ఆంధ్ర ప్రదేశ్
AP Budget Sessions 2022: అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, ఏడో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, పలు శాఖల బడ్జెట్‌ డిమాండ్లపై కొనసాగుతున్న చర్చలు
Hazarath Reddyఏపీ అసెంబ్లీ (AP Budget Sessions 2022) నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతుండటంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం (11 TDP MLAs suspended for the day) తీసుకున్నారు. 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెన్షన్‌ చేశారు. అశోక్‌, రామ్మోహన్‌, భవాని, చినరాజప్ప, వెంకటనాయుడు, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, రవికుమార్‌, సాంబశివరావు, సత్యప్రసాద్‌లను సస్పెన్షన్‌ చేశారు.
Telangana: తెలంగాణలో ఘోర విషాదాలు, వనపర్తిలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి, పెద్దపల్లి జిల్లాలో మరొకరు మృతి, ఏపీలో రోడ్డు ప్రమాదంలొ మరో ముగ్గురు చిన్నారులు మృతి
Hazarath Reddyవనపర్తి (wanaparthy) జిల్లా కేంద్రంలో విషాదం ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు శవాలుగా (3 children drown in lake) తేలారు. పట్టణంలో బండార్‌నగర్‌కు చెందిన మున్నా, అజ్మద్‌, భరత్‌.. పదో తరగతి చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం సరదాగా వనపర్తి శివారులోని చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు
Andhra Pradesh: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు చిన్నారులు మృతి, మరో ఇద్దిరకి గాయాలు
Hazarath Reddyవిజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. తెర్లాం మండలంలోని టెక్కలి వలస దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకునంది. బైక్‌, స్కూల్ బస్‌ ఢీ కొన్నాయి. ప్రమాద స్థలంలోనే ముగ్గురు పిల్లలు మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.
Andhra Pradesh: చంద్రబాబుతో కాదు, ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం, ఎల్లో మీడియాపై మండిపడిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyవైసీపీ శాస‌న స‌భాప‌క్ష స‌మావేశంలో ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ పోరాటం చేస్తున్న‌ది ఒక్క చంద్ర‌బాబుతో కాద‌ని చెప్పిన సీఎం.. చంద్ర‌బాబుతో ఏమీ కాద‌ని, చంద్ర‌బాబు నథింగ్ అంటూ వ్యాఖ్యానించారు.
Minister Kodali Nani: ఆ 420 బ్యాచ్ సీఎంపై బురద చల్లాలని చూస్తోంది, ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన మంత్రి కొడాలి నాని
Hazarath Reddyఏపీ మంత్రి కొడాలి నాని విప‌క్షాల‌పై మండి పడ్డారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సీట్ల‌లో సొంత అభ్య‌ర్థుల‌తో పోటీ చేసే స‌త్తా ఒక్క వైసీపీకి మిన‌హా మ‌రే ఇత‌ర పార్టీకి లేద‌ని ఆయ‌న (Minister Kodali Nani) తేల్చేశారు. మొత్తం సీట్లు 175 అయితే అందులో 160 సీట్ల‌కు కూడా సొంతంగా పోటీ చేసే స‌త్తా ఏ పార్టీకి (Opposition Parties) కూడా లేద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.
AP Budget Session 2022: ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్, ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్‌‌కు శాసన సభ ఆమోదం, బడ్జెట్‌పై కొనసాగుతున్న చర్చ
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపక్ష తెలుగు దేశం తీరు తీరు మారడం లేదు. పదేపదే సభను (AP Budget Session 2022) అడ్డుకోవడంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ పదకొండు మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ ( Eleven TDP MLAs suspended) చేశారు.
Andhra Pradesh: జగన్ సింగిల్‌గానే పోరాడతారు, పవన్ కళ్యాణ్ ఓ ఊసరవెల్లి, ఎప్పుడు ఏ గుర్తుకు ఓటేయమంటారో తెలియదని వ్యంగ్యం విసిరిన మంత్రి పేర్ని నాని, జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర విమర్శలు
Hazarath Reddyఏపీ మంత్రి పేర్ని నాని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు (Pawan Kalyan's Remarks) కౌంటర్ ఇచ్చారు. రాజకీయ జీవితం ఇచ్చిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం పవన్ సంస్కారం అని వ్యంగ్యం ప్రదర్శించారు. చిరంజీవి లేకుండా పవన్ కల్యాణ్ ఉన్నారా? అని ప్రశ్నించారు.
Covid in AP: ఏపీలో కొత్తగా 26 మందికి కరోనా, అనంతపురం జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా వ్యాప్తి క్షీణదశకు చేరుకున్నట్టే. గడచిన 24 గంటల్లో 5,508 కరోనా పరీక్షలు నిర్వహించగా, 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
Suman on YS Jagan Govt: పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ చిత్తుచిత్తుగా ఓడింది, ఏపీకి మరో రెండు సార్లు జగన్‌ సీఎంగా కొనసాగాలి, అప్పుడే రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతుందని తెలిపిన సినీ నటుడు సుమన్
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చాలా బాగుందని సినీ నటుడు సుమన్ (Suman on YS Jagan Govt) కితాబునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు పేదల్లో చిరునవ్వులు నింపాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే జగన్ మరో రెండు సార్లు ముఖ్యమంత్రి (Actor Suman Comments about CM YS Jagan) కావాలని చెప్పారు.
AP Budget Session 2022: ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌, ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా, సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సీఎం జగన్ ఆగ్రహం
Hazarath Reddyఏపీ శాసన సభ, శాసన మండలి సమావేశాలు(AP Budget Session 2022) వాయిదా పడ్డాయి. తిరిగి రేపు (మంగళవారం) ప్రారంభం కానున్నాయి.నేటి సమావేశాల్లో(Andhra Pradesh Assembly ) ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు. బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులను సెస్పెన్షన్‌ చేశారు.
AP Budget Session 2022: టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్య ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అభ్యంతరం, ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి
Hazarath Reddyఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Budget Session 2022) ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు చేపట్టారు.సభలో టీడీపీ సభ్యుల గందరగోళంతో స్పీకర్‌ సభను 5నిమిషాల పాటు వాయిదా వేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై సభలో టీడీపీ (TDP) ఆందోళనకు దిగింది.
Coronavirus in AP: ఏపీలో బాగా తగ్గిపోయిన యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 57 మందికి కరోనా, అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు
Hazarath Reddyఏపీలో కొవిడ్ మహమ్మారి ప్రభావం క్షీణదశకు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య బాగా పడిపోయింది. ప్రస్తుతం ఏపీలో 606 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో 11,980 కరోనా పరీక్షలు నిర్వహించగా, 57 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
Prabhas Fan Commits Suicide In Kurnool: రాధేశ్యాం సినిమా చూసి మనస్థాపంతో ప్రభాస్ అభిమాని ఆత్మహత్య, మృతుడి తల్లి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు..
Krishnaతమ అభిమాన హీరో నటించిన సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడం, సినిమా ఫ్లాప్ అయిందని నెగిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమాని ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
AP 10th Exams Postponed: ఏపీ టెన్త్‌ విద్యార్థులకు అలర్ట్‌, పదో తరగతి పరీక్షలు వాయిదా, కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఎప్పుడంటే..
Krishnaఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. నిజానికి విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే రెండో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దీనిని తొమ్మిదో తేదీకి మార్చనున్నట్లు సమాచారం.
Road Accident At Jaggayyapet: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టిన కారు నలుగురి మృతి, హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెం వెళుతుండగా ప్రమాదం
Krishnaకృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును ఒక కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Suspected Deaths In West Godavari: జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలు, ఇప్పటివరకు 18 మంది మృతి, కల్తీ మద్యమే కారణమంటున్న టీడీపీ, రూ. 25 లక్షలు పరిహారం డిమాండ్ చేసిన లోకేష్, లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మంత్రి నాని ప్రకటన
Naresh. VNSపశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలోమిస్టరీ మరణాలు (Mystry deaths)కలకలం రేపుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో వరుసగా జరుగుతున్న మరణాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే కల్తీ సారా వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Rare Kachidi Fish Caught In AP: అంతర్వేది మత్స్యకారుడి వలలో చిక్కిన కచ్చిడి చేప, దీని ధర ఎంతో తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, చైనాలో దీనికి ఫుల్ డిమాండ్..
Krishnaతూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ లో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 26 కిలోల కచ్చిడి చేప చిక్కింది. దానిని అమ్మకానికి పెట్టగా.. పాలకొల్లు వ్యాపారులు రూ.79 వేలకు కొనుగోలు చేశారు.
Students Ill After Midday Meal: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్, 85 మంది విద్యార్ధులకు తీవ్ర అస్వస్థత, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కలకలం, పాడైన గుడ్లు తినడం వల్లనే అస్వస్థతకు గురయ్యారంటూ తల్లిదండ్రుల ఆందోళన
Naresh. VNSఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మధ్యాహ్న భోజనం (Midday Meal) వికటించి 85 మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కర్నూలు (Kurnool), అనంతపురం (Ananthapur) జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాల, అనంతపురం జిల్లా పిల్లిగుండ్ల కాలనీల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి
Corona in AP: ఏపీలో కొత్తగా 46 మందికి కరోనా, గుంటూరు జిల్లాలో 11 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 12,092 కరోనా పరీక్షలు నిర్వహించగా, 46 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు జిల్లాలో 11 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 134 మంది కరోనా నుంచి కోలుకున్నారు.