ఆంధ్ర ప్రదేశ్
Chaddi Gang Caught on Camera: తిరుపతిలో కెమెరాకు చిక్కిన చెడ్డి గ్యాంగ్, ఇంట్లో చొరబడి నగలు, నగదుతో పరార్, రంగంలోకి దిగిన పోలీసులు
Hazarath Reddyతిరుపతి జిల్లా తిరుచానూరులో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేశారు. కొత్తపాళెం లే అవుట్‌లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ఈ చెడ్డీ గ్యాంగ్. బీరువాలో నగలు, నగదుతో పరారయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Thief at Basara Temple: బాసర అమ్మవారి ఆలయంలో చోరీ.. గోడ దూకి చొరబడిన దుండగుడు.. చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ
Rudraనిర్మల్ లోని బాసరలో కొలువైన సరస్వతీ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం లోపలికి గోడ దూకి చొరబడిన దుండగుడు ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ చేశాడు.
SSLV-D3: ఇస్రో ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. విపత్తు నిర్వహణలో సాయపడటమే లక్ష్యం (వీడియోతో)
Rudraభారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతమైంది.
Varalakshmi Vratham 2024: నేడే వరలక్ష్మీవ్రతం.. లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి
Rudraతెలుగింటి ఆడబిడ్డలు ఎంతో మురిపెంగా చేసుకునే వరలక్ష్మీవ్రతం నేడే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి.
Pawan Kalyan Selfie With Daughter: తండ్రితో కలిసి ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్ కుమార్తె, వైరల్ గా మారిన తండ్రీ కూతుళ్ల సెల్ఫీ
VNSఇండిపెండెన్స్ డే సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాకినాడలోని పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు.
NTR Anna Canteens: ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమే, అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ లో భోజనాలు వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు.
National Flag Underwater: సముద్ర గర్భాన జాతీయ జెండా రెపరెపలు, విశాఖలో స్కూబా డైవర్ సాహసం, వీడియో వైరల్
Arun Charagondaదేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వైజాగ్ సముద్ర గర్భంలో జాతీయ జెండాను రెపరెపలాడించారు స్కూబా డైవర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Jagan's Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసు, విచారణ నుండి తప్పుకున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజయ్ కుమార్
Hazarath Reddyఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, విజయసాయి రెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసు విచారణ నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు.
CM Chandrababu: 2019-2024 మధ్య ఒక విధ్వంస పాలన జరిగింది, గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామని తెలిపిన చంద్రబాబు
Hazarath Reddyస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
Andhra Pradesh: బెట్టింగ్‌లో రూ.2.40 కోట్ల అప్పు చేసిన కొడుకు, అప్పులు కట్టలేక తల్లిదండ్రుల ఆత్మహత్య, నంద్యాలలో విషాదం
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో విషాదం నెలకొంది. అబ్దుల్లాపురానికి చెందిన మహేశ్వర్, ప్రశాంతి దంపతుల కొడుకు నిఖిల్. డిగ్రీ కోసం బెంగళూరుకు పంపితే బెట్టింగులకు బానిసై ₹2.40 కోట్ల అప్పు చేశాడు. తల్లిదండ్రులు వాళ్ల 10 ఎకరాల భూమి, ఇల్లు అమ్మేసినా అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు చేసుకున్నారు.
Aarogyasri Services in AP: ఏపిలో రేపటి నుంచి ఆస్పత్రులో ఆరోగ్య శ్రీ సేవలు బంద్, ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో రూ.2500 కోట్లు బకాయిలు
Hazarath Reddyపెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. 2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోగా..ప్రభుత్వం నుంచి రూ.2500 కోట్లు రావాల్సి ఉంది.
Man Catches Snake Video: వీడియో ఇదిగో, బ్యాంక్‌లో దూరి కస్టమర్లను, బ్యాంక్ సిబ్బందిని హడలెత్తించిన పాము
Hazarath Reddyవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి పాము దూరింది. వడ్లపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఎలా వెళ్లిందో కానీ.. ఓ పాము ప్రవేశించింది. రికార్డు రూములోకి దూరి తిష్ట వేసింది. ఉదయమే బ్యాంకు తెరిచిన సిబ్బంది.. రికార్డు రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ పామును చూసి బిత్తరపోయారు
YS Sharmila: వైఎస్ జగన్ ఎన్నటికీ మళ్లీ సీఎం అవ్వరు! సంచలన కామెంట్స్ చేసిన వైఎస్ షర్మిల
VNSవైసీపీ ఎన్నటికీ అధికారంలోకి రాదు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ పెట్టలేదు? భారీ మెజారిటీతో గెలిచి ఎందుకు ధైర్యం చేయలేదు? బొత్స అనే వాడు నిండు సభలో విజయమ్మను అవమానించాడు.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్, ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఏపీ డీజీపీ షాక్, హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో లేని ఐపీఎస్‍లకు మెమో, 16 మంది అధికారులకు షాకిచ్చిన డీజీపీ
Arun Charagondaఏపీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు షాకిచ్చారు డీజీపీ. వెయిటింగ్‍లో ఉంటూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండని ఐపీఎస్‍లకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్‍లకు డీజీపీ ఆదేశాలిచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh: కుటుంబ కలహాల నేపథ్యంలో కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య, బతకడం ఇష్టం లేదంటూ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో
Hazarath Reddyకుటుంబ కలహాల నేపథ్యంలో కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య.. మాచర్ల పట్టణానికి చెందిన చక్క రాజేష్ 30 సంవత్సరాలు, రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో తన కుటుంబంలో కలహాలు ఉన్నట్లు, ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోను పోస్ట్ చేశారు.
Andhra Pradesh: తెలంగాణ స్థానికత ఉన్న 122 మంది ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం, ఇకపై సొంత రాష్ట్రంలోనే పని చేయనున్న ఉద్యోగులు
Hazarath Reddyతెలంగాణ స్థానికత ఉన్న 122 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఇకపై తెలంగాణలో పని చేయనున్నారు.
Duvvada Srinivas: క్లాసికల్ డ్యాన్స్ వీడియో రిలీజ్ చేసిన మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఘటన నేపథ్యంలో మాధురి ట్వీట్ వైరల్
Arun Charagondaతెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి ఎపిసోడ్ రోజుకో టర్న్ తీసుకుంటుంది. మాధురి ఆత్మహత్య యత్నం చేసుకోగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇంత పెద్ద గొడవ జరుగుతున్న నేపథ్యంలో తన క్లాసికల్ డ్యాన్స్ చూడాలనుకునేవారి కోసం వీడియో రిలీజ్ చేసింది మాధురి.
Andhra Pradesh Shocker: వైరల్ వీడియో.. యువకుడిని చిత్ర హింసలు పెట్టిన స్నేహితులు, ఆస్పత్రిలో చేరిక, చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడి తల్లి ఆరోపణ
Arun Charagondaఆంధ్రప్రదేశ్ లో దాడుల సంస్కృతి పెరిగిపోతోంది. బాపట్ల జిల్లా చుండూరు మండలం, చిన్నపరిమి గ్రామంలో ఆగస్టు 6వ తేదీన ఓ వ్యక్తిని తీసుకెళ్లి, అతని స్నేహితులు దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తన కుమారుడిని కొట్టిన వ్యక్తులు మళ్లీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, తన కొడుకును చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది