ఆంధ్ర ప్రదేశ్

Balineni vs Chevireddy: చెవిరెడ్డికి కౌంటర్ విసిరి బాలినేని, నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని వెల్లడి, ఎవరి మెప్పుకోసం నేను పనిచేయట్లేదని మండిపాటు

Hazarath Reddy

వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.. ఇతర పార్టీనేతలతో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఇక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇతర పార్టీలతో మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ ఉండదని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యలపై బాలినేని స్పందించారు.

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Hazarath Reddy

సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నపుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Andhra Pradesh: తల్లిని ఆస్పత్రి బయట వదిలి వెళ్ళిన కొడుకుల ఘటనపై స్పందించిన నారా లోకేష్, ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

వీడియోని బిగ్ టీవీ తన ఎక్స్ లో షేర్ చేసింది. దీనిపై నారా లోకేష్ స్పందించారు. ఈ విజువల్స్ చూస్తే గుండె పగిలిపోతుంది. ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించేందుకు అధికారులతో కలిసి కృషి చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు.

Parliament Winter Session 2024: పసుపు రంగు సైకిల్‌తో పార్లమెంట్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, ఢిల్లీ కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చానని వెల్లడి

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ అప్పల నాయుడు కలిశెట్టి నవంబర్ 25న పసుపు రంగు సైకిల్‌తో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యాడు. పసుపు కుర్తా, తెల్ల లుంగీ ధరించి నేటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలకు ఎంపీ వచ్చారు.

Advertisement

Ram Gopal Varma: వీడియో ఇదిగో, రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న మద్దిపాడు పోలీసులు, అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం

Hazarath Reddy

రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు చేరుకున్నారు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు రాంగోపాల్ వర్మ హాజరు కావలసి ఉంది.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, ఏటీఎం నుంచి డబ్బులు తీసివ్వమని అడిగినందుకు కార్డు మార్చేసి రూ. 75 వేలు డ్రా చేసుకున్న దొంగ

Hazarath Reddy

ఉరవకొండ CANARABANK ATM సెంటర్లో ఏటీఏం కార్డును మార్చి నగదు చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. రాయంపల్లికి చెందిన నేటికల్లు అనే వ్యక్తి నగదును తీసుకోవడానికి పట్టణంలోని ఏటీఏంలోకి వెళ్లారు. అయనకు అవగాహన లేకపోవడంతో డబ్బులు తీసి ఇవ్వాలని కోరుతూ అక్కడే ఉన్న యువకుడికి కార్డు ఇచ్చారు. రెండు సార్లు రూ.20వేల నగదు తీసి ఇచ్చాడు

Devotee Dies of Heart Attack: వీడియో ఇదిగో, గుండెపోటుతో అయ్య‌ప్ప మాల‌ధారుడు మృతి, ద్వారకా తిరుమల దర్శనంలో విషాదకర ఘటన

Hazarath Reddy

స్నేహితుల‌తో క‌లిసి ద్వారకా తిరుమలకు వచ్చిన అమ‌లాపురం మండ‌లం ఇందుప‌ల్లికి చెందిన సురేష్ (27). వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కి వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిన సురేష్ వెంట‌నే ఆసుపత్రికి తరలించిన స్నేహితులు.. అప్ప‌టికే మృతిచెందిన‌ట్టు తెలిపిన డాక్ట‌ర్లు.

Allu Arjun Dance at Pushpa-2 Event: చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ (వీడియో)

Rudra

మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప-2 కోసం సినిమా యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చెన్నైలో గ్రాండ్‌ గా నిర్వహించిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Accident in Prakasam: ప్ర‌కాశం జిల్లా బేస్త‌వారిపేట మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ట్రాక్టర్‌ ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Rudra

ప్ర‌కాశం జిల్లా బేస్త‌వారిపేట మండ‌లం శాంతిన‌గ‌ర్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. ట్రాక్టర్‌ ను వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

Rains in AP: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ నేడు దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

Heavy Rush in Srisailam: కార్తీక మాసం క‌దా అని శ్రీ‌శైలం వెళ్తున్నారా? ఘాట్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్, ఏకంగా 5 కి.మీ మేర నిలిచిపోయిన వాహ‌నాలు

VNS

కార్తిక మాసం సందర్భంగా శని, ఆదివారాలు సెలవుల కారణంగా శ్రీశైలం ఆలయానికి (Srisailam Temple) భక్తులు పోటెత్తారు. మల్లన్న స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తిక మాసాన్ని (Kartika Masam) పురస్కరించుకొని శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు వాహనాల్లో తరలిరావడంతో దాదాపు 5కి.మీల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

JC Prabhakar Reddy: ఆటోల కారణంగానే రోడ్డు ప్రమాదాలు, వెంటనే బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో

Hazarath Reddy

టీడీపీ సీనియర్‌ నేత,తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆటోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటోల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లిలో శనివారం(నవంబర్‌ 23) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందడంపై జేసీ స్పందించారు

Advertisement

Andhra Pradesh: విద్యార్దినిపై శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ దారుణం, తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయ‌పరిచిన సత్యనారాయణ

Hazarath Reddy

ఆకివీడులో దారుణం చోటు చేసుకుంది. తొమ్మదవ తరగతి విద్యార్దినిపై దాడిచేసిన శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ . విద్యార్ధిని తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయ‌పరిచిన సత్యనారాయణ . స్కూల్ బస్సులో హేళనగా మాట్లాడిందని కరస్పాండెంట్ కు డ్రైవర్ ఫిర్యాదు చేశారు.

Divvela Madhuri: పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దివ్వెల మాధురి, రెండేళ్ల క్రితం దువ్వాడపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు

Hazarath Reddy

పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు దివ్వెల మాధురి ఫిర్యాదు చేశారు, రెండేళ్ల క్రితం దువ్వాడపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.దువ్వాడ తరఫున పోలీసులకు మాధురి ఫిర్యాదు చేసింది

Young Man Dies by Suicide in Bus: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య, చివరి సీటు వద్ద ఉన్న హ్యాంగర్‌కు ఉరేసుకుని సూసైడ్

Hazarath Reddy

ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ యువకుడు మృతిచెందిన విషాదకర ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రేణిగుంట వద్ద కండక్టర్‌ దీన్ని గుర్తించారు.

Andhra Pradesh: నిమ్మకాయలు పట్టుకుని మీసాలు, గడ్డంతో అఘోరీ హల్‌చల్, కర్నూలు జిల్లాలో భయాందోళనకు గురైన స్థానికులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కర్నూలు జిల్లాలో మరోసారి అఘోరీ హల్చల్ చేశారు. గడ్డం, మీసంతో కనిపించి ఆశ్చర్యానికి గురిచేశారు. అఘోరీని చూసి స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. నిమ్మకాయలతో ఏం చేస్తున్నావంటూ కొందరు మహిళలు అఘోరీని ప్రశ్నించగా.. తాను దిష్టి తీస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ వల్లే గెలిచా.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్‌ కోఠే (వీడియో)

Rudra

అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ వల్లే గెలిచానని మహారాష్ట్రలోని సోలాపూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగు యువకుడు దేవేంద్ర రాజేశ్‌ కోఠే తెలిపారు.

Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం.. అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ రేపటికల్లా (సోమవారం) దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

CAT Exam Today: నేడు క్యాట్‌ ఎగ్జామ్‌.. మూడు సెషన్లలో పరీక్ష.. తెలంగాణలో సెంటర్లు ఇవే..!

Rudra

ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో ఎంబీఏ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్‌ ఎగ్జామ్‌ ఆదివారం జరగనుంది.

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

VNS

ఈ కేసుకు సంబందించి తాజాగా భార్గవ్‌ రెడ్డి, అర్జున్‌ రెడ్డిలకు పులివెందుల పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. విజయవాడలోని సజ్జల భార్గవ్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన పులివెందుల పోలీసులు.. ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు.

Advertisement
Advertisement