ఆంధ్ర ప్రదేశ్

Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు కావడంతో ఫర్నీచర్ ధ్వంసం చేసిన అభిమానులు (వీడియో)

Rudra

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనున్నది. తొలిపార్ట్‌ ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ క్రమంలో మూవీ మేకర్స్‌ ఆదివారం హైదరాబాద్‌ లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

Tirumala Shanti Homam : తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు కీలక నిర్ణ‌యం, తిరుమ‌ల దేవ‌స్థానంలో శాంతిహోమం,

VNS

తిరుమలలో సోమవారం శాంతి హోమం నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu) తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతిహోమం, పంచగవ్యప్రోక్షణ చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. తిరుమలలో (Tirumala) ఆగస్టు 15న జరిగిన తప్పునకు యాగం చేశారన్నారు.

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు..వీడియో ఇదిగో

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేంకటేశ్వర ఆలయానికి పోరాటాసి మాసంలో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. పోరాటాసి మాసంలో వేంకటేశ్వరుడు భూమిపై వెలిశాడని ప్రతీతి.

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్, ఇందుకు కారణమైన వారు నెత్తురు కక్కుకొని చావాలని మొక్కుకున్న అని వెల్లడి

Arun Charagonda

తిరుమ‌ల లడ్డు క‌ల్తీపై చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌ను ఛాలెంజ్ చేస్తున్నాం అన్నారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి. ఈ విష‌యంలో ప్ర‌ధాని మోదీ క‌లుగ‌జేసుకోవాల‌ని, ఆరోప‌ణ‌లు నిజ‌మైతే అందుకు కార‌ణ‌మైన వారు నెత్తురు క‌క్కుకుని చావాల‌ని వెంక‌టేశ్వ‌ర‌స్వామిని వేడుకుంటున్నాను అన్నారు. ఆరోప‌ణ‌లు అబ‌ద్ధం అయితే ఆ వెంక‌టేశ్వ‌ర‌స్వామే చంద్ర‌బాబును శిక్షిస్తాడు అన్నారు.

Advertisement

Stray Dogs Attack: కరీంనగర్‌లో వీధి కుక్కల స్వైర విహారం, మహిళా కాలేజీ సమీపంలో ఓ మహిళపై దాడి చేసిన వీధి కుక్కలు..వైరల్ వీడియో

Arun Charagonda

కరీంనగర్‌లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. మహిళా కళాశాల సమీపంలో ఓ మహిళపై దాడి చేశాయి వీధి కుక్కలు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. సీసీ టీవీ వీడియో వైరల్‌గా మారింది.

Theft In Saibaba Temple: అనకాపల్లి సాయిబాబా గుడిలో చోరి, వెండి కిరీటాన్ని దొంగలించిన దొంగ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా చోడవరంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. వెండి కిరీటం, ఓ వెండి విగ్రహం, సుమారు 100 తులాల ఆభరణాలను దొంగ ఎత్తుకెళ్లాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tirupati Laddu Controversy : ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ, ఇదంతా చంద్రబాబు కుట్రేనని వెల్లడి, వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధానిని కోరిన జగన్

Arun Charagonda

తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఏపీ మాజీ సీఎం జగన్. తిరుపతిలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం అంతా చంద్రబాబు కుట్రలో భాగమని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధాని మోడిని కోరారు జగన్.

Pawan Kalyan On Tirupati Laddu: చర్చి, మసీదు మీద ఇలానే జరిగితే ఉరుకుంటారా?,హిందువుల ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరూ మాట్లాడకూడదా, పవన్ ఫైర్

Arun Charagonda

తిరుపతి లడ్డూ వ్యవహరంపై తనదైన శైలీలో స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మసీ​దు మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేస్తారు, గ్లోబల్ న్యూస్ అయిపొద్ది, కానీ హిందువుల ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరూ మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు.

Advertisement

Jani Master Rape Row: పుష్ప 2 షూటింగ్‌ లో జానీ మాస్టర్‌ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో)

Rudra

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌ పై తెలుగు న‌టి మాధవీలత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

Pawan Kalyan Prayaschitta Deeksha: 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (వీడియోతో)

Rudra

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై ప్రాయశ్చిత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను కాసేపటి క్రితం ప్రారంభించారు.

Simhachalam Temple: తిరుమల తర్వాత విశాఖ సింహాచలం ఆలయం, కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్లు ఆరోపణలు, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..

Arun Charagonda

దేవాలయాల్లో కల్తీ నెయ్యి వినియోగం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఘటన మరవక ముందే మరో ఆలయంలో కల్తీ నెయ్యి అంశం తెరపైకి వచ్చింది. విశాఖ సింహాచల దేవస్థానంలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.టెస్ట్‌లు జరిపి ప్రాథమికంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ నిర్ధారించారు. నాసిరకం ఆహార ఉత్పత్తులు వాడకుడదంటూ ఎమ్మెల్యే గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Road Accident in Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి (వీడియో)

Rudra

అనంతపురం జిల్లాలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

TTD EO Report on Laddu Dispute: తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంలో సీఎం చంద్రబాబుకు నివేదిక‌, టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు ఇచ్చిన రిపోర్ట్ పై మంత్రులు, అధికారుల‌తో చంద్ర‌బాబు స‌మావేశం

VNS

టీటీడీలో శ్రీవారి లడ్డూ (Tirumala laddu) తయారీలో కల్తీ పదార్థాల వాడారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై నివేదిక సమర్పించాలని టీటీడీ ఈఓ జే శ్యామలరావును ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఆదేశించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈఓ శ్యామలరావు (TTD EO J Syamala Rao) శనివారం నివేదిక అందజేశారు

Pawan Kalyan 11 Days Deeksha: 11 రోజుల పాటూ దీక్ష చేయ‌నున్న ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, తిరుమ‌ల ప్ర‌సాదం అప‌చారంపై ప్రాయ‌శ్చిత్త దీక్ష

VNS

సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేసిన అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానని తెలిపారు.

Simhachalam Prasadam For Testing: సింహాచ‌లం ప్ర‌సాదాల‌పై తిరుమ‌ల ల‌డ్డూ ఎఫెక్ట్, అన్ని ప్ర‌సాదాల‌ను టెస్టింగ్ కోసం పంపించాల‌ని నిర్ణ‌యం

VNS

ఆలయంలో లడ్డూల తయారిపై ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రాణంతో సమానంగా భావించే తిరుమల క్షేత్రంలో లడ్డూ కల్తీ ఘోరమైన విషయం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపించారు.

Tirupati Laddu Issue: తిరుమలలో మూడు రోజుల పాటు మహాశాంతి యాగం, ఆలయ సంప్రోక్షణపై టీటీడీ ఈవో కీలక నిర్ణయం

Arun Charagonda

శ్రీవారి లడ్డూ కల్తీ దుమారం కొనసాగుతోన్న వేళ.. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తితిదే పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామల రావు భేటీ అయ్యారు.

Advertisement

Seeman On Tirupati Laddu: తిరుపతి లడ్డూ సమస్య తప్ప మరేమి లేదా?,కల్తీ లడ్డూతో ఎవరన్న చనిపోయారా అని ప్రశ్నించిన ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్

Arun Charagonda

దేశ వ్యాప్తంగా సంచనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారంపై స్పందించారు ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్. లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు అని హితవు పలికారు.

Andhra Pradesh: క్షణాల్లో సెల్ ఫోన్ మాయం చేసిన కేటుగాళ్లు, కింద పడిపోయిన వస్తువు తీసుకునేలోపే కొట్టేసి పరార్..వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో దొంగలు చేతి వాటం ప్రదర్శించారు. జేబులో ఉన్న సెల్ ఫోన్ ను క్షణాల్లో మాయం చేశారు కేటుగాళ్లు. ఏలూరు DMHO కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేసే శ్రీనివాస్ అనే ఉద్యోగిని బురుడి కొట్టించి జేబులో ఉన్న సెల్ ఫోన్ ను క్షణాల్లో దొంగలించారు కేటుగాళ్లు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్‌గా మారింది

Satyavedu MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. ఆరోపణలు చేసిన బాధితురాలు రాజీకి.. కేసును మూసేసిన న్యాయస్థానం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నది.

Tirupati Laddu Dispute: టీటీడీకి ఐదు మంది నెయ్యి సరఫరాదారులు, కంపెనీల పేర్లను వెల్లడించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు

Hazarath Reddy

స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు.

Advertisement
Advertisement