ ఫైర్ అయిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyవైఎస్ఆర్‌సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి నారా లోకేష్ కు ఛాలెంజ్ విసిరారు. టీడీపీ యువనేత తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.
Nara Lokesh: పాదయాత్రలో నారా లోకేష్ సంచలన హామీ, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి రూ. 15 వేలు అకౌంట్లో వేస్తామని ప్రకటన
Hazarath Reddyఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది, అప్పుడే హామీల వర్షం మొదలయింది. తాజాగా నారా లోకేష్ పాదయాత్రలో సంచలన హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఒక బిడ్డ ఉంటే రూ.15,000, ఇద్దరు ఉంటే రూ.30000, ముగ్గురు ఉంటే రూ.45000ల చొప్పున నేరుగా బిడ్డ తల్లి అకౌంట్లో చదువు కోసం వేస్తామని నారా లోకేష్ తెలిపారు.
Couple Dies in Road Accident: విశాఖలో తీవ్ర విషాదం, పుల్లుగా తాగి కారు నడిపి భార్యభర్తలను ఢీకొట్టిన మందుబాబులు, సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలిన దంపతులు
Hazarath Reddyవిశాఖలోని బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్లూ వద్ద మద్యం మత్తులో అరుగులు యువకులు కారు నడుపుతూ భీభత్సం సృష్టించారు. అతివేగంతో ఉన్న కారు అదుపు తప్పి డీవైడరును ఢీ కొట్టి, పక్క రోడ్డులో వెళ్తున్న మరో బైకును ఢీ కొట్టగా బైక్ మీద ఉన్న దంపతులు పృధ్వీరాజ్ (28), ప్రియాంక (21) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు.కారులో ఉన్న ఆరుగురిలో ఓ యువకుడు కూడా దుర్మరణం చెందాడు.
IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌ లో మరో విద్యార్థి బలవన్మరణం.. మృతుడిని ఒడిశా వాస్తవ్యుడిగా గుర్తించిన పోలీసులు
Rudraప్రతిష్టాత్మక సంస్థ ఐఐటీ హైదరాబాద్‌ లో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న మమైత నాయక్ మానసిక ఒత్తిడి కారణంగా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Tomato Prices: సామాన్యులకు ఊరట.. హైదరాబాద్‌ లో దిగొస్తున్న టమాటా ధర.. మార్కెట్‌ కు నిన్న 2,450 క్వింటాళ్లు.. రైతు బజార్లలో కిలో టమాటా రూ. 63
Rudraపెరిగిన టమాటా ధరలతో కుదేలైన సామాన్యులకు ఊరటనిచ్చే విషయమిది. మార్కెట్లోకి టమాటాల రాక మళ్లీ పెరుగుతుండడంతో ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. హైదరాబాద్‌ కు నిన్నమొన్నటి వరకు 850 క్వింటాళ్ల టమాటాలు రాగా నిన్న 2,450 క్వింటాళ్లు వచ్చాయి.
Jayaprakash Narayan: వైసీపీలో జయప్రకాశ్ నారాయణ చేరబోతున్నారా? లోక్ సత్తా స్పందన ఏమిటి?
Rudraఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా హాజరయ్యారు.
Vizag Car Accident: విశాఖలో కారు బీభత్సం.. డివైడర్ ను దాటి బైక్ ను ఢీకొట్టి.. ఆపై చెట్టు పొదల్లోకి వెళ్లిన వాహనం.. ప్రమాద ఘటనలో ముగ్గురి మృతి
Rudraవిశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా బైక్ పై వస్తున్న వారిని అనంతరం ఢీకొట్టింది. ఆపై చెట్టు పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పైన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతి చెందాడు.
Malayalam Director Siddique: మలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ కు గుండెపోటు... పరిస్థితి విషమం
Rudraమలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ గుండెపోటుతో కొచ్చిలోని ఆసుపత్రిలో చేరారు. 69 ఏళ్ల ఈ దర్శకుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది.