ఆంధ్ర ప్రదేశ్

YSR Vahana Mitra: డ్రైవర్ల అకౌంట్లోకి రూ.10 వేలు, మూడో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర నిధులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, 2.48 లక్షల మంది అకౌంట్లలో రూ.248.47 కోట్ల నగదు జమ

Hazarath Reddy

వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర నిధులను ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) విడుదల చేసింది. పాదయాత్రలో ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల కష్టాలను చవిచూసిన వైయస్ జగన్ వాహనమిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఏటా జూలైలో విడుదల చేయాల్సి ఉండగా కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది నెల రోజుల ముందుగానే వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

MANSAS Trust Chairman Dispute: మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ వ్యవహారం,హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్న ఏపీ ప్రభుత్వం, చట్టప్రకారం, న్యాయబద్ధంగా చేస్తామని తెలిపిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, నారా లోకేష్‌ అటు పిల్లాడు కాదు..ఇటు పెద్దవాడు కాదంటూ ఎద్దేవా

Hazarath Reddy

మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ (మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా (MANSAS trust chairman) సంచయిత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఆమె నియామకం చెల్లదని పేర్కొంది. మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారంలో హైకోర్టు (Andhra Pradesh High Court) తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

Degree Courses in English Medium: ఇకపై డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే, అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యామండలి సూచన

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఆంగ్ల మాధ్యమంలో (Degree Courses in English Medium) మాత్రమే అమలు కానున్నాయి. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి (English-medium education) మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది.

Coronavirus in AP: ఏపీలో అత్యంత తక్కువగా కరోనా కేసులు నమోదు, తాజాగా 4,549 మందికి కోవిడ్, 10,114 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 80,013 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో 87,756 నమూనాలను పరీక్షించగా..4,549 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,14,393 మంది వైరస్‌ బారినపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement

Guntur: ఆనందయ్య కరోనా మందు అంటూ అమ్మకాలు, ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.200, గుంటూరులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతని వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదు, 150 ప్యాకెట్ల మందు స్వాధీనం

Hazarath Reddy

గత కొద్ది కాలంగా ఆనందయ్య కరోనా మందు పేరు ప్రముఖంగా వార్తల్లో వినిపిస్తోంది. ఈ మందు కరోనాని నయం చేస్తుందని, కరోనా రాకుండా కాపాడుతుందనే వార్తల నేపథ్యంలో నెల్లూరు ఆనందయ్య కరోనా మందుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అయితే దీన్ని కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

Andhra Pradesh: ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు భరోసానిస్తూ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, కోవిడ్‌తో మరణించిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు, స్టాఫ్‌ నర్సుకి రూ.20 లక్షలు,ఎమ్‌ఎస్‌ఓలకు రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

Hazarath Reddy

కరోనా నియంత్రణలో ముందుండి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది. జూనియర్‌ డాక్టర్ల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ను నెరవేర్చింది. కోవిడ్‌తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా (Government announces ex-gratia to covid frontline workers) ప్రకటించింది.

Brahmamgari Matham Dispute: బ్రహ్మంగారి మఠం వద్ద హైటెన్షన్‌, శివస్వామి నిర్ణయం కరెక్ట్ కాదని తెలిపిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, చట్టప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం, కొనసాగుతున్న బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి సస్పెన్స్

Hazarath Reddy

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ (Brahmamgari Matham Dispute) కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పందించారు. బ్రహ్మంగారి మఠం విషయంలో చట్టప్రకారం వెళ్తామని మంత్రి (AP Minister Vellampalli Srinivas) స్పష్టం చేశారు. వీలునామా చట్టప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్‌కు చేరాలని తెలిపారు. పీఠాధిపతులతో కమిటీ వేసి చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Anantapur Shocker: కరోనాతో తండ్రి మృతి, వేదన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న తల్లీకూతురు, అనంతపురం తాడిపత్రిలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్యకు (mother and daughter sucide) పాల్పడ్డారు. ఏడాది కిందట తండ్రి రామకృష్ణారెడ్డి కరోనా బారినపడి మృతి చెందగా, సోమవారం సచివాలయ కార్యదర్శి అపర్ణ, తల్లి వెంకటరమణమ్మ ఆత్మహత్య (sucide in ananthapur district) చేసుకున్నారు.

Advertisement

Andhra Pradesh: మహిళతో అక్రమ సంబంధం, భార్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన కానిస్టేబుల్, నిందితుడిపై కేసు నమోదు, కృష్ణా జిల్లా కంచికచర్లలో దారుణ ఘటన

Hazarath Reddy

ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్లలో దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ తన భార్య మీద దాడిచేసి తీవ్రంగా కొట్టాడు. వత్సవాయి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సునీల్ అనే వ్యక్తి తన భార్య నవ్య పై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

Covid in AP: కుటుంబాన్ని కాటేసిన కరోనా, రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి, ఏపీలో పెరుగుతున్న డిశ్చార్జ్ రేటు, తాజాగా 12,492 మంది కోలుకుని ఇంటికి, కొత్తగా 6,770 మందికి కరోనా పాజిటివ్‌

Hazarath Reddy

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,02,876 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,770 మందికి కరోనా పాజిటివ్‌గా (coronavirus cases) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,06,949 మందికి కరోనా వైరస్‌ (Coronavirus in AP) సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 58 మంది మృత్యువాతపడ్డారు.

Andhra Pradesh: ఇంత దారుణమా.. మూడేళ్ల చిన్నారి గొంతు కోసి చంపేసిన మేనమామ, తల్లి పక్కనే నిద్రిస్తూ తిరిగిరాని లోకాలకు చిన్నారి, పరారీలో నిందితుడు, విజయనగరం జిల్లాలో దారుణ ఘటన

Hazarath Reddy

విజయ నగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత మేనమామ చేతిలో మూడేళ్ల చిన్నారి దారుణ హత్యకు (Youngster Kills 3-Year-Old Niece) గురైంది. తల్లి పక్కనే నిద్రిస్తున్నచిన్నారి గొంతు కోసి ఆ కసాయి ప్రాణాలు తీశాడు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

Amabati vs Raghu Rama: రఘురామకు సీఎం జగన్ టీం భారీ ట్విస్ట్, రియల్ ఫేస్ రఘురాజు అంటూ ట్విట్టర్లో వీడియోని ట్వీట్ చేసిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు, రఘు రామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు మరో సారి ఫిర్యాదు చేసిన ఎంపీ మార్గాని భరత్

Hazarath Reddy

గత కొంత కాలంగా ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ వస్తున్న రెబల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుకు పార్టీ ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు (YSRCP MLA Ambati Rambabu) భారీ షాక్ ఇచ్చారు. ట్విట్టర్లో ఆయన ఓ వీడియో రెబల్ ఎంపీ మీద పోస్ట్ చేసిన దానిి కేంద్ర మంత్రులకు ట్యాగ్ చేశాడు.

Advertisement

Coronavirus in AP: ఏపీలో రోజు రోజుకు తగ్గుతున్న కరోనా కేసులు, తాజాగా 6,952 మందికి కోవిడ్ పాజిటివ్‌, 58 మంది మృత్యువాత, 11,577 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌, ప్రస్తుతం 91,417 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,08,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,952 మందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus in AP) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,03,074 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 58 మంది మృత్యువాతపడ్డారు.

Krishna Shocker: పెళ్లన్నాడు, కామవాంఛలు తీర్చుకున్నాడు, యువతి గర్భవతి అని తెలిసి ప్లేటు ఫిరాయించాడు, నమ్మించి మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై కేసు పెట్టిన యువతి, కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో ఘటన

Hazarath Reddy

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి పేరుతో బాలికపై లైంగిక దాడి (Man Arrested For Molesting Girl) చేసి ఆపై మోసం చేసిన ఓ వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు కూచిపూడి ఎస్‌ఐ జీ సత్యనారాయణ తెలిపారు.

Road Accident in Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొన్న కారు, ముగ్గురు వ్యక్తులు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు, కూలీ పనులకు వెళుతుండగా విషాద ఘటన

Hazarath Reddy

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బూదవాడ సమీపంలో బద్వేల్‌–పామూరు రహదారిపై శుక్రవారం సాయంత్రం ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో (Road Accident in Nellore) ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Monsoon 2021 Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, హెచ్చరించిన వాతావరణశాఖ అధికారులు

Hazarath Reddy

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం శనివారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఒడిశా మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదలవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Advertisement

CM Jagan's Delhi Tour: మూడు రాజధానులు ఏర్పడటం ఖాయం, ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా కేంద్రం సహకారం తప్పక ఉంటుంది, సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షానికి అంత కడుపు మంట ఎందుకు? మీడియాతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన సాగిందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Government Advisor Sajjala Ramakrishna Reddy) తెలిపారు. పోలవరం, విభజన హామీలు, పెండింగ్‌ అంశాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను ఈ పర్యటనలో కేంద్రం ముందుంచారని ఆయన స్పష్టం చేశారు.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8,239 కోవిడ్19 కేసులు మరియు 61 మరణాలు నమోదు, మరో 11 వేలకు పైగా రికవరీ; నేటి నుంచి రాష్ట్రంలో ప‌గ‌టి పూట క‌ర్ఫ్యూ సడలింపులు పెంపు

Team Latestly

రాష్ట్రంలో వైరస్ ఉధృతి ఇంకా తగ్గని నేపథ్యంలో కర్ఫ్యూను మరో పది రోజులు పొడిగించాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈరోజు నుంచి మరో రెండు గంటల పాటు సడలింపులను పెంచారు...

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఆవిష్కృతం, స్పిల్ వే మీదుగా గోదావరి నీరు డెల్టాకు విడుదల, ప్రాజెక్టు ఇంకా నిర్మాణంలో ఉండగానే అందిన తొలి ఫలితం

Team Latestly

పోలవరం ప్రాజెక్ట్‌లో నేడు తొలి ఫలితానికి అంకురార్పణ జరిగింది. ప్రాజెక్టు నుంచి డెల్టాకు స్పిల్ వే మీదుగా ఈరోజు గోదావరి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా గోదావరిలో వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి కావడంతో స్పిల్‌వే మీదుగా నీటిని మళ్లించారు...

CM Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్ దిల్లీ టూర్, ఏపికి తిరుగు ప్రయాణం; రెండు రోజుల పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుసగా జరిగిన సమావేశాలు మరియు చర్చల విశేషాలు ఇలా ఉన్నాయి

Team Latestly

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఇప్పుడు విజయవాడ తిరుగు ప్రయాణమయ్యారు. కాగా, ఈ పర్యటనలో హోం మంత్రి అమిత్ షా సహా మొత్తం ఆరుగురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిశారు....

Advertisement
Advertisement