ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: వీడియో ఇదిగో, నందిగామలో నడిరోడ్డుపై తన్నుకున్న టీడీపీ - వైసీపీ నాయకులు, నలుగురికి గాయాలు, వైసీపీ ఎంపీపీ మాలిక్ బషీర్‌తో పాటు 15 మందిపై హత్యాయత్నం కేసు నమోదు

Hazarath Reddy

ఏపీలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ,వైసీపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో వ్యక్తిగత గొడవల కారణంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నడిరోడ్డుపై రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.

Weather Update: ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి వచ్చే మూడు రోజుల పాటు వర్ష సూచన, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం

Hazarath Reddy

ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదిలే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు.

Andhra Pradesh: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని తేల్చిచెప్పిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, లేని బిడ్డకు పేరు ఎలా పెడతాం అని వైసీపీ సభ్యులకు ఎదురు ప్రశ్న..వీడియో ఇదిగో

Arun Charagonda

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని తేల్చిచెప్పారు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి..వాలంటీర్ వ్యవస్థ లేని బిడ్డ లాంటిది..అసలు ఆ వ్యవస్థే లేదని చెప్పారు మంత్రి. లేని బిడ్డకు పేరు పెట్టడం ఎలా సాధ్యం? అని ఎదురు ప్రశ్న వేశారు. ఎన్నికల్లో కొనసాగిస్తాం అని హామీ ఇచ్చారు కదా అన్న ప్రశ్నకు.. అన్నాం.. కానీ మీరు కూడా సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి చేయలేదు కదా అంటూ డైవర్ట్ చేశారు మంత్రి.

Ram Gopal Varma: ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వర్మ, నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో వెల్లడి

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. ఇప్పటికే క్వాష్‌ పిటిషన్‌ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Video: నన్ను కువైట్‌లో చంపేసేలా ఉన్నారు, కాపాడాలంటూ వీడియో విడుదల చేసిన కాకినాడ మహిళ, నన్ను ఎలాగైనా నా పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటిపర్యంతం

Hazarath Reddy

కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది. ఈ ఘటం నియోజకవర్గంలో కలకలం రేపుతుంది..నాకు సరిగా తిండిపెట్టడంలేదు, చంపేసేలా ఉన్నారు.నన్న కాపాడి, పిల్లల వద్దకు చేర్చాలంటూ' కన్నీటి పర్యంతమవుతోంది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయిన వృద్ధురాలిని కాపాడిన పోలీసులు, శభాష్ పోలీసన్న అంటూ నెటిజన్ల ప్రశంసలు

Hazarath Reddy

ఏపీలోని నంద్యాల జిల్లా ముష్టపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. నీరు తెచ్చుకునేందుకు బావి వద్దకు వెళ్లిన ఓ వృద్దురాలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. రక్షించాలని ఆమె కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి వెంటనే ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు

Posani Krishna Murali: ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలులో వేస్తారా?, పవన్‌ను తిడితే ఖండించా.. అప్పుడు పోసాని మంచి వాడు....ఇప్పుడు ప్రజల కోసం ప్రశ్నిస్తే చెడ్డవాడా ?.ఇదెక్కడి న్యాయం అన్న పోసాని కృష్ణమురళి

Arun Charagonda

నన్ను నా కుటుంబాన్ని తిట్టారు కాబట్టే వాళ్లని తిట్టాను అన్నారు వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పోసాని... ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తారా ? చెప్పాలన్నారు. పోలీసులు నాపై విచారణ చేస్తే నేను తప్పు చేసినట్లు వాళ్ళకు ఎలాంటి ఆధారాలు దొరకవు..అన్యాయంగా ఒక మంచి నాయకుడిని నేను ఎన్నడూ తిట్టలేదు అన్నారు.

Andhra Pradesh: అమ్మాయికి మెసేజ్ చేశాడని యువకుడిని చితకబాదిన ముగ్గురు యువకులు, తూర్పు గోదావరి జిల్లాలో ఘటన..వీడియో ఇదిగో

Arun Charagonda

అమ్మాయికి మెసేజ్ చేశాడని యువకుడిపై ముకుమ్మడిగా పాశవికంగా దాడి చేశారు ముగ్గురు యువకులు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితుడు మలికిపురం AFDT జూనియర్ కళాశాలలో చదువుతున్నాడని తెలుస్తోంది.

Advertisement

YS Jagan Mohan Reddy: శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌, శ్రీ విధుశేఖర భారతి స్వామీజీని కలిసి ఆశీర్వచనం తీసుకున్నమాజీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు(మంగళవారం)సాయంత్రం విజయవాడ శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని దర్శించుకున్నారు. సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించి..,శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలిశారు

AP Assembly Session 2024: మైలవరంలో మైనింగ్‌లో అక్రమాలు, గత ఎమ్మెల్యే హస్తం ఉందని తెలిపిన కొల్లు రవీంద్ర, సభలో నా పరువుకు భంగం కలిగిందని వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం

Hazarath Reddy

అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్త చేశారు. మైలవరంలో మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని అందులో గత ఎమ్మెల్యే హస్తం ఉందని మంత్రి శాసన మండలిలో నా ప్రస్తావన తెచ్చారు. కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో సభలో నా పరువుకు భంగం కలిగింది.

Andhra Pradesh Assembly Session 2024: వీడియో ఇదిగో, మీరు క‌ట్టుకున్న‌ చీర చేనేతదేనా, ఎమ్మెల్యే లోకం మాధవిని సరదాగా ప్రశ్నించిన డిప్యూటీ స్పీక‌ర్ రఘురామ

Hazarath Reddy

ఉద్యోగులు నెలకు ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మాధవి ప్రశ్నించగా... ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరనా? లేక వేరే చీరనా? అని రఘురాజు ప్రశ్నించారు. తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు.

YS Sharmila Reddy: వీడియో ఇదిగో, కడప అమీన్‌పీర్‌ దర్గాను దర్శించుకున్న వైయస్ షర్మిల, దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన ఏపీసిసి చీఫ్

Hazarath Reddy

కడప అమీన్‌పీర్‌ దర్గాను ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి దర్శించుకున్నారు. దర్గాలో కు విచ్చేసిన ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి కు దర్గా సంప్రదాయం ప్రకారం దర్గా నిర్వాహకులు స్వాగతం పలికారు.దర్గాలో ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, కేరళలో చిక్కుకున్న ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు, సాయం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు వీడియో ద్వారా విన్నపం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధి వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు..కేరళలో చిక్కుకున్నారు. వారు బరిమల యాత్రకు వెళ్లగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనం చిక్కుకుందని వీడియో ద్వారా తెలిపారు.

Andhra Pradesh Shocker: విశాఖలో లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్ నిజాలు, ప్రేమించిన ప్రియుడే ఆమె పాలిట రాక్షసుడిగా స్నేహితులకు..

Hazarath Reddy

విశాఖపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.లా చదువుతున్న విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. న్యాయ విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి నిందితులు బెదిరించారు.

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోండి, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో భేటీ అయిన వైఎస్ సునీత

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఈరోజు ఏపీ అసెంబ్లీకి వెళ్లి.. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో ఆమె భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు గురించి ఆమెతో చర్చించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి... జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.

Kotamreddy Sridhar Reddy: చంద్రబాబును జైల్లో పెట్టేందుకు జగన్ ఫైళ్లను మాయం చేశారు, అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో...

Hazarath Reddy

వైసీపీ హయాంలో చంద్రబాబు(Chandrababu)పై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) ఆరోపించారు. ఓ టీవీ ఛానల్‌ చర్చలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ (PV Ramesh)దీనిపై చాలా స్పష్టంగా చెప్పారన్నారు.

Advertisement

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్, టీడీపీ నేత రంగబాడుపై ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడిన కేసులో అదుపులోకి..

Hazarath Reddy

గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన రంగబాబుపై వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్‌ ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, టీడీపీ సోషల్‌ మీడియాలో వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు

Hazarath Reddy

వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ సోషల్‌ మీడియాలో పోస్టులపై పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. వైఎస్‌ జగన్‌పై లోకేష్‌ చేసిన అసభ్యకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటూ అంబటి ప్రశ్నించారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం, ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి లభించకపోవడంతో..

Hazarath Reddy

సీఎం ChandrababuNaidu ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్లగా, ఆమెకు అనుమతి లభించలేదు.

ISRO GSAT-20: ఎలాన్ మస్క్‌ ‘స్పేస్‌ ఎక్స్’ రాకెట్ ద్వారా ఇస్రో జీశాట్-20 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం.. ఎందుకోసం అంటే?

Rudra

ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్‌ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ ఎక్స్’కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా జీశాట్-20 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.

Advertisement
Advertisement