ఆంధ్ర ప్రదేశ్

Amit Shah In AP: ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోడీ ఇచ్చినవే, కేంద్రం ఇస్తున్న బియ్యంపై జగన్‌ ఫొటో వేసుకుంటున్నారు..ఏపీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్స్

kanha

ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా విశాఖ పట్నంలోని రైల్వేగ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోడీ ఇచ్చినవే.. కేంద్రం ఇస్తున్న బియ్యం తామే ఇస్తున్నట్లు జగన్‌ ఫొటో వేసుకుంటున్నారని విమర్శించారు.

JP Nadda Slams AP Govt.: ఏపీలో జరిగేవి అన్నీ స్కామ్‌లే.. డబ్బు సంపాదనలో బిజీగా వైసీపీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌‌ పై బీజేపీ నేత జేపీ నడ్డా ఫైర్..

Rudra

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌‌ (AP Govt)పై బీజేపీ నేత జేపీ నడ్డా (JP Nadda) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో బీజేపీ సంపర్క్ అభియాన్ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగేవి అన్నీ స్కామ్‌లేనని ఆరోపించారు.

Cyclone Biparjoy: గుజరాత్ వైపు కదిలిన బిపర్‌జాయ్ తుఫాన్, ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరిక, తితాల్ బీచ్‌ను మూసివేసిన అధికారులు

Hazarath Reddy

బిపర్‌జాయ్ తుఫాన్ ముప్పు తీవ్రమవుతోంది. వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఈ తుఫాన్ మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ నేడు (శనివారం) తెలిపింది

Telangana Schools Reopen: 12వ తేదీ నుంచే స్కూల్స్ తిరిగి ప్రారంభం.. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలపై తెలంగాణ విద్యా శాఖ క్లారిటీ

Rudra

తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పష్టతను ఇచ్చింది.

Advertisement

Monsoon to AP: మరో మూడునాలుగు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు.. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం.. తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు

Rudra

రైతన్నలకు శుభవార్త. మరో మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.

Andhra Pradesh: పల్నాడు జిల్లాలో హనుమాన్ విగ్రహం ముందున్న ఒంటె విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు, నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు

Hazarath Reddy

పల్నాడు జిల్లా అచ్చంపేట పట్టణంలోని భారీ హనుమాన్ విగ్రహం ముందు ఉంచిన ఒంటె విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారంటూ స్థానికులు శుక్రవారం నిరసన తెలిపారు. విధ్వంసం సంఘటన సోమవారం జరిగింది. సంఘటన యొక్క CCTV ఫుటేజీ కూడా బయటపడింది, దీనిలో ఒక వ్యక్తి ఒంటె విగ్రహం వైపు రాళ్ళు విసరడం చూడవచ్చు.

Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసు, వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ నిరాకరించిన సీబీఐ కోర్టు

Hazarath Reddy

వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయనకు న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఇటీవల భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది

Andhra Pradesh Shocker: భర్త వేరు కాపురానికి రావడం లేదని కక్ష, నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, పరారీలో భార్య

Hazarath Reddy

బుధవారం తెల్లవారుజామున 34 ఏళ్ల మహిళ తన భర్త నిద్రిస్తున్న సమయంలో భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం పూజారివాండ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

Advertisement

Jagananna Vidya Kanuka: విద్యార్థులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, 43 లక్షల మంది విద్యార్థులకు జూన్ 12న జగనన్న విద్యా కానుక, ఈ నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభం

Hazarath Reddy

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని, అదే రోజు దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం విజయవాడలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యా కానుక కోసం రూ.1,100 కోట్లు ఖర్చు చేసిందన్నారు.

Fish Medicine Distribution: మొదలైన చేప మందు పంపిణీ.. ప్రసాదం కోసం పోటెత్తిన ఉబ్బసం రోగులు.. తగిన ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. ట్రాఫిక్ కు అంతరాయం.. పోలీసుల సూచనలు

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చేప మందును తీనేందుకు దేశ వ్యాప్తంగా జనం ముఖ్యంగా అస్తమా రోగులు పోటెత్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా బత్తిన కుటుంబం ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది.

YS Vivekananda Reddy Case: వివేకానందరెడ్డి హత్యకేసులో 3నే అవినాశ్‌రెడ్డి అరెస్ట్.. ఆపై రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకుని విడుదల.. గోప్యంగా ఉంచిన సీబీఐ, అవినాశ్‌రెడ్డి వర్గాలు

Rudra

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Case) నిందితుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి (YS Avinash Reddy) అరెస్టుకు సంబంధించి కీలక విషయం ఒకటి బయటకు వచ్చింది. అవినాశ్‌రెడ్డిని విచారణకు పిలిచిన సీబీఐ (CBI) ఆయన్ని అరెస్ట్ (Arrest) చేసి.. ఆ వెంటనే బెయిలుపై విడుదల చేసినట్టు సమాచారం.

Ambati Tirupati Rayudu Met CM Jagan: సీఎం జగన్‌ని కలిసిన అంబటి రాయుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు

Advertisement

CM Jagan Mohan Reddy Action Plan: ఏపీలో జూన్‌ 12 నుంచి బడులు, అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24 ను విడుదల చేసిన సీఎం జగన్, విద్యాశాఖపై రివ్యూ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు.

MP Kesineni Nani on TDP: ఆ టీడీపీ నేతలంతా గొట్టంగాళ్లు, ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు, టీడీపీలో తనకు ఎలాంటి పదవి లేదని వెల్లడి

Hazarath Reddy

టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. తాను విజయవాడ నియోజకవర్గం ఎంపీని మాత్రమేనని... టీడీపీలో తనకు ఎలాంటి పదవి లేదని కేశినేని అన్నారు. తాను పొలిట్ బ్యూరో సభ్యుడిని కాదని, కనీసం అధికార ప్రతినిధిని కూడా కాదని చెప్పారు.

Monsoon 2023: తెలుగు రాష్ట్రాల్లోకి కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్న రుతుపవనాలు, వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని పేర్కొంది.

Clean Andhra Pradesh Mission: క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఈ–ఆటోలను జెండా ఊపి ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తొలి దశలో 36 మున్సిపాల్టిలకు పంపిణీ

Hazarath Reddy

ఏపీ రాష్ట్రాన్ని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధృడ సంకల్పానికి అడుగులు పడ్డాయి. చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు.

Advertisement

E Autos For Garbage Collection: క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో మరో ముందడుగు, చెత్తసేకరణకు ఇకపై ఎలక్ట్రిక్‌ ఆటోలు, ఒకేసారి 516 ఈ ఆటోలు ప్రారంభించనున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి

VNS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్‌గా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చెత్తసేకరణ (Garbage Collection) ఈ-ఆటోలను ప్రారంభించింది. ఈ ఆటోలను (E Autos) సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించనున్నారు.

AP Cabinet Key Decisions: మొత్తం 63 అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం, ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం, ఏపీ గ్యారెంటెడ్‌ పెన్షన్‌ స్కీం అమలుకు ఆమోదం

Hazarath Reddy

ఏపీ సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 63 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ విధానం తీసుకొస్తోంది. ఏపీ గ్యారెంటెడ్‌ పెన్షన్‌ స్కీం అమలుకు ఆమోదం తెలిపింది.

AP Cabinet Meeting Highlights: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, 2024 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన వారి క్రమబద్దీకరణకు కేబినెట్‌ ఆమోదం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, గ్రూప్‌-1, 2 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Andhra Pradesh: మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, దెబ్బతిన్న మామిడి కొనుగోలు,నూజివీడులో మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు

Hazarath Reddy

మామిడి రైతుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. అకాల వర్షం, అ­కా­ల వర్షాలు, ఈదురు గాలులకు రాలిపోయిన, దె­బ్బ­తిన్న మామిడి కాయలను కొని, వాటి నుంచి పౌడర్‌ తయారు చేసే సరికొత్త మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శ్రీకారం చుట్టింది.

Advertisement
Advertisement