ఆంధ్ర ప్రదేశ్

AP Coronavirus: ఏపీలో తాజాగా 14,669 కరోనా కేసులు, 24 గంటల్లో 71 మంది మృతి, వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 74,681 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వహించగా.. 14,669 మందికి పాజిటివ్ (AP Coronavirus) వ‌చ్చిన‌ట్లు తేలింది. కరోనా కార‌ణంగా కొత్త‌గా 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధ‌వారం విడుద‌ల చేసిన బులిటెన్ లో వెల్ల‌డించింది.

AP SSC, Inter Exams 2021: విద్యార్ధుల జీవితాలతో ఆటలొద్దు, పాస్‌ అని ఇస్తే విద్యార్థులే నష్టపోతారు, అన్ని జాగ్రత్తలతో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తాం, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

టెన్త్‌ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‌కే నష్టమని ఏపీ సీఎం జగన్‌ (AP CM YS Jagan) పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ గురించి తన కంటే ఎవరూ ఎక్కువగా ఆలోచించరన్నారు. పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్‌ అని ఇస్తే.. భవిష్యత్‌లో విద్యార్థులు నష్టపోతారన్నారు.

Guntur Shocker: నా కూతుర్నే ప్రేమిస్తావా..యువకుడి కాళ్లు చేతులు నరికేసిన ప్రియురాలి బంధువులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన ప్రియుడు, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో దారుణ ఘటన

Hazarath Reddy

తమ కుమార్తెను ప్రేమించాడనే కారణంతో యువతి తరపు బంధువులు యువకుడిపై దారుణానికి (Man murders a young guy) పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది.

Moderate Rains: రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి, బలహీన పడిన ఉపరితల ఆవర్తనం, హైదరాబాద్‌లో భానుడి భగభగలు

Hazarath Reddy

గ్రేటర్‌లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు ఎండతీవ్రతకు అల్లాడుతున్నారు. నగరంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు రోజుకు సగటున 38 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అయితే తర్వాత వారం రోజులపాటు ఎండలు తగ్గాయి. మళ్లీ ఆరు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Advertisement

APSRTC: భారీగా తగ్గిన ఏపీఎస్ఆర్టీసీ ఆదాయం, డిమాండ్ లేని రూట్లలో బస్సులు రద్దు, తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ, సొంత నిధులతో 150 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి

Hazarath Reddy

కరోనావైరస్ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలను ఆర్టీసీ అమల్లోకి (APSRTC implemented government guidelines) తీసుకువచ్చింది. ఇకపై బస్సుల్లో గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే మంగళవారం నుంచి అనుమతిస్తోంది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఈ నెలలో రోజుకు సగటున 57 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. సోమవారం ఆక్యుపెన్సీ రేటు 50 శాతానికే పరిమితమైంది.

Jagananna Vidya Deevena: జగనన్న వసతి దీవెన, రూ.1,048.94 కోట్లను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ

Hazarath Reddy

Vizag Coronavirus: మృత్యువుతో పోరాడి ఓడిన పసిపాప, భూమీ మీదకు వచ్చిన 15 నెలలకే కరోనాతో కన్నుమూత, ఆక్సిజన్ అందక విశాఖ కేజీహెచ్‌లో ప్రాణాలు వదిలిన చిన్నారి సన్విత, విషాదంలో తల్లిదండ్రులు

Hazarath Reddy

విశాఖపట్నం కేజీహెచ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ అందక, ఊపిరి కోసం ఎదురు చూసి, చూసి మరీ ఓ చిన్నారి (One-and-Half-Year-Old Baby Dies of COVID-19) కన్నుమూసింది. విశాఖపట్నం కేజీహెచ్‌లోని (King George Hospital) కొవిడ్‌ వార్డు బయటే ఈ విషాదం చోటు చేసుకుంది.

AP Lockdown Row: లాక్‌డౌన్ మీద జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు, లాక్‌డౌన్ విధిస్తే ప్రభుత్వానికి రూ.1 నష్టం జరిగితే, ప్రజలకు రూ.4 నష్టం జరుగుతుంది, గతేడాది ప్రభుత్వానికి రూ.20,000 కోట్ల నష్టం, ప్రజలకు రూ.80,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపిన ఏపీ సీఎం

Hazarath Reddy

లాక్ డౌన్ తో ప్రభుత్వం కంటే ప్రజలే ఎక్కువగా ప్రతికూల ఫలితాలు చవిచూస్తారని వివరించారు. ప్రభుత్వానికి రూ.1 నష్టం జరిగితే, ప్రజలకు రూ.4 నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. లాక్ డౌన్ గురించి ఆలోచించేటప్పుడు ఇది ఎంతో కీలక అంశమని సీఎం అభిప్రాయపడ్డారు.

Advertisement

Jagananna Vasathi Deevena 2021: తల్లుల ఖాతాల్లోకి జగనన్న వసతి దీవెన నగదు, 2021 ఏడాదికి గానూ రూ.1,048.94 కోట్లను జమ చేయనున్న ఏపీ సర్కారు, బడ్జెట్‌ను విడుదల చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న వసతి దీవెన పథకం (Jagananna Vasathi Deevena Scheme) కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బుధవారం రూ.1,048.94 కోట్లను జమ చేయనున్నారు. 2020–2021 సంవత్సరానికి మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా సీఎం నగదు జమ చేస్తారు.

AP Covid Report: ఏపీలో తాజాగా 11,434 మందికి కరోనా, 64 మంది మృతి, కరోనా పరిస్థితులపై రేపు మంత్రుల కమిటీ సమావేశం, వివరాలను వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో 2,028 పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 1982, నెల్లూరు జిల్లాలో 1237, శ్రీకాకుళం జిల్లాలో 1322, విశాఖ జిల్లాలో 1067 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 7,055 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 64 మంది (Covid Deaths) మరణించారు.

Srikakulam Shocker: లాక్‌డౌన్ ఆంక్షలు..విధిలేక తల్లి మృతదేహాన్ని 3 కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లిన కుమారుడు, శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన, కంటైన్‌మెంట్ జోన్‌గా శ్రీకాకుళం నగరం

Hazarath Reddy

కరోనా విశ్వరూపానికి దేశం అల్లాడుతోంది. రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. ఎక్కడికక్కడే ఆంక్షలు విధిస్తున్నారు.లాక్‌డౌన్, ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. తాజాగా ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో ఓ విషాద వీడియో (Srikakulam Shocker) బయటకు వచ్చింది.

Andhra Pradesh Covid: కరోనా కల్లోలం..ఏపీ సర్కారు కీలక నిర్ణయం, 40 పడకల ఆస్పత్రులను కోవిడ్ హాస్పిటల్స్‌గా మార్చేందుకు ఏర్పాట్లు, 104 కాల్ సెంటర్ సమర్ధవంతంగా పనిచేసేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వైద్య సేవల కోసం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 40 పడకల ఆస్పత్రులను కోవిడ్ హాస్పిటల్స్‌గా (Covid Hospitals) మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.

Advertisement

Proddatur Shocker: నాకు సుఖం లేదు, మీరెందుకు బతకాలి? అమ్మ,చెల్లి,తమ్ముడిని దారుణంగా హత్య చేసిన సైకో, పొద్దుటూరులో కిరాతక ఘటన, వాడిని ఉరి తీయాలంటూ తండ్రి ఆవేదన

Hazarath Reddy

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ దగ్గర దారుణ ఘటన (Proddatur Shocker) చోటు చేసుకుంది. బంధాలను మరచిన ఆ క్రూరుడు తల్లి, చెల్లి, సోదరుడిని దారుణంగా హత్య (Man Killed His Three family members) చేశాడు.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సెకండ్ వేవ్ తీవ్రత, కొత్తగా 9,881 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 95 వేలకు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య, కంటైన్‌మెంట్ జోన్‌గా తిరుపతి!

Team Latestly

తిరుపతిలోనూ ఆంక్షలు కఠినతరం చేయబడ్డాయి. మున్సిపల్ కమిషనర్ గిరిషా తిరుపతి నగరాన్ని కంటెమెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు....

Free Rice Distribution: జగన్ సంచలన నిర్ణయం, పేద ప్రజలకు 10 కేజీల ఉచిత బియ్యం, మే, జూన్‌ రెండు నెలలపాటు ఫ్రీగా అందించనున్న ఏపీ సర్కారు, మొత్తం 1.47 కోట్ల కార్డుదారులకు లబ్ధి

Hazarath Reddy

ఏపీలోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించేందుకు సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం (YS Jagan Govt) నిర్ణయించింది. మే, జూన్‌ రెండు నెలలపాటు పేదలకు ఉచిత బియ్యం (Free Rice Distribution) అందించనుంది.

Andhra Pradesh: ఏపీలో భారీగా ఉద్యోగాల భర్తీ, వైద్యరంగంలో నియమకానికి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, ఆక్సిజన్ వృథా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని ఆదేశించిన వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని

Hazarath Reddy

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా వైద్యరంగంలో నియామకాలు చేపట్టింది. కోవిడ్ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

AP Covid Report: విషమంగా టీడీపీ నేత సబ్బం హరి ఆరోగ్యం, ఏపీలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 69 మంది కరోనాతో మృత్యువాత, రాష్ట్రంలో 12,634 కొత్త కోవిడ్ కేసులు, తమిళనాడుకి వెళ్లాలంటే ఈ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో ఒక్కరోజులోనే 69 మంది కరోనాతో మృత్యువాత (highest daily toll of 69 this year) పడ్గారు. గత 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 12 మంది కరోనాకు బలయ్యారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. ఈ క్రమంలో ఇప్పటివరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 7,685కి పెరిగింది.గడచిన 24 గంటల్లో ఏపీలో (Andhra Pradesh) 62,885 కరోనా పరీక్షలు నిర్వహించగా 12,634 మందికి పాజిటివ్ (12,634 new cases) అని నిర్ధారణ అయింది.

Tamil Nadu: ఏపీ, తెలంగాణకు ఆక్సిజన్ మళ్లింపు వద్దు, ప్రధాని మోదీకి లేఖ రాసిన తమిళనాడు ముఖ్యమంత్రి, రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని లేఖలో తెలిపిన సీఎం కె పళనిస్వామి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాలకు తమిళనాడు నుంచి 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ మళ్లింపును నిలిపివేయాలని (Tamil Nadu wants diversion of oxygen) ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారంనాడు విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ డిమాండ్ పెరగడం దృష్ట్యా దీనిని వెంటనే నిలిపివేయాలని (stopped immediately) తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి (Tamil Nadu Chief Minister E Palaniswami) ప్రధానికి లేఖలో రాశారు.

AP Coronavirus Update: ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఏపీ సర్కారు కీలక ఆదేశాలు, సీటీ స్కాన్‌ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

Hazarath Reddy

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా సీటీ స్కాన్‌పై ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు (AP government issues directives to hospitals and labs) జారీ చేసింది. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో సీటీ స్కాన్‌ ధర రూ.3 వేలుగా (Fixes CT scan prices) నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Thanks CM YS Jagan: వైయస్ జగన్‌కు మరాఠీల అభినందనలు, అడిగిన వెంటనే 300 వెంటిలేటర్లు నాగపూర్‌కి పంపిన ఏపీ ముఖ్యమంత్రి, కృతజ్ఞతలు తెలిపిన నితిన్‌ గడ్కరీ

Hazarath Reddy

మహారాష్ట్రకు వెంటిలేటర్లను అందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియా ట్విట్టర్లో పలు సందేశాలు వెలువెత్తాయి. ముఖ్యంగా మరాఠీ సందేశాలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement