ఆంధ్ర ప్రదేశ్
Case Booked against Babu & Lokesh: చంద్రబాబు,లోకేశ్‌‌లపై కేసు నమోదు, సోషల్ మీడియాలో గురుమూర్తిపై అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపణలు, ఐటి చట్టం 2000, ఎస్సీ / ఎస్టీ చట్టం 1989 కింద కేసు నమోదు చేసిన విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు
Hazarath Reddyవైఎస్‌ఆర్ కాంగ్రెస్ (వైఎస్‌ఆర్‌సి) అభ్యర్థి ఎం. గురుమూర్తిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఛాయాచిత్రాలను పోస్ట్ చేశారనే ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఐటీ యాక్ట్‌ కింద శనివారం కేసు (Case Booked against Babu & Lokesh) నమోదైంది.
Pawan Kalyan Home Quarantine: కరోనా టెన్సన్..హోం క్వారంటైన్‌లోకి ప‌వ‌న్ క‌ల్యాణ్, జనసేన అధినేత వ్యక్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్, తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లపై నెలకొన్న సందిగ్ధ‌త
Hazarath Reddyజన‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో హోం క్వారంటైన్‌లోకి (Pawan Kalyan Home Quarantine) వెళ్లారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యక్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధతిలోనే జ‌న‌సేన‌ పార్టీ కార్య‌క‌లాపాలను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు.
AP Covid Second Wave: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ పంజా, ఒక్క రోజే 12 మంది మృతి, తాజాగా 3,309 మందికి కరోనా, కస్తూర్బా బాలికల విద్యాలయంలో 12 మందికి కోవిడ్ పాజిటివ్
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో ఏపీలో 31,929 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,309 మందికి కరోనా నిర్ధారణ (AP Covid Report) అయింది. చిత్తూరు జిల్లాలో భారీ స్థాయిలో 740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 527, విశాఖ జిల్లాలో 391, కర్నూలు జిల్లాలో 296 కేసులు వెల్లడయ్యాయి. ఏపీలోని 13 జిల్లాల్లో విజయనగరం (97), పశ్చిమ గోదావరి (26) జిల్లాల్లో మాత్రం రెండంకెల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.
Fire in ATM Center: అగ్నికి ఆహుతైన ఎస్బీఐ ఏటీఎంలు, అనంతపురం జిల్లా పామిడి ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్ద ఉన్నట్టుండి మంటలు, పెద్ద శబ్దంతో పేలిపోయిన ఏటీఎంలు
Hazarath Reddyఅనంతపురం జిల్లా పామిడి ఎస్బీఐ ఏటీఎంలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఇక్కడి ఏటీఎం కేంద్రం వద్ద ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో ఆ మంటలు ఏటీఎం కేంద్రం మొత్తం వ్యాపించాయి. మంటల తీవ్రతకు ఏటీఎం మెషీన్లు పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు హడలిపోయారు.
Vontimitta Sita Rama Kalyanam: ఏప్రిల్ 26 న ఒంటిమిట్టకు వైయస్ జగన్, కోదండ రాముడి కల్యాణానికి హాజరు కానున్న ఏపీ సీఎం, ఈ నెల 21 నుంచి 29 వరకు కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 26 న కడప జిల్లాలోని ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం కు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 29 వరకు వైభవంగా జరుగనున్నాయి.
Goutham Reddy Twitter Accout : ఏపీ ఐటీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో పోర్న్ చిత్రాలు, అకౌంట్ హ్యాక్‌తో అలర్ట్ అయిన మేకపాటి గౌతమ్ ‌రెడ్డి, పోలీసులకు ఫిర్యాదు, ట్విటర్‌ ఖాతాను ఫాలో అవుతున్న వారందరికీ మంత్రి క్షమాపణలు
Hazarath Reddyఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్విటర్‌ అకౌంట్ హ్యాక్ అయింది. మంత్రి అకౌంట్ లో అశ్లీల చిత్రాల కలకలం రేగింది. హ్యకర్లు అశ్లీల చిత్రాలను పోస్ట్‌ చేశారు. వీటిని ఆలస్యంగా గుర్తించిన మంత్రి వాటిని వెంటనే తొలగించారు. దీనిపై ట్విటర్‌ సంస్థకు, సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tirupati Bypoll: చంద్రబాబుకు కరోనా టెన్సన్, టీడీపీ అధినేతను కలిసిన అనిత, సంధ్యారాణి‌లకు కరోనా పాజిటివ్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్‌లకు కోవిడ్ నిర్థారణ, టీడీపీ ప్రచారంలో కలకలం రేపుతున్న కరోనా
Hazarath Reddyటీడీపీ తిరుపతి ప్రచారంలో కరోనా కలకలం సృష్టించింది. ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి (Addanki MLA Gottipati Ravi), మాజీ మంత్రి జవహర్ (Former Minister Jawahar), టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్‌గా (TDP MLAs and former MLAs tests positive for covid 19) తేలింది.
Tirupati Bypoll: లోకేశ్‌, చంద్రబాబులపై డీజీపీకి ఫిర్యాదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ నేతలు, ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరిచే పోస్టులు పెట్టారని ఆరోపణ
Hazarath Reddyటీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లపై వైసీపీ నేతలు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికార ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో తమపార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరిచే విధంగా పోస్టింగ్‌లు పెట్టారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్‌.. డీజీపీకి ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తున్న రెండో దశ కోవిడ్, కొత్తగా 2,765 కోవిడ్ కేసులు నమోదు.. 11 మంది మృతి, నెల రోజుల్లో అర్హులైన కోటి మందికి టీకా పంపిణీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ అంతకంతకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం మరియు నెల్లూరు జిల్లాల్లో కోవిడ్ విజృంభిస్తుంది. ఈ నాలుగైదు జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి....
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సెకండ్ వేవ్ ఉధృతి, కొత్తగా 2558 కోవిడ్ కేసులు నమోదు.. ఆరుగురి మృతి, రాష్ట్రంలో 15 వేలకు చేరువైన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyగడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 465 కోవిడ్ కేసులు నమోదు కాగా, గుంటూరు నుంచి నుంచి 399 కేసులు, కర్నూలు నుంచి 344, విశాఖపట్నం నుంచి 290, మరియు నెల్లూరు నుంచి 204 కేసుల చొప్పున నమోదయ్యాయి....
AP's Parishad Polls 2021: ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్, చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం, 60.91 శాతం పోలింగ్ నమోదు, హైకోర్ట్ తీర్పు తర్వాత కౌంటింగ్
Team Latestlyరాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న 7,220 ఎంపిటిసిలు, 515 జెడ్‌పిటిసి స్థానాలకు గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇస్తున్నారు.....
Telangana: తెలంగాణలో మద్యం దుకాణాలు, థియేటర్లపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి హైకోర్ట్ సూచన, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై పరిమితి, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల చర్యలు పెంచాలని ఆదేశం
Team Latestlyమద్యం షాపులు కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా తయారవుతున్నాయని తెలంగాణ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్19 కేసులను దృష్టిలో ఉంచుకుని మద్యం షాపులు, పబ్బులు, మద్యం విక్రయించే క్లబ్ లు మరియు సినిమా థియేటర్లపై ఆంక్షలు విధించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది....
AP MPTC & ZPTC Elections 2021: ఏపీలో కొనసాగుతున్న పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ , ఓటు వేయడానికి తరలివస్తున్న ఓటర్లు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు మాస్క్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది. కోవిడ్‌ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
AP MPTC & ZPTC Polls 2021: ఏపీ పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, ఇప్పటికే 126 జడ్పీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు మాస్క్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.
Contaminated Water in Kurnool: కర్నూలు జిల్లాలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వందలమంది, పలువురి పరిస్థితి విషమం, ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వెళుతున్న గోరుకల్లు వాసులు
Hazarath Reddyకర్నూలు జిల్లాలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందారు. మరో వందమందికిపైగా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కలుషిత నీరు (Contaminated Water in Kurnool) తాగి గ్రామస్తులు చనిపోతుండడంతో (Four people have died) గోరుకల్లు వాసులు ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు.
AP Coronavirus: ఏపీలో కరోనా కల్లోలం, ఒక్కరోజే 11 మంది మృతి, గడచిన 24 గంటల్లో 2,331 కరోనా కేసులు నమోదు, కృష్ణా జిల్లాలో 327, విశాఖ జిల్లాలో 298, చిత్తూరు జిల్లాలో 296, అనంతపురం జిల్లాలో 202 కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో కరోనా మరింతగా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో 31,812 కరోనా పరీక్షలు చేపట్టగా 2,331 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని వెల్లడైంది. అనేక జిల్లాల్లో మూడంకెల్లో కొత్త కేసులు వచ్చాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు.
Major Jolt to TDP: తెలంగాణలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ, తెలంగాణ టీడీపీ శాసనసభ పక్షం అధికార టీఆర్ఎస్ పార్టీలో విలీనం, టీఎస్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయిన తెలుగు దేశం పార్టీ
Team Latestlyతెలుగు దేశం పార్టీకి ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఏపీలో పరిషత్ ఎన్నికల విషయంలో హైకోర్ట్ తాజా తీర్పుతో బోక్కబోర్లా పడ్డ టీడీపీకి, ఇటు తెలంగాణలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ తెలుగు దేశం శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రకటించారు.....
AP Police: తమిళనాడు ఎన్నికల్లో సేవా దృక్పథాన్ని చాటుకున్న ఏపీ పోలీసులు, ఓటింగ్ వేయడానికి వచ్చినవారికి సాయం, దగ్గరుండి వారికి సేవలు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
Hazarath Reddyరాష్ట్రాలను దాటిన ప్రకాశం పోలీసుల సేవా దృక్పథం; Tamilnadu election వీధులలో ఓటింగ్ వేయడానికి వచ్చినవారికి మానవతా దృక్పథంతో ప్రకాశం పోలీసులు సేవ చేశారు. వారిని దగ్గరుండి పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లి తమ ఉదారభావాన్ని చాటుకున్నారు.
AP ZPTC & MPTC Elections 2021: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, కౌంటింగ్‌ జరపొద్దని ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, ఏప్రిల్ 8న యథావిధిగా పరిషత్‌ ఎన్నికలు
Hazarath Reddyఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల కౌంటింగ్‌ జరపొద్దని హైకోర్టు (AP High court) ఆదేశించింది. సింగిల్‌ జడ్జి వద్దకు వెళ్లి పిటిషన్‌ను పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది.