ఆంధ్ర ప్రదేశ్

Home Minister Amit Shah Calls Telugu states CM's: తెలుగు రాష్ట్రాల్లో వ‌ర‌ద బీభ‌త్సంపై రంగ‌లోకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా! ఏపీకి 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తెలంగాణ‌కు ఏ సాయం కావాల‌న్నా చేస్తాన‌ని హామీ

VNS

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్ లో (Amit Shah Calls Chandrababu) మాట్లాడారు. చంద్రబాబు విన్నపంతో హోం సెక్రటరీ స్పందించింది. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపింది

CM Chandrababu Monitor Flood Situation: విజ‌య‌వాడలో భారీ వ‌ర‌దల నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం, ఇవాళ రాత్రికి విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్ లోనే మానిట‌రింగ్, హోంమంత్రితో పాటూ ఇతర అధికార‌లు కూడా..

VNS

విజయవాడలో సాధారణ స్థితి వచ్చే వరకు అక్కడే ఉండాలని సీఎం చంద్రబాబు (CM Chandra Babu) నిర్ణ‌యించారు. ఇవాళ రాత్రికి విజయవాడ కలెక్టరేట్ లోనే (Vijayawada Collectorate) సీఎం చంద్రబాబు బస చేయ‌నున్నారు. అంతేకాదు బుడమేరు (Vijayawada Flood) వరద బాధితుల కష్టాలు తీర్చేవరకు విశ్రమించేది లేదన్నారు చంద్రబాబు.

Andhra Pradesh Rains: లంక గ్రామాలకు అలర్ట్, కొన్ని దశాబ్దాల తర్వాత తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి భారీ స్థాయిలో వరద, రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Hazarath Reddy

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువ నుంచి 9.18లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ రోజు ఉదయం.. ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో రాత్రి 7గంటల సమయానికి 9లక్షల క్యూసెక్కులు దాటింది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి

Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, విజయవాడలో బుడమేరు వాగు ఉగ్రరూపం, ప్రవాహ తీవ్రత దెబ్బకు వెనక్కి ప్రవహిస్తున్న నది, తీవ్ర భయాందోళనలో ప్రజలు

Hazarath Reddy

విజయవాడ నగరంలో బుడమేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో‌ వెనక్కి ప్రవహిస్తోంది. దీంతో విద్యా ధరపురం ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డు మొత్తం నీట మునిగింది. ఇళ్ళలోకి బుడమేరు వాగు నీరు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, బైక్‌పై వెళ్తూ వరద నీటిలో కొట్టుకుపోయిన యువకుడు, అందరూ చూస్తుండగానే వరదలో బైకుతో సహా కొట్టుకుపోయిన వైనం

Hazarath Reddy

కృష్ణా జిల్లా చంద్రాలపాడు మండలంలోని ముప్పాల గ్రామంలో ఓ యువకుడు బైక్‌పై వెళ్తూ వరద నీటిలో కొట్టుకుపోయాడు. లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా ఓ యువకుడు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు.

Rain in Telugu States: తీరం దాటిన వాయుగుడం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, రెండు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు సెలవులు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం (Cyclone crossed the coast at Kalingapatnam) దాటింది. ప్రస్తుతం వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీద ఆవరించి నేటి సాయంత్రం లేదంటే రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Attack on Perni Nani: వీడియోలు ఇవిగో, పేర్ని నానికి చెప్పులు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన జనసేన కార్యకర్తలు, పవన్ కు క్షమాపణ చెప్పేంత వరకు గుడివాడ దాటి వెళ్లనివ్వబోమని హెచ్చరిక

Hazarath Reddy

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఘోర అవమానం ఎదురైంది. ఆయనపై కొందరు యువకులు కోడిగుడ్లు విసిరారు. పేర్ని నాని గుడివాడలోని తోట శివాజీ ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు అక్కడకు వచ్చారు.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, భారీ వర్షాలకు 30కి పైగా రైళ్లు రద్దు, మరికొన్ని ట్రైన్స్ దారి మళ్లింపు, లిస్టు ఇదిగో..

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 30కిపైగా రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.

Advertisement

Telangana Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్ విజయవాడ హైవేపై రాకపోకలు బంద్, రెండు అడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీరు

Hazarath Reddy

వాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను ఇవాళ కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

No Hidden Cameras: వీడియో ఇదిగో, అక్కడ కెమెరాలు లేవు.. వీడియోలు లేవు, విచారణకు ముందే గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై తేల్చేసిన మంత్రి నారా లోకేశ్

Hazarath Reddy

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో సీక్రెట్ కెమెరాల అంశంపై నారా లోకేష్ స్పందించారు. ‘‘గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్‌ కెమెరాలు లేవు. ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. విద్యాశాఖ మంత్రిని కాబట్టే నా మీద ఫోకస్‌ పెట్టారు. కావాలని రచ్చ చేస్తున్నారు’’ అని మీడియా ప్రతినిధులపై లోకేష్‌ ఆగ్రహం వెళ్లగక్కారు.

Vijayawada Rains: ప్రయాణికులకు అలర్ట్, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత, ఐతవరం వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు

Hazarath Reddy

వాయుగుండం తీరం దాటినప్పటికీ తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, నీట మునిగిన విజయవాడ, భారీ వర్షాలకు మంగళగిరిలో విరిగిపడిన చెట్లు , నేలకొరిగిన కరెంట్ స్తంభాలు

Hazarath Reddy

భారీ వర్షాలకు విజయవాడ మంగళగిరి రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి , కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేట ప్రస్తుత వరద పరిస్థితి.

Advertisement

Andhra Pradesh: గుడ్లవల్లేరు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, ఎస్సైను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, బాధితులతో అలాంటి ప్రవర్తన సరికాదని హెచ్చరిక

Arun Charagonda

గుడ్లవల్లేరు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల అహంకారంతో దురుసుగా మాట్లాడిన ఎస్ఐను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. విద్యార్థినుల ఆవేదనను బాధను అర్థం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించకుండా విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించడం సరికాదని ..వారి భాదను అర్దం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు.

Viral Video: ఉప్పొంగిన వరద నీటిలో ఎన్టీఆర్ జిల్లా వ్యక్తి నిర్లక్ష్య ప్రయాణం.. తర్వాత ఏమైంది? (వీడియోతో)

Rudra

వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఉప్పొంగిన వరద నీటిలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చేసిన నిర్లక్ష్య ప్రయాణంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Vijayawada Rains: జలదిగ్బంధంలో విజయవాడ.. గడిచిన 20 ఏండ్లలో ఎన్నడూ చూడనంత వర్షం.. ఆరుగురు మృతి.. నీటిలో తేలియాడుతున్న బస్సులు (వీడియో)

Rudra

విజయవాడలో భారీవర్షం విళయం సృష్టిస్తున్నది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో నగరం అతలాకుతలమైంది. ఒక పక్క కుండపోత వర్షం మరోవైపు పొంగిన రోడ్లు జలమయమైన రహదారులుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

Traffic Diversion In Kodad: హైద‌రాబాద్- విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై భారీ ట్రాఫిక్ జామ్, కోదాడ వ‌ద్ద వాహ‌నాల మ‌ళ్లింపు, నందిగామ వ‌ద్ద రోడ్డుపై ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న వాగు

VNS

సూర్యాపేట జిల్లా కోదాడలో (Suryapet -kodad Highway) భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి చేరిన వరద నీరు చేరింది. దాంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపుగా వెళ్లే వాహనాలను ఖమ్మం వైపుగా అధికారులు మళ్లించారు.

Advertisement

CPI Narayana: పోలీసులను కట్‌ డ్రాయర్లతో ఊరేగించాలి, తప్పు చేసిన వారిని బతికి ఉండగానే జీవచ్ఛవంలా మార్చాలన్న సీపీఐ నారాయణ

Arun Charagonda

తప్పు చేసిన పోలీసులను కట్‌డ్రాయర్లతో ఊరేగించాలని సంచలన కామెంట్స్ చేశారు సీపీఐ నారాయణ. బతికి ఉండగానే జీవచ్ఛవంలా మార్చాలి.. అదే వాళ్లకి సరైన శిక్ష అన్నారు. జైళ్లు గెస్ట్ హౌసుల్లా మారాయి.. తప్పు చేసిన వాళ్లు రెండ్రోజులు జైల్లో ఉండొస్తారు అన్నారు. కాదంబరి జెట్వానీ వ్యవహారంలో ఐపీఎస్‌ల పేర్లు బయటకు రావడం దారుణం అన్నారు సీపీఐ నారాయణ.

Vijayawada Rains: విజయవాడ జలమయం, రోడ్లపై మోకాలి లోతు నీరు, వాహనదారుల అవస్తలు, లోతట్టు ప్రాంతాలన్ని జలమయం

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఏపీలోని విజయవాడ నీట మునిగింది. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి.

Roja On Party Change: పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి రోజా, అవన్నీ పుకార్లేనని వెల్లడి, పార్టీ మారుతున్న నేతలతో ఎలాంటి నష్టం లేదని వెల్లడి

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి రోజా. ఈ సందర్భంగా ఏపీలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కాలేజీ బాత్రూంలో కెమెరాలు పెట్టి పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు.

Pithapuram Muncipal Council: పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస, కొట్టుకున్న కమిషనర్ - డీఈ, అవాక్కయిన కౌన్సిలర్లు..వీడియో

Arun Charagonda

పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాస చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కనకారావు,డిఈ భవాని శంకర్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

Advertisement
Advertisement