ఆంధ్ర ప్రదేశ్

AP's COVID Report: ఫిబ్రవరి 13 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రెండో డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్, ఇప్పటివరకు ఏపిలో 3.25 లక్షల డోసులకు పైగా టీకాల పంపిణీ రాష్ట్రంలో కొత్తగా కరోనా 50 కేసులు నమోదు

Team Latestly

శనివారం నుంచి కోవిడ్ వ్యాక్సిన్ల రెండవ మోతాదును ఇవ్వడం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కమిషనర్ కటమనేని భాస్కర్ పేర్కొన్నారు. టీకా సురక్షితమైనదని, ఎలాంటి భయాలు లేకుండా ఆరోగ్యవంతులు టీకాలు వేయించుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు....

AP Local Body Polls: రెండో దశలో 539 పంచాయతీలు ఏకగ్రీవం, గుంటూరు జిల్లాలో అత్యధికంగా 70 పంచాయితీలు ఏకగ్రీవం, ఈ నెల 13న పోలింగ్, వివరాలను వెల్లడించిన ఏపీ ఎస్ఈసీ

Hazarath Reddy

ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండో విడత పంచాయితీ ఎన్నికలు (AP Local Body Polls) ఈ నెల 13న జరగనున్నాయి.ఈ నేపథ్యంలో రెండో దశ ఎన్నికల్లో ఎస్‌ఈసీ ఏకగ్రీవాలను ప్రకటించింది. మొత్తం 13 జిల్లాల్లో 539 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని ఏపీ ఎస్ఈసీ స్పష్టం చేసింది.

Palasa Volunteer: పలాస వాలంటీర్‌‌కు రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, కరోనా వ్యాక్సిన్‌ వికటించి మృతి చెందిన పలాస వాలంటీర్ పిల్లా లలిత

Hazarath Reddy

రెండు రోజుల క్రితం జిల్లాలోని పలాసలో కరోనా వ్యాక్సిన్‌ వికటించి మృతి చెందిన వాలంటీర్‌ పిల్లా లలితకు (Palasa Volunteer) ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మరణించిన వాలంటీర్‌ లలిత కుటుంబానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం (AP Government) ఉత్తర్వులు జారీ చేసింది.

Mission Build AP Case: ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం, హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

మిషన్‌ బిల్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

Andhra Pradesh: ఏపీ ఎస్ఈసీకి మళ్లీ ఎదురుదెబ్బ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మీడియాతో మాట్లాడేందుకు అనుమతించిన హైకోర్టు, కమిషనర్‌ను టార్గెట్ చేసి మాట్లాడొద్దని హితవు

Hazarath Reddy

ఏపీ ఎస్ఈసీకి మంత్రి హౌస్, అరెస్ట్, మీడియాతో మాట్లాడకూడదనే విషయంలో హైకోర్టులో (AP High Court) మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడేందుకు ఏపీ హైకోర్టు అనుమతించింది.

AP CM Letter to Volunteers: మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది, రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడవద్దు, మీకు ఇన్ని రోజులు పని చేయాలనే నిబంధనలు లేవు, వాలంటీర్లకు సీఎం జగన్ రాసిన లేఖ పూర్తి సారాంశం ఇదే..

Hazarath Reddy

జీతాలు పెంచాలంటూ కొందరు వాలంటీర్లు విజయవాడలో ధర్నా చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం స్పందించారు. వారినుద్దేశించి ఓ లేఖను (AP CM Letter to Volunteers) విడుదల చేశారు. వాలంటీర్ (volunteers) అంటే స్వచ్ఛందంగా సేవను అందించడమని, మీకు పనిదిన నిబంధనలు అంటూ ఏవీ లేవని తెలిపారు.

AP Panchayat Elections 2021: పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ దూకుడు, మెజార్టీ స్థానాలు కైవసం, నిమ్మాడలో టీడీపీ అభ్యర్థి గెలుపు, నరసాపురం డివిజన్‌లో కొన్ని చోట్ల జనసేన బీజేపీ గెలుపు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు (AP Panchayat Elections 2021) వెలువడుతున్నాయి. ఈ రోజు(మంగళవారం)మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగ్గా, అనంతరం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి దశ పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మెజార్టీ స్థానాలను (YSRCP Wins Majority Panchayats) కైవసం చేసుకుంది. టీడీపీ చాలా తక్కువ స్థానాలకే పరిమితం అయింది.

AP Panchayat Elections 2021: ఏపీలో ముగిసిన తొలి దశ పోలింగ్‌, క్యూలైన్‌లో ఉన్నవారికి సాయంత్రం 4గంటల వరకు ఓటు హక్కు వినియోగించే అవకాశం, మొదలైన ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ జరిగింది. కాగా సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక జరగనుంది.

Advertisement

YS sharmila New Party: వైయస్ పేరు లేకుండా షర్మిల లేదు, తెలంగాణ కన్నా తమిళనాడు లేదా కర్నాటకలో పెడితే ఎక్కువ ఓట్లు వస్తాయి, షర్మిలా రెడ్డి కొత్త పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు

Hazarath Reddy

దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ ముద్దుల తనయ వైయస్ షర్మిల కొత్త పార్టీపై (ys sharmila party) నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. షర్మిల పార్టీ (YS sharmila New Party) పెట్టడం తన అన్న ఏపీ సీఎం వైయస్ జగన్ డైరెక్షన్‌లో జరిగిందా.. లేదా అనేది త్వరలో తేలుతుందన్నారు.

YS Sharmila New Party Row: తెలంగాణలో వైసీపీ ఏర్పాటు సీఎం జగన్‌కు ఇష్టం లేదు, పార్టీ ఏర్పాటు నిర్ణయం అనేది షర్మిల వ్యక్తిగతం, అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మీడియాతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

కోట్లాది మంది ప్రజల అభిమానంతో పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. తెలంగాణ రాజకీయాలపై వైఎస్‌ జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారు.

Y. S. Sharmila Meeting: అన్నని కాదని కొత్త పార్టీ పెడుతోందా? లోటస్ పాండ్‌లో వైయస్ షర్మిలారెడ్డి ఆత్మీయ సమావేశం, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పెళ్లి రోజు నేడు, జగనన్న వదిలిన బాణం ఏం చేయబోతోంది?

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల (Y. S. Sharmila) తెలంగాణలో కొత్త పార్టీ పెడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

AP Local Body Polls: చినజగ్గంపేటలో కత్తులతో దాడి చేసుకున్న ఇరువర్గాలు, ఒకరికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు, తొలి రెండు గంటల్లో 18 శాతం పోలింగ్ నమోదు, పరిస్థితిని సమీక్షిస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు (AP Local Body Polls) కొనసాగుతున్నాయి. ఉదయం 6.30లకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8.30 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదయ్యింది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నియోజకవర్గం నిమ్మాడలో 23 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

Advertisement

AP Panchayat Elections 2021: ఉత్కంఠలో నిమ్మాడ పంచాయితీ, ప్రారంభమైన పంచాయితీ ఎన్నికల పోలింగ్,  2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్, బరిలో 43,601 మంది అభ్యర్థులు

Hazarath Reddy

ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 7,506 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు. తొలిదశ ఎన్నికల కోసం 29,732 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.

AP COVID Status: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్ కేసులు, 102 డిశ్చార్జిలు నమోదు, రాష్ట్రంలో 3 లక్షలకు పైగా హెల్త్ కేర్- ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతోంది, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా హెల్త్ కేర్- ఫ్రంట్ లైన్ వర్కర్లు టీకా తీసుకున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం నిన్నటివరకు ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2,99,649గా ఉంది.....

AP Local Body Polls: ఈ సారి నోటా ఓట్ల లెక్కింపు, తొలి దశ పంచాయతీ ఎన్నికలకు రేపే పోలింగ్, 12 జిల్లాల్లో 2,724 గ్రామ పంచాయతీల్లో 29,732 పోలింగ్‌ కేంద్రాలు, 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం, మీడియాతో గోపాలకృష్ణ ద్వివేది

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 9న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మొత్తం 12 జిల్లాల్లో.. 2,724 గ్రామ పంచాయతీల్లో.. 29,732 పోలింగ్‌ కేంద్రాలలో పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Elections 2021) నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Andhra Pradesh: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు, భార్య కాపురానికి రాలేదని కృష్ణానదిలో దూకిన చిత్తూరు జిల్లా యువకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

తాడేపల్లి వద్ద కృష్ణానదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. భార్య తనను వదిలి వెళ్లడం.. ఇంటికి రానని చెప్పడంతో అతను ఆత్మహత్య (Young man commits suicide) చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

SEC Ramesh Kumar: అన్ని పర్యటనలు రద్దు, ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అధికారుల బదిలీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ

Hazarath Reddy

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన చివరి నిముషంలో వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై సోమవారం సంబంధిత జిల్లాల అధికారులతో ఎస్‌ఈసీ (SEC Ramesh Kumar) సమీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆయనకు కంటి ఇన్ఫెక్షన్‌ కారణంగా ఈ పర్యటన రద్దు అయ్యింది. నేడు కంటి పరీక్షల కోసం హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి (lv prasad Hosptal for Eye treatment) నిమ్మగడ్డ వెళ్లనున్నారు.

Covid in India: వికటించిన వ్యాక్సిన్, శ్రీకాకుళం జిల్లా పలాస వాలంటీర్ మృతి, మరికొందరిలో దుష్ప్రభావాలు, దేశంలో తాజాగా 11,831 మందికి కరోనా నిర్ధారణ, ఏపీలో 73 మందికి పాజిటివ్

Hazarath Reddy

కరోనా వ్యాక్సిన్‌ (Corona Vaccination) తీసుకున్న శ్రీకాకుళం జిల్లా పలాస వలంటీర్‌ పిల్లా లలిత(28) ఆదివారం మృతి చెందారు. వ్యాక్సిన్‌ వికటించడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు

President Kovind Chittoor Tour: మదనపల్లె సత్సంగ్ ఆశ్రమానికి రాష్ట్రపతి కోవింద్, రేణి గుంట ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన ఏపీ సీఎం వైయస్ జగన్, మంత్రులు

Hazarath Reddy

చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

AP Local Body Polls: ఎస్ఈసీకు ఎదురుదెబ్బ, మంత్రి హౌస్‌ అరెస్ట్‌ ఆదేశాలు చెల్లవు, మంత్రి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

ఏపీ ఎన్నికల కమిషన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది.

Advertisement
Advertisement