ఆంధ్ర ప్రదేశ్

AP Voters List Released: రాష్ట్రంలో 4 కోట్లను దాటిన ఓటర్ల సంఖ్య, 11 జిలాల్లో మహిళా ఓటర్లే అధికం, పెరిగి ధర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య, వివరాలను వెల్లడించిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కె విజయానంద్ 

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) ఓటర్ల సంఖ్య తొలిసారిగా 4 కోట్ల మార్కును దాటింది.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సవరించిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) నిర్వహించిన స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) తర్వాత ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ (K Vijayanand) శుక్రవారం విడుదల చేశారు.

Weekend Getaways From HYD: వీకెండ్ మునుపెప్పుడూ లేనంతగా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే!

Vikas Manda

హైదరాబాదుకు కేవలం 300 కి. మీ పరిధిలోనే ప్రకృతి రమణీయమైన చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. దట్టమైన అడవిలో నుంచి జారే జలపాతం, సఫారీ రైడ్, స్వచ్ఛమైన తాటికల్లు, అచ్ఛమైన దేశీ నాటుకోడి కూర ఇంకా ఎన్నో అనుభూతులు.

No Non-veg Week in AP: ఏపీ గోదావరి జిల్లాల్లో కలకలం, వైరస్ వ్యాపించి వేలల్లో చనిపోతున్న కోళ్లు, మాంసాహారం తినటానికి జనం బెంబేలు, నాన్- వెజ్ హాలిడే ప్రకటన

Vikas Manda

తణుకు పట్టణంలో నాన్- వెజ్ బంద్ కు పిలుపునిచ్చారు. తణుకు అసెంబ్లీ ఎమ్మెల్యే కరుమూరి వెంకటనాగేశ్వరరావు పట్టణంలో ‘ నో నాన్-వెజ్ వీక్’ ప్రకటించారు. పౌల్ట్రీ ఫామ్స్‌లోని వేలాది కోళ్ళకు ప్రాణాంతక వైరస్ సోకింది, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక వారం నాన్-వెజ్ హాలిడే ప్రకటించాము" అని ఎమ్మెల్యే పేర్కొన్నారు....

Karnataka Bandh: స్థానికులకే ఉద్యోగాల్లో పెద్దపీఠ వేయాలని డిమాండ్ చేస్తూ కన్నడిగుల ఆందోళన, నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు, ఏపీ టూరిజం బస్సుపై రాళ్ల దాడి

Vikas Manda

మంగళూరులోని ఫరంగిపేటలో తిరుపతి వెళ్లే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి.....

Advertisement

Jagan Meets PM Modi: గంటన్నర పాటు ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైయస్ జగన్ భేటీ, రాష్ట్ర ప్రయోజనాలపై కీలక చర్చలు, ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీకి రావలిసిందిగా ప్రధానికి ఆహ్వానం

Hazarath Reddy

రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Narendra Modi) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం (Jagan Meets PM Modi) ముగిసింది. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధన మొదలగు అంశాల మీద సీఎం వైయస్ జగన్‌ బుధవారం సాయంత్రం ప్రధానితో సమావేశం అయ్యారు.

AP Govt Offices Shifting Row: వ్యక్తులను ఉద్దేశించి కోర్టులో పిటిషన్లు ఎలా వేస్తారు, సీరియస్ అయిన హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు పిటిషన్‌పై విచారణ 17కు వాయిదా

Hazarath Reddy

ప్రభుత్వ కార్యాలయాల తరలింపును (AP Govt Offices Shifting Row) సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రతిష్టను దెబ్బతీసేలా ఏపీ ముఖ్యమంత్రి, అజేయ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి సహా మరికొందరు కామెంట్లు చేశారంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి పిటిషనర్లకు హైకోర్టు సీరియస్ అయింది.

LPG Price Hiked: పెరిగిన వంటగ్యాస్ ధరలు, ఒక్కో ఇండేన్ గ్యాస్ ఎల్‌పిజి సిలిండర్‌పై రూ. 144.50 పెంపు, పెరిగిన ధరలు నేటి నుంచే అమలు

Vikas Manda

సాధారణంగా, ఎల్‌పిజి రేట్లు ప్రతి నెల 1వ తేదీన సవరించబడతాయి, అయితే ఈసారి సమీక్ష జరగడానికి ఓ రెండు వారాలు ఆలస్యమైంది. సబ్సిడీని పెద్దమొత్తంలో పెంచుతున్నందున వాటి అనుమతుల కోసం కొంత ఆలస్యం జరిగిందని అధికారులు చెప్పారు. అయితే....

AP Cabinet Key Decisions: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ, లంచం తీసుకుంటే జైలుకే, మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామాల్లో పచ్చదనం బాధ్యత ఆ గ్రామ సర్పంచ్‌లదే, మీడియాతో మంత్రి పేర్ని నాని

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి (AP Cabinet) సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సమావేశానంతరం రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు.

Advertisement

Disha App First Distress Call: దిశ యాప్ దుమ్మురేపింది, నిమిషాల వ్యవధిలో ఆకతాయి అరెస్ట్, అధికారుల్ని, పోలీసుల్ని అభినందించిన ఏపీ సీఎం వైయస్ జగన్, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి దిశా యాప్ (Disha App) ద్వారా తొలి విజయం నమోదయింది.ఓ మహిళ ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఆకతాయిని అరెస్ట్ చేశారు. ఈ విజయం ద్వారా తద్వారా అక్కచెల్లెమ్మలకు భరోసా ఇచ్చినట్లయింది. కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Ap Cm YS Jagan Mohan Reddy) చేతుల మీదుగా ఈ నెల 8న దిశ యాప్‌ ప్రారంభమైన విషయం విదితమే.

Coronavirus-Man Commits Suicide: ఏపీలో కరోనా పుకారు కలకలం, జ్వరాన్ని కరోనా వైరస్‌గా భావించి వ్యక్తి ఆత్మహత్య, చిత్తూరు జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

ఏపీలో (Andhra Pradesh) దారుణం చోటు చేసుకుంది. కరోనా వైరస్ (Coronavirus) గురించి వచ్చిన అనుమానాలతో ఓ వ్యక్తి తన నిండు జీవితాన్ని వదిలేసుకున్నాడు. అతనికి కొంచెం జ్వరంగా ఉంటంతో మొబైల్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన వీడియోలు (Coronavirus-related videos) చూసి తనకు నిజంగానే కరోనా వచ్చిందేమోనని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

AP CM Delhi Tour: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం, రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం, అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు అభినందనలు తెలియజేసిన ఏపీ సీఎం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister CM YS Jagan Mohan Reddy) నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆ సమావేశం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్‌ ఢిల్లీ (AP CM Delhi Tour) బయలుదేరుతారు.

Polavaram Suspense: పోలవరంపై కొనసాగుతోన్న సస్పెన్స్, 2021లోగా పోలవరం పూర్తి చేస్తామన్న కేంద్రం, దాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒడిషా ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (Andhra Pradesh) జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై (Polavaram Project) కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. 2021లోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని వెల్లడించింది. ఇది ఇలావుంటే, పోలవరం ప్రాజెక్టును ఆపాలంటూ ఇటీవల ఒడిశా ప్రభుత్వం (Odisha Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 71 పేజీల అఫిడవిట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది.

Advertisement

Select Committee Formation: టీడీపీకీ భారీ షాక్, సెలక్ట్ కమిటీ ఫైళ్లను తిప్పి పంపిన మండలి కార్యదర్శి, రూల్ 154 కింద సెలక్ట్ కమిటీ వేయడం చెల్లదన్న శాసనమండలి కార్యాలయం

Hazarath Reddy

మూడు రాజధానులు (Three Capitals), సీఆర్డీఏ చట్టం (CRDA Bill) రద్దు బిల్లులపై శాసన మండలి సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ మండలి చైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఈ విషయంలో టీడీపీ పార్టీకి (TDP) భారీ ఎదురుదెబ్బ తగిలింది. సెలక్ట్ కమిటీలను (Celect Committee) ఏర్పాటు చేయకుండా ఆ ఫైళ్లను శాసన మండలి చైర్మన్ షరీఫ్‌కు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తిప్పిపంపారు.

Electricity Charges Hike: ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపు, 500 యూనిట్లు దాటితే యూనిట్‌కు 90 పైసలు అదనంగా చెల్లించాలి, అదాయం పెంచుకునే దిశగా ఏపీ ప్రభుత్వ నిర్ణయం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (AP government) ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా కరెంట్ ఛార్జీలను పెంచుతూ (Electricity Charges Hike) నిర్ణయం తీసుకుంది. 500ల యూనిట్లు పైబడిన వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెరిగాయి. 500ల యూనిట్లు దాటితే యూనిట్ కు 90 పైసలుకి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం (Jagan Govt) నిర్ణయం తీసుకుంది. అంటే 500ల యూనిట్లు పెబడితే.. ప్రతీ యూనిట్ కి రూ.9.05 నుంచి రూ.9.95 కి పెరుగుతాయి.

Guntur Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుమంది అక్కడికక్కడే మృతి, గాయపడిన వారి పరిస్థితి విషమం, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమన్న పోలీసులు

Hazarath Reddy

ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఈ విషాద ఘటన (Guntur Terrific Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మినీ లారీ - ఆటో ఢీకొనటంతో (auto-rickshaw collision) ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పసికందు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లుతెలిపారు.

New Ration Cards: కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి, ఈ నెల 15 నుంచి మీ ఇంటికే రేషన్ కార్డు, పంపిణీ చేయనున్న గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్డు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

ప్రభుత్వం కొత్తగా ఇవ్వనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తి అవ్వడంతో జగన్ సర్కారు (Jagan Govt) పంపినీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు (Grama/ward Volunteers) లబ్ధిదారుల ఇళ్ల వద్దనే కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది.

Advertisement

kamya karthikeyan: మరో రికార్డును సాధించిన కామ్య, సౌత్ అమెరికాలోని అత్యంత ఎత్తైన శిఖరంను ఎక్కేసింది, ప్రపంచంలో ఈ ఘనతను సాధించిన అత్యంత పిన్న వయస్కురాలు ఈమెనే..

Hazarath Reddy

వైజాగ్‌కు చెందిన యువ పర్వతారోహకురాలు కామ్య కార్తికేయన్ (kamya karthikeyan) మరో రికార్డును సాధించింది. దక్షిణ అమెరికాలో (South America) మరియు ఆసియా వెలుపల ఎత్తైన శిఖరంగా (highest peak) ఉన్న అకాన్కాగువాను (Aconcagua) అధిరోహించిన అతి పిన్న వయస్కురాలుగా రికార్డులకెక్కింది. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలు ఈ పాపనే.. ఫిబ్రవరి 1, 2020 న ఈ యువతి అరుదైన ఘనతను సాధించింది.

AB Venkateswara Rao Suspension: వేటు పడింది, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్‌, దేశ భద్రతా రహస్యాలు లీక్ చేశాడని ఆరోపణలు, సస్పెన్షన్‌పై స్పందించిన వెంకటేశ్వరరావు

Hazarath Reddy

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) సస్పెండ్‌ చేసింది. ఉద్యోగ నియమావళి, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పదవి నుంచి సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని (Chief Secretary Nilam Sawhney) శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి.. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్‌ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.

Zero Interest Loans: మహిళలకు జీరో వడ్డీ రుణాలు, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్, అక్కాచెల్లెమ్మలకు అండగా.., వారి పిల్లలకు మేనమామలా తోడుగా ఉంటానన్న ఏపీ సీఎం

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు మరో అద్భుత అవకాశాన్ని అందించారు. రాష్ట్రంలో మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు (Zero Percent Interest Loans) అందచేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

Disha Police Station: దేశంలో రాజమండ్రిలోనే తొలిసారిగా.., దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.

Hazarath Reddy

మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేసింది. ఇందులో భాగంగా మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.

Advertisement
Advertisement