Judge Abdul Nazeer (Credits: Twitter)

Amaravati, Feb 12: కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు. జస్టిస్‌ నజీర్‌ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో ఆయన ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించారు. బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఇటీవల కోరిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్థానంలో రమేష్ బియాస్ ను కొత్త గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.

ఏయే రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిందంటే..

  • అరుణాచల్ ప్రదేశ్  గవర్నర్ గా  త్రివిక్రమ్ పట్నాయక్‌
  • సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
  • లడఖ్ గవర్నర్ గా బి.డి. మిశ్రా
  • జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్
  • అస్సాం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియా
  • హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రసాద్ శుక్లా
  • మణిపూర్ గవర్నర్ గా అనసూయ
  • నాగాలాండ్ గవర్నర్ గా గణేషన్
  • మేఘాలయ గవర్నర్ గా చౌహాన్