ఆంధ్ర ప్రదేశ్

Coronavirus-Man Commits Suicide: ఏపీలో కరోనా పుకారు కలకలం, జ్వరాన్ని కరోనా వైరస్‌గా భావించి వ్యక్తి ఆత్మహత్య, చిత్తూరు జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

ఏపీలో (Andhra Pradesh) దారుణం చోటు చేసుకుంది. కరోనా వైరస్ (Coronavirus) గురించి వచ్చిన అనుమానాలతో ఓ వ్యక్తి తన నిండు జీవితాన్ని వదిలేసుకున్నాడు. అతనికి కొంచెం జ్వరంగా ఉంటంతో మొబైల్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన వీడియోలు (Coronavirus-related videos) చూసి తనకు నిజంగానే కరోనా వచ్చిందేమోనని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

AP CM Delhi Tour: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం, రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం, అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు అభినందనలు తెలియజేసిన ఏపీ సీఎం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister CM YS Jagan Mohan Reddy) నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆ సమావేశం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్‌ ఢిల్లీ (AP CM Delhi Tour) బయలుదేరుతారు.

Polavaram Suspense: పోలవరంపై కొనసాగుతోన్న సస్పెన్స్, 2021లోగా పోలవరం పూర్తి చేస్తామన్న కేంద్రం, దాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒడిషా ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (Andhra Pradesh) జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై (Polavaram Project) కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. 2021లోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని వెల్లడించింది. ఇది ఇలావుంటే, పోలవరం ప్రాజెక్టును ఆపాలంటూ ఇటీవల ఒడిశా ప్రభుత్వం (Odisha Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 71 పేజీల అఫిడవిట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది.

Select Committee Formation: టీడీపీకీ భారీ షాక్, సెలక్ట్ కమిటీ ఫైళ్లను తిప్పి పంపిన మండలి కార్యదర్శి, రూల్ 154 కింద సెలక్ట్ కమిటీ వేయడం చెల్లదన్న శాసనమండలి కార్యాలయం

Hazarath Reddy

మూడు రాజధానులు (Three Capitals), సీఆర్డీఏ చట్టం (CRDA Bill) రద్దు బిల్లులపై శాసన మండలి సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ మండలి చైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఈ విషయంలో టీడీపీ పార్టీకి (TDP) భారీ ఎదురుదెబ్బ తగిలింది. సెలక్ట్ కమిటీలను (Celect Committee) ఏర్పాటు చేయకుండా ఆ ఫైళ్లను శాసన మండలి చైర్మన్ షరీఫ్‌కు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తిప్పిపంపారు.

Advertisement

Electricity Charges Hike: ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపు, 500 యూనిట్లు దాటితే యూనిట్‌కు 90 పైసలు అదనంగా చెల్లించాలి, అదాయం పెంచుకునే దిశగా ఏపీ ప్రభుత్వ నిర్ణయం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (AP government) ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా కరెంట్ ఛార్జీలను పెంచుతూ (Electricity Charges Hike) నిర్ణయం తీసుకుంది. 500ల యూనిట్లు పైబడిన వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెరిగాయి. 500ల యూనిట్లు దాటితే యూనిట్ కు 90 పైసలుకి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం (Jagan Govt) నిర్ణయం తీసుకుంది. అంటే 500ల యూనిట్లు పెబడితే.. ప్రతీ యూనిట్ కి రూ.9.05 నుంచి రూ.9.95 కి పెరుగుతాయి.

Guntur Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుమంది అక్కడికక్కడే మృతి, గాయపడిన వారి పరిస్థితి విషమం, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమన్న పోలీసులు

Hazarath Reddy

ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఈ విషాద ఘటన (Guntur Terrific Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మినీ లారీ - ఆటో ఢీకొనటంతో (auto-rickshaw collision) ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పసికందు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లుతెలిపారు.

New Ration Cards: కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి, ఈ నెల 15 నుంచి మీ ఇంటికే రేషన్ కార్డు, పంపిణీ చేయనున్న గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్డు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

ప్రభుత్వం కొత్తగా ఇవ్వనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తి అవ్వడంతో జగన్ సర్కారు (Jagan Govt) పంపినీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు (Grama/ward Volunteers) లబ్ధిదారుల ఇళ్ల వద్దనే కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది.

kamya karthikeyan: మరో రికార్డును సాధించిన కామ్య, సౌత్ అమెరికాలోని అత్యంత ఎత్తైన శిఖరంను ఎక్కేసింది, ప్రపంచంలో ఈ ఘనతను సాధించిన అత్యంత పిన్న వయస్కురాలు ఈమెనే..

Hazarath Reddy

వైజాగ్‌కు చెందిన యువ పర్వతారోహకురాలు కామ్య కార్తికేయన్ (kamya karthikeyan) మరో రికార్డును సాధించింది. దక్షిణ అమెరికాలో (South America) మరియు ఆసియా వెలుపల ఎత్తైన శిఖరంగా (highest peak) ఉన్న అకాన్కాగువాను (Aconcagua) అధిరోహించిన అతి పిన్న వయస్కురాలుగా రికార్డులకెక్కింది. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలు ఈ పాపనే.. ఫిబ్రవరి 1, 2020 న ఈ యువతి అరుదైన ఘనతను సాధించింది.

Advertisement

AB Venkateswara Rao Suspension: వేటు పడింది, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్‌, దేశ భద్రతా రహస్యాలు లీక్ చేశాడని ఆరోపణలు, సస్పెన్షన్‌పై స్పందించిన వెంకటేశ్వరరావు

Hazarath Reddy

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) సస్పెండ్‌ చేసింది. ఉద్యోగ నియమావళి, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పదవి నుంచి సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని (Chief Secretary Nilam Sawhney) శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి.. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్‌ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.

Zero Interest Loans: మహిళలకు జీరో వడ్డీ రుణాలు, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్, అక్కాచెల్లెమ్మలకు అండగా.., వారి పిల్లలకు మేనమామలా తోడుగా ఉంటానన్న ఏపీ సీఎం

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు మరో అద్భుత అవకాశాన్ని అందించారు. రాష్ట్రంలో మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు (Zero Percent Interest Loans) అందచేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

Disha Police Station: దేశంలో రాజమండ్రిలోనే తొలిసారిగా.., దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.

Hazarath Reddy

మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేసింది. ఇందులో భాగంగా మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.

KIA Motors: అన్నీ అబద్దాలే, మేము ఎక్కడికీ తరలిపోవడం లేదు, అసత్య ప్రచారాలు నమ్మకండి, జగన్ సర్కారు మాకు అండగా ఉంది, ఇక్కడ నుంచే ప్రపంచ స్థాయి కార్లు తయారుచేస్తాం, క్లారిటీ ఇచ్చిన కియా మోటర్స్ యాజమాన్యం

Hazarath Reddy

గత కొద్ది రోజుల నుంచి ఏపీలో కియా మోటార్స్ న్యూస్ హాట్ టాఫిక్ గా మారింది. అనంతపురంలో ఉన్న కియో మోటర్స్ తమిళనాడుకు తరలిపోతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు కియో మోటర్స్ ను తమిళనాడుకు పంపేలా ఉన్నాయని, ఇదేం పాలన అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేసారు. అయితే ఈ వివాదం మీద కియా మోటర్స్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Vizag vs Hyderabad: జగన్ ఒక్కసారి కమిట్ అయితే..! ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, వైజాగ్ అయితేనే హైదరాబాద్‌తో పోటీపడుతుందని పునరుద్ఘాటన

Vikas Manda

గత ప్రభుత్వం పూల్ చేసిన 53,000 ఎకరాల భూమిలో ప్రాథమిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం, ఎకరానికి రూ .2 కోట్ల చొప్పున రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు అంచనాలు చూపించారు. ఇందుకు కేంద్రం నుంచి లభించిన సహాయం రూ. 1,500 కోట్లు, గుప్పెడు వేరుశెనగలు ఇచ్చినంత అని చెప్పారు....

Defence Cluster In Donakonda: జగన్ సర్కారు సంచలన నిర్ణయం, దొనకొండ కేంద్రంగా డిఫెన్స్‌ క్లస్టర్‌, కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఏపీ పరిశ్రమల శాఖ, 35 దేశాల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. ప్రకాశం జిల్లాలోని దొనకొండ కేంద్రంగా డిఫన్స్ క్లస్టర్‌ను (Defence Cluster In Donakonda) ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి (IT Minister Mekapati Goutham Reddy) తెలిపారు.

Disha Police Station: దేశంలోనే తొలిసారి, మహిళల భద్రతకు ‘దిశ’ విభాగం, రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా దిశ పోలీస్ స్టేషన్, రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, మీడియాతో డీజీపీ గౌతం సవాంగ్

Hazarath Reddy

మహిళా రక్షణకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 'దిశ' విభాగం ఏర్పాటు చేశామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ప్రతి పోలీసుస్టేషన్ మహిళామిత్రలా ఉండే ఏపీలో 18 'దిశ' స్టేషన్లు (Disha Police Station) ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డీజీపీ (Damodar Goutam Sawang) అన్నారు. ఆయన బుధవారం రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు.

National Cyber Crime Reporting Portal: ఆన్‌లైన్ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు వెబ్ పోర్టల్ ప్రారంభించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, సైబర్ నేరాలను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన కిషన్ రెడ్డి

Vikas Manda

ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులు లేదా ఏదైనా ఆన్‌లైన్ మోసంపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ను ప్రారంభించింది. ఎవరైనా అందులోకి లాగిన్ అయి నేరుగా తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చునని మంత్రి స్పష్టం చేశారు....

Advertisement

Amaravati Farmers Meet AP CM: అమరావతి ఎక్కడికీ పోదు, రాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా ఉంటుంది, అమరావతి రైతులకు భరోసా ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

రాజధాని ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) అమరావతి రైతులకు చెప్పారు. రాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతే (Amaravati) కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) పునరుద్ఘాటించారు.

Three Capitals Row: రాజధాని అంశంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు, రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మాకు సంబంధం లేదు, లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర హోంశాఖా సహాయమంత్రి

Hazarath Reddy

మూడు రాజధానుల (Three Capitals) ఏర్పాటుపై ఏపీలో దుమారం రేగుతున్న వేళ పార్లమెంట్‌లో (Parliament) కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ రాజధానిపై లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్(TDP MP Galla Jayadev) అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్(Minister of State for Home Affairs Nithayanada Rai) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Millennium Tower-B In VIzag: సీఎం జగన్ దూకుడు, మూడు రాజధానుల అంశంపై మరింతగా ముందుకు, విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణానికి నిధులు విడుదల, కర్నూలుకు తరలిన విజిలెన్స్‌ కమిషనరేట్‌

Hazarath Reddy

విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని మధురవాడ వద్ద ఉన్న రుషికొండలో (Rushikonda) మిలీనియం టవర్‌-బి నిర్మాణానికి (Millennium Tower-B In VIzag) ప్రభుత్వం రూ.19.73 కోట్లు విడుదల చేసింది. టవర్‌-బి నిర్మాణం కోసం ఐటీశాఖకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్‌ సోమవరం ఉత్తర్వులు జారీచేశారు. టవర్‌-ఏ నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. విశాఖ మిలీనియం టవర్స్‌లోనే సచివాలయం కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Madanapalle Murder Case: భార్యను సైనేడ్‌తో చంపేశాడు, అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్, వీడిన మదనపల్లి కేసు మిస్టరీ

Hazarath Reddy

అతనో బ్యాంకు మేనేజర్, లక్షల్లో జీతం..అయినా ధన దాహం తీరలేదు. భార్య తీసుకువచ్చిన లక్షల కట్నం సరిపోలేదు. అదనపు కట్నం కావాలని భార్యను వేధించాడు. ఇంకా ధన దాహం తీరలేదేమో..ఏకంగా భార్యనే పైకి పంపాడు. ఆమె రోజు వేసుకునే ట్యాబ్లెట్లలో సైనేడ్ ఇచ్చి చంపేశాడు. ఇది మదనపల్లి బ్యాంక్ మేనేజర్ కేసు(Madanapalle Bank Manager Case) కథ.

Advertisement
Advertisement