ఆంధ్ర ప్రదేశ్
Tirumala Rains: వీడియో ఇదిగో.. తిరుమలలో వడగండ్ల వర్షం, ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం, ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందిన భక్తులు
Hazarath Reddyగత వారం రోజుల నుంచి మండే ఎండలతో అల్లాడిపోతున్న తిరుపతి వాసులపై వరుణుడు కరుణ చూపించాడు. తాజాగా తిరుమలలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతొ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ వేడిమి నుండి భక్తులు ఉపశమనం పొందారు. వర్షపు నీరు రోడ్డుపై పొంగి ప్రవహిస్తోంది. వీడియో ఇదిగో..
Viveka Murder Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్, సీబీఐ ముందుకు వివేకానంద రెడ్డి రెండో భార్య షమీమ్, ఆస్తిపై కూతురు వ్యామోహం పెంచుకున్నదంటూ..
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు రోజు రొజుకు ఊహించని మలుపు తిరుగుతోంది. వివేకాకు షమీమ్ అనే రెండో భార్య ఉందని ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐకి షమీమ్ తొలిసారిగా స్టేట్ మెంట్ ఇచ్చారు.
Heat Waves Forecast in AP: 48 మండలాల్లో తీవ్రమైన వడగాడ్పులు, ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ
Hazarath Reddyఅనకాపల్లి జిల్లాలోని 14 మండలాల్లో, విజయనగరం జిల్లాలో 9, గుంటూరు జిల్లాలో 7, కాకినాడ జిల్లాలో 7, కృష్ణాలో 4, ఎన్టీఆర్‌లో 4, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్క మండలం చొప్పున తీవ్ర వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నారు.
Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసులో కీలక మలుపు, ఈ నెల 24 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయొద్దని సీబీఐకి సుప్రీం ఆదేశాలు, విచారణ సోమవారానికి వాయిదా
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ నెల 24 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయొద్దని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Bus Accident: బెజవాడలో బస్సు ప్రమాదం.. 20 మంది ప్రయాణికులకు గాయాలు.. వీడియో
Rudraవిజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్.. కారణం ఇదే!
Rudraదేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సమంత, అలియా భట్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.
Viral Video: అనంతపురంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. వీడియో వైరల్
Rudraఅనంతపురంలో (Anantapur) చైన్ స్నాచర్లు (Chain Snatcher) రెచ్చిపోయారు. నగరంలోని 5వ రోడ్డులో ఇంటి ముందు ఊడుస్తున్న మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై (Bike) వచ్చి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.
Vizag Steel Plant Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు ముగిసిన గడువు.. బిడ్లు దాఖలు చేసిన 29 సంస్థలు.. ఊరించి, ఉసూరుమనిపించిన కేసీఆర్ సర్కారు.. బిడ్డింగ్ కు దూరంగా తెలంగాణ ప్రభుత్వం
Rudraవిశాఖ ఉక్కు పరిశ్రమ కోసం.. అవసరమైతే, స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటామని ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన తెలంగాణ సర్కారు చివరి నిమిషంలో ఉసూరుమనిపించింది.
Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు, దస్తగిరిని అప్రూవర్‌గా మార్చొద్దని వాదనలు, హైకోర్టు మద్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వివేకా కూతురు
Hazarath Reddyమాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్‌ భాస్కరరెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చొద్దని భాస్కరరెడ్డి, కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
Andhra Pradesh: ఆ ఉద్యోగాలపై సీఎం జగన్ కీలక ప్రకటన, వెంటనే ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు,హెల్పర్‌ పోస్టులను భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyతాడేపల్లిలోని క్యాంపు కార్యలయంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు
Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం, పరీక్షా హాల్లో విద్యార్థిని కత్తితో పొడిచిన మరో విద్యార్థి, ప్రేమ వ్యవహారమే కారణమని వార్తలు
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో దారుణం చోటుచేసుకుంది. రాజానగరం జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్‌ను మరో విద్యార్థి కత్తితో పొడిచాడు. ఎగ్జామ్‌ హాల్‌లోకి వచ్చిన ఆ విద్యార్థి.. టీచర్ల ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు
Andhra Pradesh Shocker: ప్రియురాలి మేనమామను కత్తితో నరికిన ప్రియుడు, మేనకోడలిని ఇంటికి తీసుకువెళతానని చెప్పడంతో ముదిరిన గొడవ
Hazarath Reddyప్రేమ వ్యవహారం ప్రియురాలి మేనమామను దారుణంగా హతమార్చేలా చేసింది. విజయవాడలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. విజయవాడకు చెందిన నవీన్‌, ఒంగోలుకు చెందిన శ్వేత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసులో ముగిసిన అవినాష్ రెడ్డి విచారణ, ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ, రేపు 10.30కు రావాలని కడప ఎంపీకి ఆదేశాలు
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ.. ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డిని ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది. అవినాశ్ రెడ్డి విచారణను అధికారులు వీడియోలో రికార్డు చేశారు. అంతేకాకుండా ఆయన నుంచి లిఖితపూర్వకంగా సమాధానాలను తీసుకున్నారు.
Rule from Visakhapatnam: సీఎం జగన్ కీలక ప్రకటన, సెప్టెంబర్‌ నుంచి విశాఖపట్నం నుంచే పాలన, నేను అక్కడే ఉంటాను, శ్రీకాకుళం పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyశ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్‌ నుంచి విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామన్నారు. ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం తెలిపారు
Raghuveera Reddy: మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రఘువీరారెడ్డి, బెంగళూరు నగర కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా నియమాకం, రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుపై ఏమన్నారంటే..
Hazarath Reddyకాంగ్రెస్ మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మళ్లీ పాలిటిక్స్‌లోకి రానున్నారు.శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం కోసం నాలుగేళ్లుగా రాజకీయాల నుంచి విరామం తీసుకున్నా. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా.
Fire in EV Showroom: చార్జింగ్ పెట్టిన బైక్‌ పేలి భారీ అగ్నిప్రమాదం, కాలిబూడిదైన 90 ఎలక్ట్రిక్ బైక్స్, శ్రీకాకుళంలో ఘోర అగ్నిప్రమాదం
VNSఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూంలో (Electric bike showroom) మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌లకు చార్జింగ్‌ పెట్టారు. అయితే ఓ బైక్‌ బ్యాటరీ పేలిపోవడంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. క్రమంగా అవికాస్తా పెద్దవికావడంతో షారూం మొత్తం మంటలు వ్యాపించాయి.
Andhra Pradesh: అంబేద్కర్ చిత్రాలతో కూడిన పేపర్ ప్లేట్లలో భోజనం, హోటల్‌ యజమానిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎస్సీ-ఎస్టీ చట్టాన్ని ప్రయోగించారని తెలిపిన ఎన్‌సిఎస్‌సి
Hazarath Reddyబీఆర్ అంబేద్కర్ చిత్రాలతో కూడిన పేపర్ ప్లేట్లలో భోజనం పెట్టిన హోటల్‌పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎస్సీ-ఎస్టీ చట్టాన్ని ప్రయోగించారని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్‌సిఎస్‌సి) మంగళవారం తెలిపింది.
Margadarsi Case: మార్గదర్శి కేసులో డిపాజిట్ల వివరాలు బయటపెట్టండి, మాజీ ఎంపీ ఉండవల్లి వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు
Hazarath Reddyమార్గదర్శి కేసులో డిపాజిట్ల వివరాలు బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్గదర్శిలో ఇన్వెస్ట్‌మెంట్‌ ఎంత? చెల్లింపులు ఎంత? వివరాలు బయట పెట్టడంలో రహస్యం ఎందుకని ప్రశ్నించింది.
TTD: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త, టికెట్లకు సంబంధించి తేదీలతో సహా క్యాలెండర్ విడుదల చేసిన టీటీడీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyటీటీడీ నెలకోసారి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర సేవల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ ఆ టికెట్లను విడుదల చేసే కొన్నిరోజుల ముందు తేదీలు ప్రకటించేది. ఇప్పుడు, ఒక నెలలో విడుదల చేసే అన్ని రకాల టికెట్లకు సంబంధించిన తేదీలతో సహా క్యాలెండర్ విడుదల చేసింది
Chittoor Shocker: చిత్తూరులో దారుణం, కానిస్టేబుల్ కూతురు గొంతు కోసిన యువకుడు, తర్వాత ఆత్మహత్యాయత్నం, యువతి అక్కడికక్కడే మృతి
Hazarath Reddyచిత్తూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొండమిట్టలో ప్రశాంతి అనే యువతిని ఓ యువకుడు గొంతు కోసి చంపేశాడు . ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు