Vijayanagaram, OCT 29: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర ఘోర రైలు (AP train Accident) ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలంలో విద్యుల్ లేకపోవడంతో అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
PMO tweets, "PM Narendra Modi spoke to Railway Minister Ashwini Vaishnaw and took stock of the situation in the wake of the unfortunate train derailment between Alamanda and Kantakapalle section. Authorities are providing all possible assistance to those affected. The Prime… pic.twitter.com/Kd5dRR0KQO
— ANI (@ANI) October 29, 2023
మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడి (Narendra Modi) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తో మాట్లాడారు ప్రధాని. ప్రమాద స్థలిలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ఆరా తీశారు.