ఆంధ్ర ప్రదేశ్
AP Coronavirus: ఏపీలో ఒక్కరోజే 12 మంది కరోనాతో మృతి, రాష్ట్ర వ్యాప్తంగా 22, 259కి చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, చిత్తూరులో ఒక్క రోజే 70 మందికి కరోనా పాజిటివ్‌
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 27,643 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,062 పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) వెలుగు చూశాయి. కరోనా నుంచి కోలుకొని 1,332 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు (coronavirus Cases) నమోదు అయినప్పటి నుంచి ఇదే అత్యధికంగా డిశ్చార్జ్‌ అవ్వడం ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు. కాగా నిన్న ఒక్కరోజే 12 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో కర్నూల్‌లో 3, అనంతపూర్‌లో 2, కృష్ణాలో 2, పశ్చిమ గోదావరిలో 2, చిత్తూరులో 1, గుంటూరులో 1, విశాఖపట్నంలో ఒకరు చొప్పున మరణించారు.
Vizag Gas Leak: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ సీఈఓ అరెస్ట్, ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు
Hazarath Reddyవిశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో (Vizag Gas Leak) మంగళవారం 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ సీఈవో (LG Polymers CEO) సున్‌కి జియాంగ్‌, డైరెక్టర్‌ డీఎస్‌ కిమ్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ పీపీసీ మోహన్‌రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు.
YSR Rythu Dinotsavam: వైఎస్సార్ పుట్టిన రోజును రైతు దినోత్సవంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, రైతు భరోసా కేంద్రాలకు డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలుగా పేరు పెడుతూ ఉత్తర్వులు
Hazarath Reddyదివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి దినోత్సవం (YSR jayanthi 2020) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని (YSR Rythu Dinotsavam) నిర్వహిస్తోంది. ఈసందర్భంగా రైతు భరోసా కేంద్రాలకు డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలుగా పేరు పెడుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులతో ముఖాముఖి, వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది.
Y. S. Rajasekhara Reddy Birthday: తెలుగు నేలపై చెరగని సంతకం, పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు, ఘనంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, వైఎస్సార్ గురించి ఎవరేమన్నారంటే..
Hazarath Reddyప్రజల నేత, తెలుగు ప్రజల గుండె చప్పుడు, దివంగత ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి (Y. S. Rajasekhara Reddy) ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్‌ 71వ జయంతి (Y. S. Rajasekhara Reddy Birthday) సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు.
AP Coronavirus Report: ఏపీలో తాజాగా 1178 కరోనా కేసులు నమోదు, 13 మంది మృతి, రాష్ట్రంలో 21,197కు చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య, 252కు చేరిన మరణాల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1178 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. ఇందులో ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (AP Coronavirus) అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 16,238 శాంపిల్స్‌ను పరీక్షించగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయి.
125 Feet Ambedkar Statue: ఏపీలో 125 అడుగుల బి.ఆర్‌. అంబేడ్కర్ విగ్రహం, విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో విగ్రహం ఏర్పాటు, ఈ నెల 8న ప్రారంభించనున్న ఏపీ సీఎం
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌)లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని (125 Feet Ambedkar Statue) ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh government) ఏర్పాటు చేయనుంది. ఈనెల 8న సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విగ్రహం శంకుస్థాపన పనులు ప్రారంభిస్తారని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ సోమవారం పరిశీలించారు.
YS Jagan Review Meeting: అక్కాచెల్లెమ్మలకు ఆస్తిని ఇద్దామంటే టీడీపీ అడ్డుపడుతోంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, స్పందన సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వైయస్సార్ హౌసింగ్ స్కీము (YSR Housing Scheme 2020) ఆగస్టు 15కి వాయిదా పడిన విషయం విదితమే. కరోనా సమయంలో ఇళ్లపట్టాలు ఎలా పంచుతారని టీడీపీ నేతలు కోర్టు గడట తొక్కడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa satyanarayana) తెలిపారు. కాగా వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రంలో 30 లక్షలమంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం (Government of Andhra Pradesh) సిద్దమయింది.
Visakhapatnam Gas Leak: ప్రమాదానికి ప్రధాన కారణం అదే, విశాఖ గ్యాస్‌ లీకేజీపై ఏపీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించిన హైపర్‌ కమిటీ, 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలు కొన్ని మీకోసం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటన (LG Polymers Gas Leak) జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ (High Power committee) ఏపీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో (AP CM Camp Office) సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన కమిటీ సభ్యులు, గ్యాస్‌ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి తుది నివేదికను సమర్పించారు.
'One Million COVID Tests': చంద్రబాబు మిలియన్ కరోనా టెస్టుల ట్వీటుకు రిప్లయి ఇచ్చిన ఏపీ హెల్త్ మినిస్ట్రీ, ప్రభుత్వానికి తప్పులు అంటగట్టడం సరైన పద్దతి కాదంటూ హితవు
Hazarath Reddyఏపీలో పది లక్షల కరోనా టెస్టులు చేశామని ప్రభుత్వం ప్రకటించడంతో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. మొదటి నుంచి జగన్ ప్రభుత్వం (YS Jagan Govt) ప్రజలను మోసం చేస్తూనే ఉందని, కరోనా పరీక్షల గణాంకాల విషయంలో కేంద్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని ట్విట్టర్ (Twitter)ద్వారా విమర్శించారు.దీనికి ఏపీ హెల్త్ మినిస్ట్రీ (AP Health Ministry) రిప్లయి ఇచ్చింది.
AP Coronavirus Report: ఏపీలో కొత్తగా 1322 కరోనా కేసులు, ఏడు మంది మృతి, రాష్ట్రంలో 20 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 239కి చేరిన మృతుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 1322 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మందికి, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా (new positive cases) నిర్థారణ అయింది. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ (Andhra Pradesh Medical Department) విడుదల చేసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1,322 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
Free Borewells for Farmers: పేద రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, సన్న, చిన్న కారు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా స్కీమ్ కింద ఉచిత బోర్ పథకం, అర్హతలు ఇవే
Hazarath Reddyపలు సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM YS jagan) రాష్ట్రంలోని పేద రైతుల కోసం మరో పథకాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే విద్య, వైద్యం, ఆరోగ్యంలో అనేక విప్లవాత్మక మార్పులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయంలోనూ పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని సన్న, చిన్న కారు రైతులకు ఆదుకునేందుకు ఉచిత బోరు పథకాన్ని (Free Borewells for Farmers) ప్రవేశపెట్టింది.
AP DGP Gautam Sawang: విశాఖపట్నంలో త్వరలో గ్రేహౌండ్స్ నిర్మాణం, వెల్లడించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, కరోనా కష్టకాలంలో ఏపీ పోలీసులు పనితీరు అద్భుతమని ప్రశంస
Hazarath Reddyకోవిడ్-19 కష్టకాలంలో పోలీసుల పనితీరు అద్భుతమని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 24 గంటలూ విధులు నిర్వహించారని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ (AP DGP Gautam Sawang) కొనియాడారు. విశాఖ నగర పోలీస్‌ కమిషనరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 78 వేల మంది పోలీస్‌ సిబ్బందిని (police department) అభినందించారు. ఈ సమావేశంలో ప్రధానంగా మావోయిస్టుల కార్యకలాపాలపై పోలీస్‌ శాఖ అప్రమత్తత గురించి చర్చ జరిగిందని డీజీపీ (Damodar Goutam Sawang) తెలిపారు.
Rain Alert in AP: ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, కోస్తా, రాయలసీమలపై చురుగ్గా నైరుతి రుతుపవనాల ప్రభావం
Hazarath Reddyఏపీలో రానున్న మూడు రోజులు పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rain Alert in AP) కురవనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఒడిశా, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమబెంగాల్‌ తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఈ ప్రాంతంలో 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఏర్పడటంతో కోస్తా, రాయలసీమలపై నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షలు దాటిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, 18 వేల మందికి పైగా పాజిటివ్‌గా నిర్ధారణ, గత 24 గంటల్లో కొత్తగా 998 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyఇప్పటివరకు 8,422 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 10,043 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...
Andhra Pradesh: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న 8 మంది పోలీసులకు కరోనా పాజిటివ్, ఏపిలో ఇప్పటికే 18 వేలకు చేరువలో ఉన్న మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య
Team Latestlyక్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న సిబ్బందికి కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో రెండు రోజుల క్రితం వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో శనివారం రోజు వీరికి సంబంధించిన పరీక్షా ఫలితాలు రాగా, 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది...
COVID-19 Vaccine: ఆగష్టు 15 లోపు కోవిడ్ వ్యాక్సిన్; మానవ ట్రయల్స్ పట్ల టెస్టింగ్ సెంటర్లకు ఐసీఎంఆర్ డెడ్‌లైన్ విధించడం పట్ల విమర్శలు, వివరణ ఇచ్చుకున్న కౌన్సిల్
Team Latestlyనికల్ ట్రయల్స్ ను వేగవంతం చేయమని ఐసీఎంఆర్ దేశంలోని నిర్ధేషిత ఆరోగ్య కేంద్రాలకు లేఖలు రాయడం పట్ల నిపుణుల నుంచి విమర్శలు వెలువెత్తాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడంలో అంతతొందరెందుకు...
TDP Leader Kollu Ravindra Arrest: వైసీపీ నేత హత్య కేసు, టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్, ఇప్పటికే ఈ కేసులో అయిదుమందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఏపీలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్యకేసును జగన్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో రవీంద్ర హస్తం కూడా ఉందని భాస్కర్ రావు కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో టీడీపీ మాజీ మంత్రిని (TDP Leader Kollu Ravindra Arrest) పోలీసులు అరెస్ట్ చేశారు. తనను అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన తన స్వస్థలమైన మచిలీపట్నం నుంచి విశాఖ వైపు వెళ్తూ పోలీసులకు చిక్కారు.
NEET, JEE Exams 2020: నీట్, జేఈఈ 2020 పరీక్షలు సెప్టెంబర్ వరకు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్
Team Latestlyకొత్త తేదీల ప్రకారం, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జెఇఇ మెయిన్ - ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 1 నుండి 6 వరకు జరగనున్నాయి. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష సెప్టెంబర్ 27న జరుగుతుంది...
Unlock 2.0 Guidelines in AP: ఏపీలో అమల్లోకి ఆన్‌లాక్‌ 2.0 నిబంధనలు, కంటైన్‌మెంట్‌ జోన్లలోనే నిబంధనలు అమలు, జూలై 1 నుంచి 31 వరకు అన్‌లాక్‌ 2.0 అమల్లో..,
Hazarath Reddyఏపీలో ఆన్‌లాక్‌ 2.0 నిబంధనలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వెలువరించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో నిబంధనలు అమలు చేయాలని.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా, కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను దశలవారీగా‌ సడలించే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఇటీవల అన్‌లాక్‌ 2.0 మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి 31 వరకు అన్‌లాక్‌ 2.0 అమల్లో ఉంటుందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
AP Coronavirus Update: తిరుమలలో పది మందికి కరోనా, ఏపీలో తాజాగా 837 కేసులు నమోదు, రాష్ట్ర వ్యాప్తంగా 16,934కి చేరిన కోవిడ్-19 కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 837 కరోనా పాజిటివ్‌ కేసులు (AP COVID Report) నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 38,898 శాంపిల్స్‌ పరీక్షించగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో (Andhra Pradesh) 9,71,611 పరీక్షలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 258 క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు. వైరస్‌ బారిన పడి 8 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,096 బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,934కి చేరింది.