ఆంధ్ర ప్రదేశ్
AP SSC, Inter Exams Cancelled: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు, సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్‌ కమిటీ ఏర్పాటు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు (AP SSC, Inter Exams Cancelled) చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు.
Second Wave in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4,981 కోవిడ్ కేసులు మరియు 38 మరణాలు నమోదు; గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 6,464 మంది కరోనా నుంచి రికవరీ
Team Latestlyగడిచిన మే నెలలో రాష్ట్రంలో రోజూవారీ కోవిడ్ కేసులు 21 వేల మార్కును దాటగా, ఇది జరిగిన కొన్ని వారాల వ్యవధిలోనే కేసులు గణనీయంగా తగ్గుముఖంపట్టాయి. వారం రోజుల నుంచి రోజూవారీ కోవిడ్ కేసులు 5 వేలకు దిగువలో...
SC on Class 12 Results: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ వైఖరిపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం, ఒక్కో విద్యార్థికి కోటి పరిహారం ఇవాల్సి ఉంటుందని హెచ్చరిక; జూలై 31లోపు ఫలితాల వెల్లడికి ఆదేశం
Team Latestlyఒక్క విద్యార్థికి ప్రాణాపాయం ఏర్పడినా రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని సుప్రీం హెచ్చరించింది. ఇతర రాష్ట్రాల బోర్డులు పరీక్షలను రద్దు చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు భిన్నంగా వ్యవహరించాలనుకుంటుందని సుప్రీం ప్రశ్నించింది...
COVID in Andhra Pradesh: గుడ్ న్యూస్, ఏపీలో పెరుగుతున్న డిశ్చార్జ్ సంఖ్య, తాజాగా 7,324 మంది కోలుకుని ఇంటికి, కొత్తగా 4,684 కేసులు నిర్ధారణ, ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80,712 పరీక్షలు నిర్వహించగా.. 4,684 కేసులు నిర్ధారణ (COVID in Andhra Pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,62,036 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
CM YS Jagan Reply to Chiranjeevi Tweet: చిరంజీవి ట్వీట్‌కు రిప్లయి ఇచ్చిన సీఎం వైయస్ జగన్, ఏపీ ప్రభుత్వం తరపున చిరంజీవికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు, రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరగడానికి ప్రభుత్వ యంత్రాంగం సమష్టి కృషి ఎంతగానో ఉందని తెలిపిన ముఖ్యమంత్రి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టినందుకుగాను మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు జల్లు కురిపించిన విషయం తెలిసిందే. చిరంజీవి ట్వీట్‌పై సీఎం జగన్‌ ట్విటర్‌లో స్పందించారు.
Kurnool Shocker: కర్నూలులో దారుణం, కరోనా మనస్తాపంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, కృష్ణా జిల్లాలో విషాదంగా మారిన ముగ్గురు చిన్నారుల అదృశ్యం
Hazarath Reddyకర్నూలు నగరంలోని వన్‌టౌన్‌ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. విషం తాగి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబంలోని నలుగురు మృత్యుఒడిలోకి (Four of family die by suicide in Kurnool) చేరుకున్నారు. మృతులలో దంపతులు ప్రతాప్‌, హేమలత వారి పిల్లలు జయంత్‌, రిషిత ఉన్నారు.
Chiranjeevi Praises CM YS Jagan Govt: జగన్ సర్కారుపై హీరో చిరంజీవి ప్రశంసల జల్లు, రికార్డు స్థాయి వ్యాక్సినేషన్‌‌పై హర్షం వ్యక్తం చేసిన మెగాస్టార్, ముఖ్యమంత్రి ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్నారంటూ అభినందనలు
Hazarath Reddyఏపీలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.
Covid in AP: వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న ఏపీ, తగ్గుముఖం పట్టిన కేసులు, తాజాగా 4,169 మందికి కోవిడ్, 24 గంటల్లో 8,376 మంది రికవరీ, ప్రస్తుతం 53 వేల 880 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 74,453 పరీక్షలు నిర్వహించగా.. 4,169 కేసులు ( Coronavirus) నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 53 మంది మరణించారు. ఇప్పటివరకూ 18 లక్షల 57 వేల 352కి కరోనా సోకింది. మొత్తం12,416 మంది మృతి (Covid Deaths) చెందారు. ప్రస్తుతం 53 వేల 880 యాక్టివ్‌ కేసులు ఉండగా 17లక్షల 91 వేల 56 మంది రికవరీ అయ్యారు. ఏపీలో 24 గంటల్లో 8,376 మంది రికవరీ అయ్యారు.
Guntur Rape Case: గుంటూరులో యువతిపై దారుణంగా అత్యాచారం, అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారని తెలిపిన హోం మంత్రి, సీరియస్‌గా తీసుకున్న జగన్ సర్కారు
Hazarath Reddyగుంటూరు జిల్లాలో యువతి అత్యాచారం కేసులో (Guntur Rape Case) పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఇప్పటికే పోలీసులు చాలా మందిని విచారించారని, నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
YSR Cheyutha Scheme 2021: రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకం, 45-60 ఏళ్ల వయసు మహిళలకు రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందించిన సీఎం జగన్, 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి
Hazarath Reddyరాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకం (YSR Cheyutha Scheme 2021) కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మహిళలకు రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందించింది.
Covid in Andhra: ఏపీలో కొత్తగా 2,620 కేసులు నమోదు, 7,504 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌, ఏపీలో ప్రస్తుతం 58,140 యాక్టివ్‌ కేసులు, రికార్డు స్థాయిలో వ్యాక్సిన్‌ వేసిన సిబ్బందికి అభినందనలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyగత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 44 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,363 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 7,504 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 17 లక్షల 82 వేల 680 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
DSC 2008 Candidates: 2008 డీఎస్సీ అభ్యర్థులకు జగన్ సర్కారు గుడ్‌ న్యూస్‌, 2,193 మంది అభ్యర్థులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ, ఎస్జీటీలుగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ వర్తింపజేస్తున్నట్లు వెల్లడి
Hazarath Reddyరాష్ట్ర ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వీరికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. 2,193 మంది డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్జీటీలుగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ వర్తింపజేస్తున్నట్లు (DSC 2008 candidates promoted to SGTs) పేర్కొంది
Protest Against AP Job Calendar: జాబ్‌ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ ముందు నిరుద్యోగులు నిరసన, వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్
Hazarath Reddyప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ముందు నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు (Protest Against AP Job Calendar) నిర్వహించారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం కోట క్రాస్ రోడ్స్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు మానవ హారం కట్టారు.
Guntur Shocker: కాబోయే భర్త కళ్ల ముందే యువతిపై దారుణంగా అత్యాచారం, గుంటూరు సీతానగరం పుష్కర్‌ ఘాట్‌ సమీపంలో దారుణ ఘటన, నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌
Hazarath Reddyగుంటూరు జిల్లా సీతానగరం పుష్కర్‌ ఘాట్‌ సమీపంలో శనివారం రాత్రి ఓ యువతి అత్యాచారానికి గురైంది. ప్రియుడితో కలిసి కృష్ణా నది ఒడ్డున సేదతీరేందుకు వెళ్లిన ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి జరిపారు. యువకుడిని బంధించి, యువతిపై అత్యాచారానికి (Two men molest on woman) తెగబడ్డారు.
Andhra Pradesh Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌, గవర్నర్ కోటా కింద నామినేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం
Hazarath Reddyగవర్నర్‌ కోటా కింద నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌లు ఎమ్మెల్సీలుగా సోమవారం అసెంబ్లీలో (Assembly) ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్సీల చేత ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శ్రీ రంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు.
Telangana Unlock: తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటకకు ప్రారంభమైన బస్సు సర్వీసులు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు బస్సుల రాకపోకలు, కర్ణాటకకు శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు బస్సులు బంద్‌
Hazarath Reddyతెలంగాణ ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు (Interstate bus services) ప్రారంభమయ్యాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు (Bus Services) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభించనుండగా, మంగళవారం నుంచి మహారాష్ట్రలోని ప్రాంతాలకు మొదలుకానున్నాయి.
Corona in AP: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో గత రికార్డును బ్రేక్ చేసిన జగన్ ప్రభుత్వం, ఒక్కరోజులోనే 11 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్, ఏపీలో తాజాగా 5,646 కరోనా కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 63,068 యాక్టివ్ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,00,001 నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,646 కరోనా కేసులు (Andhra Pradesh sees 5,646 COVID cases) నమోదయ్యాయి. మరో 50 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.
Telangana: రేపటి నుంచి తెలంగాణ నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు, అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు అంగీకారం తెలిపిన కేసీఆర్ సర్కారు, కర్ఫ్యూ నిబంధనలకు అనుగుణంగా నడవనున్న ఆర్టీసీ బస్సులు, బెంగుళూరు మినహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు టీఎస్‌‌ఆర్టీసీ బస్‌ సర్వీసులు
Hazarath Reddyతెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తేయడంతో అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు (Inter-State Transmission) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ (Lockdown in Telangana) నేటి నుంచి ఎత్తివేతతో అంతర్‌ రాష్ట్ర సర్వీసులు రేపటి నుంచి యథావిధిగా నడవనున్నాయి.
Telangana Lockdown Ends: ఈ పాస్ అవసరం లేదు, తెలంగాణ సరిహద్దులో ఆంక్షలు ఎత్తివేసిన అధికారులు, అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలపై ఇంకా రాని క్లారిటీ, ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ
Hazarath Reddyతెలంగాణలో నేటి నుంచి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన (Telangana Lockdown Lifted) నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలకు ఆటంకాలు తొలగిపోయాయి. ఇకపై పాస్ అవసరం లేకుండానే తెలంగాణలోకి (Telangana) రావచ్చని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి నుంచే ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా తెలంగాణలోకి వాహనాలను అనుమతిస్తున్నారు.
Mega Vaccine Drive in AP: ఏపీలో కొనసాగుతున్న మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌, రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం, 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు
Hazarath Reddyఏపీలో మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్‌ నడుస్తోంది. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్‌ (Mega Vaccine Drive in AP) జరుగుతోంది. మ.12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి వ్యాక్సిన్ (Vaccination) వేశారు. ప.గో జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా 59వేల మందికి.. విశాఖ జిల్లాలో 50వేలు.. తూ.గో జిల్లాలో 42వేల మందికి వ్యాక్సిన్‌ వేశారు.