Representative image (Photo Credit: Pixabay)

Vijayawada, April 18: విజ‌య‌వాడ‌లోని బంద‌రు రోడ్డులో అగ్ని ప్ర‌మాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఓ గోడౌన్ లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకుంది. మొద‌టి అంత‌స్తు వ‌రకు మంట‌లు వ్యాపించాయి. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు శ్ర‌మిస్తున్నారు. అయితే గోడౌన్ లోప‌ల ఎవ‌రైనా చిక్కుకుపోయారా? అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

 

ఈ ప్ర‌మాదంలో భారీగా ఆస్తిన‌ష్టం జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా వేస్తున్నారు.