ఆంధ్ర ప్రదేశ్
Babu Jagjivan Ram Birth Anniversary: జ‌నం కోసం జీవితాన్ని అంకితం చేసిన తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని, బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని కొనియాడిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyజ‌నం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు.
Corona in Andhra Pradesh: కరోనా థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి, స్పందన సమీక్షలో ఏపీ సీఎం వైయస్ జగన్, రాష్ట్రంలో తాజాగా 3,042 మందికి కరోనా, 3,748 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గడంతోపాటు, రికవరీల రేటు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 88,378 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,042 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 28 మంది మృత్యువాత పడ్డారు.
Centre Appoints 8 New Governors: మిజోరాం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, హర్యానాకు బదిలీ అయిన దత్తాత్రేయ, 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించిన కేంద్రం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి భవన్
Hazarath Reddyదేశంలో ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు (Centre Appoints 8 New Governors) నియమితులయ్యారు. కొంతమందికి స్థానం చలనం కల్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. మిజోరాం గవర్నర్‌గా విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు ( Kambhampati Hari Babu Mizoram) నియమితులయ్యారు.
AP ZPTC And MPTC Elections Row: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ తీర్పు మా హక్కులను కాలరాసే విధంగా ఉంది, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు, ఈ నెల 27న అన్నింటినీ విచారిస్తామని తెలిపిప ధర్మాసనం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు (AP ZPTC And MPTC Elections Row) ఎక్కడ నుంచి ఆగిపోయాయో అక్కడ నుంచి తిరిగి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)ను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు (High Court Single bench Judgement) తమ హక్కులను కాలరాసే విధంగా ఉందంటూ ఆ ఎన్నికల్లో పోటీచేసిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
Schools Reopening in AP: ఏపీలో ప్రతిరోజూ స్కూళ్లు తెరవాల్సిందే, స్పష్టం చేసిన పాఠశాల విద్యాశాఖ, టీచర్లు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాలని ఆదేశాలు, విద్యార్థులను స్కూళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రప్పించవద్దని తెలిపిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ రోజూ తెరవాల్సిందేనని విద్యా శాఖ స్పష్టం చేసింది. టీచర్లు (Teachers) మాత్రమే ఆల్టర్నేటివ్‌ (రోజువిడిచి రోజు) విధానంలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ (Andhra Pradesh Department of School Education) ఉత్తర్వుల్లో తెలిపింది.
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు, కరోనా బారీన పడిన ఉద్యోగులకు 20 రోజుల వరకు సెలవులు, వీఆర్‌వోలు ఇకపై నేరుగా సీనియర్‌ అసిస్టెంట్లు, ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో కరోనావైరస్ బారినపడిన ప్రభుత్వ ఉద్యోగులకు (government employees) జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కోవిడ్ వైరస్ బారినపడిన ఉద్యోగులకు 20 రోజుల వరకు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Oxygen Plant in Nellore: నెల్లూరు ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపిన బాలీవుడ్ నటుడు, సోనూసూద్ ఆక్సిజన్‌ ప్లాంట్‌‌కు హారతులిచ్చిన నెల్లూరు ప్రజలు, ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన సోనూ
Hazarath Reddyసినీన‌టుడు సోనూసూద్ సాయంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ నెల్లూరుకు చేరుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ప్ర‌జ‌లు దానికి హార‌తులు ఇస్తూ, బాణ‌సంచా కాల్చుతూ సంబ‌రాలు చేసుకున్న వీడియోను సోనూసూద్ ఈ రోజు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఘ‌న‌స్వాగ‌తం ప‌లికినందుకు నెల్లూరు ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌తలు చెబుతున్న‌ట్లు సోనూసూద్ పేర్కొన్నారు.
Andhra Shocker: నీ చెల్లెలిని కాపురానికి పంపుతావా లేదా.., తాగిన మత్తులో బావను బీరు బాటిల్‌తో పొడిచిన బామర్ది, నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyనెల్లూరు జిల్లాలో మద్యం మత్తులో బావను బీర్‌ బాటిల్‌తో పొడిచి బావమరిది దారుణంగా హత్య చేసిన ఘటన (Man kills brother-in-law in Nellore ) చోటు చేసుకుంది. సోమవారం బోడిగాడితోట శ్మశాన వాటిక వద్ద ఈ హత్యా ఘటన జరిగింది.
Police Recruitments in AP: ఏపీలో పోలీసు ఉద్యోగాలపై శుభవార్త.. ఏటా 6,500 మందికి పోలీస్ ఉద్యోగాలు, రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు, కొత్త నియామకాలపై యువత అపోహలు, సందేహాలు పెట్టుకోవద్దని సూచించిన డీజీపీ గౌతం సవాంగ్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు (large-scale recruitment, next three years) చేపడతామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( DGP Gautam Sawang) చెప్పారు. వచ్చే ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ నుంచి ఏడాదికి 6,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని భర్తీ (Police recruitment) చేస్తామని ఆయన వెల్లడించారు.
Air Travel: దేశీయ విమాన సర్వీసుల సామర్థ్యం 65 శాతానికి పెంపు; హైదరాబాద్ విమానాశ్రయంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, జూన్ నెలలో 4.35 లక్షల మంది ప్రయాణం
Team Latestly65 శాతానికి డొమెస్టిక్ ప్రయాణాలకు విమాన సర్వీసులను పెంచుతున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది, జూలై 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది....
Corona in AP: ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు, తాజాగా 3,435 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌, కొత్తగా 2,100 మందికి కరోనా పాజిటివ్‌, వ్యాక్సినేషన్‌పై మరింత ధ్యాస పెట్టాలని సమీక్షలో తెలిపిన ఏపీ సీఎం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గడంతోపాటు, రికవరీల రేటు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 72,731 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,100 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in AP) నిర్థారణ అయ్యింది.
CM Jagan Writes to Union Ministers: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది, కేంద్ర మంత్రులకు లేఖల ద్వారా ఫిర్యాదు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, తెలంగాణ ప్రాజెక్టులు సందర్శించాకే ఏపీ ప్రాజెక్టులు సందర్శించాలని లేఖలో తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyకృష్ణా జలాలపై తెలంగాణ నిబంధనలు ఉల్లంఘిస్తోందని.. ఆ రాష్ట్ర వైఖరితో ఏపీ తన వాటా జలాలను కోల్పోతోందని ఏపీ సీఎం వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) అన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, ప్రకాష్‌ జవదేకర్‌కు (union ministers Shekhawat, Javadekar) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వేర్వేరుగా లేఖలు (Cm Jagan Writes to Union Ministers) రాశారు.
AP Curfew Relaxation Update: ఏపీలో మారిన కర్ఫ్యూ సమయం, ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు సడలింపులు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపుల్లో పలు మార్పులు (Covid 19 Curfew Relaxation Timings Changed) ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో ఏపీ సర్కారు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ఫ్యూ సడలింపు (Covid 19 Curfew Relaxation) సమయాల్లో మార్పులు చేసింది.
Insurance Schemes in AP: సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ఆ నాలుగు రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ నెల రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు, బీమా పథకాల వివరాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyపేద కుటుంబాలకు అండగా ఉంటున్న బీమా పథకాల క్లెయిమ్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం (Government of Andhra Pradesh) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ను 30 రోజుల్లో పరిష్కరించాలని (4 Insurance Scheme Claims Within one month) స్పష్టం చేసింది.
Krishna Water Dispute: ఏపీ ప్రభుత్వానివి నిరాధారమైన ఆరోపణలు, నిబంధనలకు లోబడే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం, కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం (Krishna River Water Dispute) మరింతగా ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నిబంధనలు దాటి విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు (Krishna Water Disputes Tribunal) ఫిర్యాదు చేసింది.
CM Jagan to Visit YSR District: సొంత జిల్లాకు ఏపీ ముఖ్యమంత్రి, జూలై నెల 8, 9వ తేదీల్లో వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్న వైయస్ జగన్, 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన కలెక్టర్‌ సి.హరికిరణ్‌
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి జూలై నెల 8, 9వ తేదీల్లో వైయస్సార్ జిల్లా పర్యటనకు (CM Jagan to Visit YSR District) రానున్నారు. 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం (AP CM YS Jagan Mohan Reddy) అయిన తర్వాత తొలిసారిగా ఆయన బద్వేలు రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
AP Shocker: ఆ సాఫ్ట్‌వేర్ హిజ్రా, ఆడగొంతుతో నిరుద్యోగులతో మాటలు కలిపి రూ.15.12 లక్షలు కాజేశాడు, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన అమలాపురం పోలీసులు
Hazarath Reddyఆడ పిల్లలా మాట్లాడుతూ నిరుద్యోగుల నుండి ఉద్యోగాలు ఇప్తిస్తానని నమ్మబలికి రూ.15.12 లక్షలు మోసం చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ను అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ట్విస్ట్ ఏమిటంటే అతను హిజ్రా కావడంతో అచ్చం ఆడగొంతులా అతని వాయిస్ ఉండటం.
Drones Flying Near Srisailam Temple: శ్రీశైలం మహాక్షేత్రం దగ్గర డ్రోన్ల కలకలం, రహస్యంగా ఆలయ పరిసర ప్రాంతాల సమాచారం సేకరించిందనే అనుమానాలు, డ్రోన్ల కదలికలను తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం (Drones Flying Near Srisailam Temple) సృష్టిస్తున్నాయి. గుర్తు తెలియని డ్రోన్‌ నాలుగు రోజులుగా శ్రీశైల మహాక్షేత్రంలో అత్యంత ఎత్తులో చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలుస్తోంది.
Rain Forecast: రాబోయే రెండు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, జూలై చివరి నాటికి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేసిన ఐఎండీ
Team Latestlyఆదివారం పలుచోట్ల కురిసిన వర్షానికి వాతావరణం వేడిగా మారింది. గాలిలో తేమ పెరిగి ఉక్కపోత ఎక్కువైంది. అలాగే గడిచిన ఒక్కరోజులో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత 37.1 డిగ్రీల సెల్సియస్ ఆదిలాబాద్‌లో....