tdp (X)

చిలకలూరిపేట బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన ప్రజా గళం సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని మోడీ ప్రసంగం ప్రారంభించారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ, ఆ తర్వాత నిన్ననే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. నాకు ఇక్కడ కోటప్పకొండ దగ్గర త్రిమూర్తుల ఆశీర్వాదం లభిస్తోంది.. ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి, మాకు ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడింది.. చంద్రబాబు, పవన్‌ ఏపీ కోసం కష్టపడుతున్నారు.. ఏపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తే అభివృద్ధిలో దూసుకుపోతుంది.. జూన్‌ 4న ఫలితాల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి.. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయి.. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది.. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని తెలిపారు.

ఏపీలో గెలుపు ఎన్డీయేదే.. కూటమికి మోడీ అండ ఉంది- చంద్రబాబు

అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తూ.. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలి.. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే.. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా.. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ.. మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం.. ఎన్నో పథకాలతో ప్రధాని మోడీ సంక్షేమం అందించారు.. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటివి చేస్తున్నారు.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో మోడీ పని చేస్తున్నారు..ప్రపంచంలో భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చారని చంద్రబాబు ప్రసంగించారు.

ప్రధానిగా మోడీ హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారు. -పవన్‌ కల్యాణ్

నరేంద్ర మోడీ కోసం ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు.. ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించింది.. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా పొత్తు మొదలైంది.. 2024లో మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా పొత్తు పురుడు పోసుకుంది.. అభివృద్ధి లేక ఏపీ అప్పులతో నలుగుతోంది.. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారు. -పవన్‌ కల్యాణ్