ఆంధ్ర ప్రదేశ్
BRO Movie Chaos: థియేటర్లో స్క్రీన్ చింపేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం, అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపార్వతీపురం మన్యం జిల్లా సౌందర్య థియేటర్లో పవన్ కళ్యాణ్ "బ్రో" సినిమాకు అభిమానులు అత్యుత్సాహంతో స్క్రీన్ పై పాలాభిషేకం చేసి తోపులాటలో స్క్రీన్ చింపారు. స్క్రీన్ చింపిన అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Video: దుకాణదారుడికి టోపీ పెట్టిన కిలేడీ, యజమాని కళ్లు గప్పి స్మార్ట్‌గా బంగారం దొంగతనం ఎలా చేసిందో వీడియోలో చూడండి
Hazarath Reddyశ్రీకాకుళంలో కి'లేడీ' దొంగతనం చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. శ్రీకాకుళం - సోంపేటలో శుక్రవారం ఓ జ్యుయలరీ షాపులో దొంగతనం జరిగింది. బంగారం కొనుగోలు చేస్తామని వచ్చిన ఒక అమ్మాయి దుకాణదారుడు కళ్ళు కప్పి దొంగతనం చేసింది. దానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజీ వైరల్ అవుతోంది.
Telangana Floods: హైదరాబాద్ - విజయవాడ హైవే మీద 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, మిర్యాలగూడ మీదుగా మళ్లింపు, ఉప్పొంగి ప్రవహిస్తున్న మున్నేరు వాగు
Hazarath Reddyహైదరాబాద్ - విజయవాడ హైవే మీద భారీగా ట్రాఫిక్ జాం అవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఐతవరం వద్ద హైవేపై మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. హైద్రాబాద్ నుంచి ఏపి వెళ్ళే వాహనాలను కోదాడ,హుజూర్ నగర్,మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. కోదాడ - హుజూర్ నగర్ రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Video: శ్రీకాకుళం తీరానికి కొట్టుకువచ్చిన 25 అడుగుల పొడవున్నఅరుదైన చేప బ్లూ వేల్, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చని అనుమానాలు
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (బ్లూ వేల్) కొట్టుకొచ్చింది. సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది. అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు.
Andhra Pradesh Floods: వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyతీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున.. పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు.. తూర్పుగోదావరి కోటి.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది.
Andhra Pradesh Rains: ఏపీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష, ముంపు బాధితులకు బాసటగా నిలవాలని అధికారులకు ఆదేశాలు, గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు
Hazarath Reddyరాష్ట్రంలోని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Justice Dhiraj Singh Thakur: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం, శాలువా కప్పి సన్మానం చేసిన సీఎం జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ హైకో­ర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనచేత ప్రమాణం చేయించారు. సీఎం జగన్‌ నూతన సీజేగా ప్రమాణం చేసిన ధీరజ్‌సింగ్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు.
Telugu States Floods: అలర్ట్, విజయవాడ-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు, ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు నదులు
Hazarath Reddyఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్‌ జిల్లాలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై(హైదరాబాద్‌-విజయవాడ)అడుగు మేర వరద నీరు చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి
HC on Bigg Boss Show: బిగ్‌బాస్‌ షోపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, టీవీల్లో అసభ్యకర రీతిలో వచ్చే రియాల్టీ షోలకు సెన్సార్‌ లేకపోతే ఎలా అని మండిపాటు
Hazarath Reddyబిగ్‌బాస్‌ షో నిలిపివేసేలా ఆదే­శాలు జారీ చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. టీవీల్లో అసభ్య, అభ్యత­రకర రీతిలో రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్‌ చేయక­పోతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది.
TDP vs YSRCP: వినుకొండలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల రాళ్ల దాడి, పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు
Hazarath Reddyవినుకొండలో ఉద్రిక్త పరిస్థితి. టీడీపీ నేత జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులు పెట్టారని ఆ పార్టీ నాయకులు వినుకొండలో భారీ ర్యాలీ నిర్వహించగా ఇదే సమయంలో వారికి ఎమ్మెల్యే సహా వైసీపీ నాయకులు ఎదురు కావడంతో పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పట్టణ సీఐ సాంబశివరావు గన్ బయటికి తీసి గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరపగా, పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్, నిరుపేద విద్యార్థులు ఫారిన్ యూనివర్సిటీల్లో చదువుకునే దిశగా ఏపీ సర్కారు అడుగులు
Hazarath Reddyఏపీలోని పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్య­సించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు (Jagananna Videshi Vidya Deevena) లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి
Andhra Pradesh Floods: ఏపీలో 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మరో మూడు రోజులు భారీ వర్షాలు, ముంచెత్తిన వానతో పొంగిన వాగులు, నీటమునిగిన రహదారులు
Hazarath Reddyతీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.
Srinivasa Sethu Flyover Accident: తిరుపతి ఫ్లైఓవర్ పనుల్లో మరోసారి ప్రమాదం, సిమెంట్ దిమ్మె అమర్చుతుండగా తెగిన వైర్లు, ఇద్దరు కార్మికులు మృతి
VNSతిరుపతిలో ఫ్లైవోవర్ పనుల్లో (Srinivasa Sethu Flyover) ప్రమాదం జరిగింది. శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనుల్లో క్రేన్లు వైర్లు తెగిపోయాయి. చివరి సిమెంట్ దిమ్మె అమర్చుతుండగా వైర్లు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
Data on Women Missing in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో 72,767 మంది బాలికలు, మహిళలు మిస్సింగ్, వివరాలను వెల్లడించిన కేంద్రం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంట్‌కు నివేదించింది
Andhra Pradesh Rains: భారీ వర్షాలకు విశాఖలో ఇళ్లలోకి చేరిన వరద నీరు, పూర్తిగా నీట మునిగిన జ్ఞానాపురం, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారగా మరికాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.
Andhra Pradesh: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ. 20 వేలు కాదు రూ.1500 నుంచి రూ.2 వేల జరిమానా, క్లారిటీ ఇచ్చిన ఏపీ రవాణా శాఖ కమిషనర్
Hazarath Reddyమోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్‌‌ ఫోన్‌ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1500 నుంచి రూ.2 వేల జరిమానా విధిస్తున్నట్టు చెప్పారు. పదేపదే ఇదే నేరం చేస్తే రూ.10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు.
Machilipatnam Doctor Murder: మచిలీపట్నంలో మహిళా డాక్టర్ దారుణ హత్య, గొంతు కోసి అతి కిరాతకంగా చంపిన దుండగులు, బంగారు నగలు అపహరణ
Hazarath Reddyకృష్ణా జిల్లా మచిలీపట్నంలో పిల్లల వైద్య నిపుణురాలైన డాక్టర్‌ రాధ దారుణ హత్యకు గురయ్యారు. గత రాత్రి వారి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. రాధ గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు.
Andhra Pradesh Rains: ఏపీలో భారీ వర్షాలు, భవానమ్మ వాగు పొంగి పొర్లడంతో జేసీబీ సాయంతో వాగు దాటిన టీచర్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారీ వర్షాల కారణంగా విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెడ్డివానివలస సమీపంలో భవానమ్మ వాగు పొంగి పొర్లడంతో.. వాగు దాటి అవతలి ఒడ్డుకు చేరేందుకు గజంగుడ్డివలస పాఠశాల ఉపాధ్యాయులు జేసీబీలను ఆశ్రయించారు.
Indrakiladri Ghat Road Closed: భారీ వర్షాలకు విజయవాడ దుర్గ గుడి వద్ద విరిగిపడిన కొండ చరియలు, ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు మూసివేత
Hazarath Reddyవిజయవాడ ( Vijayawada ) లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై కొండరాళ్లు ( Landslides) బుధవారం జారి ఘాట్‌రోడ్‌ మీద పడ్డాయి . ముందు జాగ్రత్త చర్యగా ఇంద్రకీలాద్రి ఘట్‌రోడ్డును అధికారులు మూసివేశారు.
Srivari Pushkarini to be Closed: శ్రీవారి భక్తులకు అలర్ట్, నెలరోజుల పాటు తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత, భారీ వర్షాలకు తగ్గిన భక్తుల రద్దీ
Hazarath Reddyతిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్కరిణిని నెలరోజుల పాటు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. పుష్కరిణీలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని తెలిపారు.