ఆంధ్ర ప్రదేశ్
Amma Vodi Scheme: అమ్మ ఒడిపై ఎలాంటి ఆంక్షలు లేవు, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది, ఆధారాలు ఉంటే చూపించాలని మండిపడిన ఏపీ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో లేనిపోని అపోహలన్ని సృష్టిస్తున్నారంటూ ఏపీ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్ (Minister Adimulapu Suresh) మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న అమ్మ ఒడిపై (Amma Vodi Scheme) టీడీపీ నేతలు తప్పుబడుతున్నారని ఆయన విమర్శించారు.
Good Friday 2022: జీస‌స్ మ‌హాత్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే, శత్రువుల‌ను కూడా ప్రేమ‌తో క్ష‌మించాల‌ని చెప్పిన ద‌యామ‌యుడు ఏసుక్రీస్తు అని ట్వీట్ చేసిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. శత్రువుల‌ను కూడా ప్రేమ‌తో క్ష‌మించాల‌ని చెప్పిన ద‌యామ‌యుడు ఏసుక్రీస్తు అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.
Ambedkar Jayanti 2022: డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 131వ జయంతి, నివాళి అర్పించిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyడాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 131వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, పినేపే విశ్వరూప్‌, ఎంపీ నందిగం సురేష్, జూపూడి ప్రభాకర్‌ పాల్గొన్నారు.
AP Fire Accident: ఘోర ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందించాలని అధికారులకు ఆదేశాలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు
Hazarath Reddyప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు (Rs 25L ex gratia to kin of Eluru victims), తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు.
Eluru Fire Accident:ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు, ఆరుగురు సజీవదహనం, 13 మందికి తీవ్రగాయాలు, ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితీ విషమం
Naresh. VNSఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో (chemical factory) మంటలు చెలరేగి ఆరుగురు కార్మికులు మృతి చెందగా, మరో 13 మంది కార్మికులకు గాయాలయ్యాయి. జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డి గూడెం వద్ద పోరస్ (Porus) కెమికల్ ఫ్యాక్టరీలో యూనిట్ 4లో బుధవారం రాత్రి రియాక్టర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది.
Mekatoti Sucharita: నేను రాజీనామా చేశానంటూ కథలు అల్లారు, రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్‌ వెంటే ఉంటానని స్పష్టం చేసిన మాజీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత
Hazarath Reddyఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ నేప‌థ్యంలో అల‌క‌బూనిన రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి మేక‌తోటి సుచ‌రిత (Mekatoti Sucharita) కాసేప‌టి క్రితం అల‌క వీడారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన ఆమె (Former home minister Sucharitha) సీఎం జ‌గ‌న్‌తో గంట‌న్న‌ర‌కు పైగా భేటీ అయ్యారు.
APSRTC: ఏపీలో బస్సు ఛార్జీలు పెరిగాయి, పల్లెవెలుగు సర్వీసులపై రూ. 2 పెంపు, ఇకపై పల్లె వెలుగు బస్సుల్లో మినిమమ్‌ ఛార్జీ రూ. 10, డిజీల్‌ సెస్‌ కింద పెంచామని తెలిపిన ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
Hazarath Reddyఏపీలో బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ( MD Dwarka Thirumala Rao) మీడియాతో తెలిపారు. డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. డీజిల్‌ బల్క్‌ రేటు విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు.
Dharmana Prasada Rao: రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చటమే మా లక్ష్యం, రెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ధర్మాన ప్రసాదరావు
Hazarath Reddyరెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు
MLA RK Roja: మేమంతా జగన్ సైనికులం, ఆయన నమ్మకాన్ని నిలబెడతామని తెలిపిన మంత్రి రోజా, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నగరి ఎమ్మెల్యే
Hazarath Reddyపర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్ర‌మంలో ఆమె భ‌ర్త‌ సెల్వమణి, కుమారుడు, కూతురు, ఇంకా వైసీపీ నేత‌లు కూడా పాల్గొన్నారు.
CM YS Jagan Review: ప్రతీ మండలంలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కాలేజీ, కార్యాచరణ తయారుచేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
Hazarath Reddyవిద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష (CM YS Jagan Review) నిర్వహించారు. నాడు-నేడు రెండో దశ వేగం పెరగాలని, శరవేగంగా పనులు పూర్తి చేయాలని సీఎం (CM YS Jagan) ఆదేశించారు.
Cash Transfer Scheme: ఇకపై రేషన్ బియ్యానికి బదులుగా అకౌంట్లోకి డబ్బులు, మే నెల నుంచి అమల్లోకి తీసుకురానున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు, కిలో బియ్యానికి బదులుగా ఎంతంటే?
Naresh. VNSఏపీలో జగన్ మోహన్ రెడ్డి (YS jagan)సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలక మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలని భావించి.. పరిశీలించి, ఆ తరువాత విరమించుకున్న నగదు బదిలీ విధానాన్ని ఇప్పుడు జగన్ ప్రభుత్వం మళ్ళీ తెరపైకి తెచ్చింది.
CM YS Jagan Review: వైద్య, ఆరోగ్యశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష, ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyవైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష (CM YS Jagan Review) నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను పరిశీలించారు.
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి సర్వ దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తోపులాట, ముగ్గురికి గాయాలు, 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం
Hazarath Reddyతిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స‌ర్వ‌ద‌ర్శ‌నాల టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాల వ‌ద్ద భ‌క్తులు భారీ సంఖ్య‌లో బారులు తీరారు. ఈ క్ర‌మంలో తోపులాట జ‌రిగి, ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.
Srikakulam Train Accident: వెంటాడిన మృత్యువు.. రైలు దిగి పక్క ట్రాక్‌పైకి వెళుతుండగా ఢీ కొట్టిన కోణార్క్‌ సూపర్‌ ఫాస్ట్‌, 5 మంది మృతి.. సీఎం జగన్‌ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ రైల్వే గేటు సమీపంలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం (Srikakulam Train Accident) జరిగింది. రైలు ఢీ కొని ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలవ్వగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Telangana: నన్ను జైలుకు పంపే దమ్మున్న మగాడెవడో రండి, ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించిన సీఎం కేసీఆర్, రేపు మ‌ధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ
Hazarath Reddyకేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జులు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM K Chandrashekar Rao) తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం (24-Hour Deadline to Narendra Modi Govt) ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.
YS Jagan Cabinet 2.0: ఏపీ ఐటీ శాఖా మంత్రిగా గుడివాడ అమర్‌నాథ్‌, విద్యుత్ శాఖా మంత్రిగా పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, సినిమాటోగ్రపీ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
Hazarath Reddyగుడివాడ అమర్‌నాథ్‌కు పరిశ్రమలు, ఐటీ శాఖ, వేణుగోపాల్‌కు బీసీ సంక్షేమం, సినిమాటోగ్రపీ, సమాచార పౌర సంబంధాల శాఖను కేటాయించారు. తానేటి వనితకు హోంశాఖ, అంబటి రాంబాబుకు నీటి పారుదల శాఖ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి విద్యుత్‌ శాఖ, అటవీ పదవులను అప్పగించారు.
YS Jagan Cabinet 2.0: టూరిజం శాఖా మంత్రిగా రోజా, జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి, ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు, పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా (YS Jagan Cabinet 2.0) ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు (Andhra Pradesh Cabinet Revamped) కేటాయించారు.
Sucharitha Quits Assembly: ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా, సీఎం జగన్ వెంటే కొనసాగుతానని వెల్లడి, మాజీ హోం మంత్రి బాటలో పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు
Hazarath Reddyఏపీలో మంత్ర వర్గ పునర్వ్యవస్థీకరణ వ్యవహారం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) ప్రకంపనలను సృష్టిస్తోంది. పదవులను కోల్పోయిన నాయకులు రాజీనామా బాట పట్టారు. కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకుని, అవి అందకపోవడం వల్ల నిరాశకు గురైన ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు.
Andhra Pradesh: ఇకపై జగన్‌ గ్యారేజీలో పనిచేస్తాం, అసంతృప్తి జ్వాలలు త్వరలోనే సర్దుకుంటాయి, రాష్ట్ర, పార్టీ భవిష్యత్‌ కోసం సీఎం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని తెలిపిన మాజీ మంత్రులు
Hazarath Reddyఏపీలో కొత్త మంత్రి వర్గం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీరామారావు తరువాత రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్‌ బడుగు, బలహీన, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయం, ఆర్థిక, సామాజికంగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తాజా మాజీ మంత్రి కొడాలి నాని ( Kodali Nani) అన్నారు.
YS Jagan Cabinet 2.0: ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం, తొలుత మంత్రిగా ప్రమాణం చేసిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఏపీ నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అప్ డేట్స్ ఇవే..
Hazarath Reddyమంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు. మంత్రిగా అంజాద్‌ బాషా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నూతన మంత్రిగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు.