ఆంధ్ర ప్రదేశ్
TTD: తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల స్వర్ణ వైజయంతీ మాల విరాళం, బహుకరించిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య...వీడియో ఇదిగో
Arun Charagondaతిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీమాల విరాళంగా అందించింది. వైజయంతీ మాలను బహూకరించారు మాజీ ఎంపీ, టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి మరో వైజయంతీ మాలను రేపు విరాళమివ్వనున్నారు దాత.
Anitha Slams YS Jagan: రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ అసెంబ్లీకి రారు, సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అనిత, వీడియో ఇదిగో..
Hazarath Reddyవైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని, కానీ, రఘురామకృష్ణరాజు ఉప సభాపతి అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అసెంబ్లీకి రారని పేర్కొన్నారు.
YS Sharmila Slams Jagan: ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు, మరోసారి జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టిన వైఎస్ షర్మిల
Hazarath Reddyఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్న షర్మిల తాజాగా మరోసారి విమర్శలు ఎక్కుపెట్టింది. బడ్జెట్ మీద జగన్ ప్రసంగించిన తరువాత ఆమె వైసీపీ అధినేత వ్యాఖ్యలపై మండిపడింది.
AP Rain Alert: బిగ్ అలర్ట్, బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈనెల 15, 16 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
YS Jagan on Sharmila: చెల్లి షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే ఉన్న వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ..
Hazarath Reddyఅసెంబ్లీకి వెళ్లనప్పుడు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేసింది కదా అని అడిగిన మీడియా ప్రతినిధికి జగన్ సమాధానమిస్తూ.. చెల్లి షర్మిల గురించి, 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Andhra Pradesh: రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుంటానంటూ యువకుడి సెల్ఫీ వీడియోపై స్పందించిన నరసరావుపేట డీఎస్పీ, ఏమన్నారంటే..
Hazarath Reddyసెల్పీ వీడియోపై నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు స్పందించారు. మదార్ వలీ పోలీసులపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. అతణ్ణి నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామకృష్ణ, కానిస్టేబుల్ బాబు నగదు అడగలేదు. తప్పు తనదేనని, భయపడి అలా చెప్పానని మదార్ వలీ విచారణలో ఒప్పుకున్నాడు.
AP Assembly Session: అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా, స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు సవాల్ విసిరిన వైసీపీ అధినేత వైఎస్ జగన్
Hazarath Reddyజగన్ అసెంబ్లీకి హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపిన నేపథ్యంలో జగన్ స్పందించారు. ‘‘అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా? నేను రెడీ.. రమ్మను’’ అంటూ సవాల్ విసిరారు. కాగా తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్ చెప్పారు
YS Jagan Slams CM Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు నటన ముందు NTR నటన నథింగ్, సూపర్ సిక్స్ అడుగుతారని ఇన్ని రోజులు బడ్జెట్ సాగదీశారని మండిపాటు
Hazarath Reddyఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌హన్‌రెడ్డి మండిపడ్డారు.
Actress Sri Reddy: ఈ సారి శ్రీరెడ్డి వంతు..క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు, అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకురాలు మజ్జి పద్మ
Hazarath Reddyసోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ మరియు ఇతర టిడిపి జనసేన నాయకులు పై శ్రీ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు గాను ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
Ram Gopal Varma: పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అభ్యంతరకర పోస్టులు, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
Hazarath Reddyసినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు హైదరాబాద్ వెళ్లిన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు... హైదరాబాదులోని రామ్ గోపాల్ వర్మ నివాసంలో నోటీసులు అందించారు.
Nara Lokesh on DSC: ఏపీలో త్వరలో 595 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్, అసెంబ్లీ వేదికగా నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు, 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని వెల్లడి
Hazarath Reddyఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ అసెంబ్లీలో డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయమై బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ పలు విషయాలను వెల్లడించారు.
HC on Social Media Post Cases: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు, కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు, జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని ఆగ్రహం
Hazarath Reddyసోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సోషల్ మీడియా ఆక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు విజయబాబు వేసిన పిల్‌పై హైకోర్ట్‌లో ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, రాజమండ్రిలో మద్యం మత్తులో బొండాల నరికే కత్తితో మందుబాబు వీరంగం, తన తలను తానే నరుక్కుంటూ..
Hazarath Reddyమద్యం మత్తులో కత్తితో వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. రాజమండ్రి లాలా చెరువు మేనకా రెడ్డి బార్ వద్ద బొండాల నరికే కత్తితో గందరగోళం సృష్టించిన వ్యక్తి. భయాందోళనకు గురైన మందుబాబులు. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, తప్పుడు కేసులో ఇరికించి రూ. 5 లక్షలు లంచం డిమాండ్, రైలు పట్టాలపై తల పెట్టి చనిపోతున్నానంటూ యువకుడు వీడియో
Hazarath Reddyనరసరావుపేట రూరల్ సి.ఐ పసుపులేటి రామక్రిష్ణ, బాబు అనే కానిస్టేబుల్ చేత తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నాడని, కేసు లేకుండా చేయాలంటే తనకు ఐదు లక్షల రూపాయలు లంచం గా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితుడు వాపోయాడు..
Andhra Pradesh: జగన్ మీరు కలిసి చంద్రబాబుది ఏమైనా చీ..తారా, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ రాయలేని భాషలో తిట్టారంటూ మండిపడిన పేర్ని నాని
Hazarath Reddyవైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్‌కి వచ్చి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ బూటు కాలితో తన్ని దుర్భాషలాడాడని మండిపడ్డారు. రాయలేని భాషలో ఆయన మాట్లాడారని పేర్నినాని ఆవేదన వ్యక్తం చేశారు.
Vijayasai Reddy Slams CM Chandrababu: అమరావతి మీద ఉన్న ప్రేమ విశాఖ మీద లేకపాయే, సీఎం చంద్రబాబుపై మండిపడిన విజయసాయిరెడ్డి
Hazarath Reddyఏపీలో కూటమి సర్కార్ పాలన తీరుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు . సీఎం చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే.. అని కామెంట్స్ చేశారు. చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
Raghurama Krishnam Raju: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఖరారయ్యారు. ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఇవాళే ఆయన నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
AP Assembly Budget Session 2024: రెండో రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు సమయం, పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన మంత్రులు
Hazarath Reddyరెండో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Speaker Ayyannapatrudu) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది.
Andhra Pradesh Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు, ఎంపిక చేసిన సీఎం చంద్రబాబు, ఏకగ్రీవం కానున్న డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
Arun Charagondaఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరును ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. ఉండి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు రఘురామ. వాస్తవానికి చంద్రబాబు కేబినెట్‌లో రఘురామకు చోటు దక్కుతుందని అంతా భావించిన సామాజిక సమీకరణల నేపథ్యంలో చోటు దక్కలేదు.