2024 భారతదేశం ఎన్నికలు: క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్ధిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన ష‌ర్మిల‌, సోద‌రి సునితా రెడ్డితో క‌లిసి నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేత‌
Congress leader YS Sharmila filed her nomination. (Photo Credit: ANI)

Kadapa, April 20: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కడప లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లిన షర్మిల.. రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలను (YS Sharmila Files Nomination) సమర్పించారు. కాంగ్రెస్ నేత తుల‌సి రెడ్డితో పాటూ ష‌ర్మిల సోద‌రి వైయ‌స్ వివేకా కుమార్తె సునితారెడ్డి కూడా నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

మొత్తం ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ఏపీలో మే 13న నాలుగో దశలో పోలింగ్‌ జరగనుంది. నాలుగో దశ ఎన్నికల కోసం ఈ నెల 18న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 25 వరకు ఈ నామినేషన్‌ల ప్రక్రియ కొనసాగింది. ఈ క్రమంలో షర్మిల కడప నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.