ఆంధ్ర ప్రదేశ్
Police Case on Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మధురైలో కేసు నమోదు.. ఎందుకంటే?
Rudraఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తమిళనాడులోని మధురైలో ఓ కేసు నమోదైంది. వంజినాథన్ అనే న్యాయవాది ఈ మేరకు మధురై కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
Mallareddy Mass Dance: మాస్ స్టెప్పులతో హుషారెత్తించిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. బతుకమ్మ పాటకు విద్యార్థినులతో నృత్యం (వీడియో)
Rudra‘పాలమ్మిన, పూలమ్మిన..’ అనే డైలాగ్ తో తెలుగురాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం చేసిన వైరల్ అవ్వాల్సిందే.
Rajendra Prasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి
Rudraవిలక్షణమైన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందారు.
Nandigam Suresh Gets Bail: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు రిలీఫ్, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Arun Charagondaవైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసు పై దాడి కేసులో మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Tirupati Laddu Row: వీడియో ఇదిగో, దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు చెప్పినా బాబు బుద్ధి మారడం లేదు, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నాడు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని చెప్పింది. స్వయంగా వేసుకున్న సిట్‌ను రద్దు చేసింది
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది
Tirupati Laddu Row: జరగని దాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం చేసిన వారిని స్వామివారే శిక్షిస్తారన్న జగన్..సనాతన ధర్మమంటే పవన్‌కు తెలుసా? అని ప్రశ్న
Arun Charagondaసుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు మాజీ సీఎం జగన్. తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ తో విచారణ జరపాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించగా వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. ఏ అధికారులు వచ్చి ఏం చేస్తారు అని తెలిపారు. తప్పుడు రిపోర్ట్ ఇచ్చినా.. తప్పుడు ప్రచారం చేసినా స్వామివారే చూసుకుంటారు అని తెలిపారు జగన్.
DMK Vs Pawan Kalyan: సనాతన ధర్మానికి మీరే పెద్ధ శత్రువులు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కౌంటర్ విసిరిన డీఎంకే, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyతిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ (DMK Vs Pawan Kalyan) ఇచ్చింది.
Sanatan Dharma Row: వేచి చూడండి అంటూ పవన్ కళ్యాణ్‌కి కౌంటర్ విసిరిన ఉదయనిధి స్టాలిన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది.
Tirupati Laddu Controversy: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం, తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ట్వీట్
Hazarath Reddyతిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.
Tirupati Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు, భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
Arun Charagondaసంచలనం రేపిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి సీనియర్ అధికారి ఉండాలని న్యాయస్థానం సూచించింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
Dattatreya's Alai Balai: ‘అలయ్ బలయ్’ వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి సందడి.. 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కార్యక్రమం
Rudraబండారు దత్తాత్రేయ అనగానే తెలుగు ప్రజలందరికీ గుర్తొచ్చేది ‘అలయ్ బలయ్’ ఈవెంట్. ఏటా దసరా మరుసటి రోజున రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు.
Harsha Sai Case: యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్.. హర్షపై బాధితురాలి మరో ఫిర్యాదు.. ఈసారి ఏంటంటే?
Rudraప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హర్షసాయి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చారు.
Varahi Declaration: పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ఏడు అంశాలు ఇవే, సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా డిక్లరేషన్
Hazarath Reddyడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి తరచుగా తన బాణీ వినిపిస్తున్న సంగతి విదితమే. తిరుపతిలో ఇవాళ నిర్వహించిన సభలో పవన్ 'వారాహి డిక్లరేషన్' విడుదల చేశారు. ఈ డిక్లరేషన్ లో సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రస్తావించారు. మొత్తం 7 అంశాలతో ఈ డిక్లరేషన్ రూపొందించారు.
Vijayawada Kanaka Durga: కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం, మహారాష్ట్రకు చెందిన సౌరభ్ భక్తుడు బహుకరించిన వీడియో ఇదిగో..
Hazarath Reddyవిజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ(Goddess Kanaka Durga)కు ఓ భక్తుడు భారీ కానుక సమర్పించారు. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుకగా అందజేశారు. మహారాష్ట్రకు చెందిన సౌరభ్ అనే భక్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆ కిరీటాన్ని ప్రజల ముందు ప్రదర్శించారు.
Andhra Pradesh: ఏలూరు జిల్లాలో కొడవలితో యువతిపై దాడికి యత్నించిన యువకుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొడవలితో నడి రోడ్డులో ఓ యువకుడు హల్ చల్ చేశాడు.కొడవలితో యువతి పై దాడికి యత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అయితే దీనికి ప్రేమ వ్యహారం కారణమా లేక ఇంకేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, లేటు వయసులో పెళ్లి చేసుకున్న భర్తకు షాకిచ్చిన భార్య, తన ఇంటికి తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
Hazarath Reddyశ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి గ్రామంలో పెళ్లైన పదిహేను రోజులకే భర్తకు ఓ భార్య బిగ్ షాకిచ్చింది. భీమవరంలో పెళ్లి చేసుకున్న అతను తన భార్యను తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ఆమె పెళ్లి అయిన తర్వాత అత్తారింట్లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంది.
Road Accident Video: వీడియో ఇదిగో, పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, పనుల నుంచి తిరిగి వస్తున్న కూలీల ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టిన లారీ
Hazarath Reddyపల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద పనుల నుంచి తిరిగి వస్తున్న కూలీల ట్రాక్టర్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
Pawan Kalyan on Sanatana Dharma: సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా రెడీ, తిరుపతి వారాహి సభలో గర్జించిన పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్‌కు పరోక్ష హెచ్చరిక!
Hazarath Reddyఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. యావత్ దేశం శ్రీరాముడ్ని పూజిస్తుందని అన్నారు. కానీ శ్రీరాముడ్ని పాదరక్షలతో కొట్టి ఊరేగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? గదుల్లో కూర్చుని ఏడుద్దామా? అని ప్రశ్నించారు.
Pawan Kalyan Health Update: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, తిరుమల మెట్లు ఎక్కిన తర్వాత తీవ్ర అస్వస్థత, వారాహి సభలో పాల్గొంటారని తెలిపిన శ్రేణులు
Hazarath Reddyఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం నాడు తిరుమల మెట్లు ఎక్కిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన వెన్నునొప్పితో బాధపడ్డారు