తెలంగాణ
MLC Kavitha Hospitalized: హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. వైద్య పరీక్షల నిర్వహణ (వీడియో)
Rudraబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కు వచ్చారు. ఈరోజు సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవనున్నట్టు వైద్యులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో కవిత పలుమార్లు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.
LPG Prices Hike: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన రేట్లు.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన
Rudraదసరా, దీపావళి పండుగల ముందు హోటల్స్, ఇతరత్రా వాణిజ్య సముదాయాల్ని నిర్వహించే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వరుసగా మూడవ నెల అక్టోబర్ లో కూడా గ్యాస్ ధర పెరిగింది.
KTR On Musi River Project: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం మూసీ ప్రాజెక్టు, హుస్సేన్ సాగర్ పై ఉన్న హైడ్రా కార్యాలయాన్ని కూల్చేయాలని కేటీఆర్ డిమాండ్
Arun Charagondaబీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎం అని రాహుల్ గాంధీ అన్నాడు.. మరి మూసీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీకి రిజర్వు బ్యాంకా? అని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్..లక్ష 50 వేల కోట్లు అంటే భారత్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం కాదా ఇది అని ప్రశ్నించారు.
Road Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టైరు పేలి బోళ్తా పడిన ప్రైవేట్ బస్సు, 20 మందికి పైగా తీవ్ర గాయాలు, బెంగళూరు నుండి వరంగల్ వెళ్తుండగా ఘటన
Arun Charagondaజనగామ జిల్లా యశ్వంతపూర్ గ్రామం వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు మరో 23 మందికి స్వల్ప గాయాలు కాగా క్షతగాత్రులను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రన్నింగ్ లో టైర్ పేలడంతోనే అదుపుతప్పి బోల్తా పడింది బస్సు. దీంతో సుమారు కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Warangal: తారాస్థాయికి వరంగల్ నాలా పంచాయతీ, మేయర్ వర్సెస్ దాస్యం వినయ్ మధ్య వాగ్వాదం, వినయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..వీడియో ఇదిగో
Arun Charagondaగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, కార్పొరేటర్ తో మాక్ లైవ్ సందర్భంగా నయీంనగర్ బ్రిడ్జి పై ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్రా వడంతో సవాల్ ను స్వీకరించి వచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ రావడంతో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Tension At Telangana Bhavan: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం, అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు..వీడియో
Arun Charagondaతెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలను చితకబాదారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ACB Raids At Nalgonda: నల్గొండలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్
Arun Charagondaనల్గొండ జిల్లా చింతపల్లిలోని పశు వైద్యాశాలలో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పాల్ జోసెఫ్ గౌతమ్ ను అనిషా అధికారులు పట్టుకున్నారు. 8 గేదెల ఆరోగ్య మరియు మూల్యాంకన ధ్రువీకరణ పత్రం అందించాలనే అనుమతిని పొందేందుకు రూ. 6,000/- లంచం డిమాండ్ చేసినందుకు అతన్ని పట్టుకున్నారు.
Viral Video: హైదరాబాద్ మీర్‌చౌక్‌లో అదుపుతప్పిన కారు, రోడ్డు పక్కన ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి విధ్వంసం...సీసీ టీవీ ఫుటేజ్ ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ - మీర్‌చౌక్ పీఎస్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వాహనాలపైకి దూసుకు పోయింది. దీంతో పలు వాహనాలు ధ్వంసం కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Telangana DSC 2024 Results: తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల, పరీక్ష నిర్వహించిన 56 రోజుల్లోనే ఫలితాలు విడుదల
Arun Charagondaతెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో డీఎస్సీ-2024 ఫలితాలను విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జులై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. డీఎస్సీ పరీక్షలకు 2,46,584 (88.11%) మంది అభ్యర్థులు హాజరుకాగా 56 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసింది ప్రభుత్వం.
Telangana High Court Serious On Hydra: ఆదివారం కూల్చివేతలా?, హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు...వర్చువల్‌గా విచారణకు హాజరైన రంగనాథ్
Arun Charagondaహైడ్రా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.ఆదివారం రోజు కూల్చివేతలు ఎందుకు చేశారో చెప్పాలని ఆదేశించింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు అని ప్రశ్నించిన న్యాయస్థానం..పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా? అని అభిప్రాయపడింది.
Telangana: భద్రాచలంలో పట్టుబడ్డ 100 కేజీల గంజయి, పాత మార్కెట్ వద్ద గంజాయితో ఉన్న కారును వదిలేసి పరారైన దుండగులు, పోలీసుల దర్యాప్తు
Arun Charagondaభద్రాచలంలోని పాత మార్కెట్ వద్ద గంజాయితో ఉన్న కారును వదిలేసి పరారయ్యారు దుండగులు. కారులో సుమారు 100 కేజీల గంజాయి ఉన్నట్లు సమాచారం. కారును, కారులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎక్సైజ్ సీఐ.
Telangana Shocker: బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని వేడి నూనె పోసిన వ్యక్తి.. ఇద్దరికి గాయాలు, గద్వాల్‌లో ఘటన
Arun Charagondaగద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలం అమానుషం చోటు చేసుకుంది. గువ్వలదిన్నె గ్రామానికి చెందిన బుజ్జన్న గౌడ్ హోటల్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి హోటల్ వద్దకు వెళ్లి బజ్జీలు ఉద్దెర అడగగా, ఉద్దెర ఇవ్వడానికి బుజ్జన్న గౌడ్ నిరాకరించాడు.
Gadwal Horror: బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని సలసల మరిగే నూనెను మీద పోసిన వ్యక్తి.. ఇద్దరికి గాయాలు.. గద్వాల్ లో ఘటన
Rudraబజ్జీలు ఉద్దేర ఇవ్వలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి సలసల మరిగే నూనెను పోసిన ఘటన గద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామంలో జరిగింది.
Hyderabad Horror: హైదరాబాద్ లో దారుణం.. 18వ అంతస్తు భవనం నుంచి దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. అసలేమైంది?
Rudraహైదరాబాద్ లో ఘోరం జరిగింది. కూతురుతో కలిసి ఓ తల్లి 18వ అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానాస్పద స్థితిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
DSC Results Today: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడే విడుదల.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Rudraలక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. టీచర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ సర్కారు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Hyderabad Metro Second Phase: ఫ్యూచర్ సిటీ వరకు హైదరాబాద్ మెట్రో, రెండో దశ డీపీఆర్ లో కీలక మార్పులు, ఎయిర్ పోర్టు నుంచి స్కిల్ సిటీ వరకు 40 కి.మీ మేర మెట్రో
VNSమెట్రో రైల్ రెండో దశ (Metro second-phase) పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రెండు దశ నిర్మాణం జరగనుంది. రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ (Hyderabad Metro) చేపట్టనున్నారు. రెండో దశలో కొత్త ఫ్యూచర్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు.
Rain in Hyderabad: హైదరాబాద్ లో జోరు వర్షం, పలు ప్రాంతాల్లో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
VNSహైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా పలుచోట్ల వర్షం (Rain In Hyderabad) కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట, ప్రగతినగర్, మూసాపేట్, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, బాలానగర్‌లో వర్షంపడుతున్నది. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లోనూ వర్షం (Heavy Rain) కురుస్తున్నది.
Harishrao Slams Congress: బుల్డోజర్,జేసీబీ వచ్చినా మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు..కొడంగల్‌లో సీఎం రేవంత్ ఇల్లు కుంటలోనే ఉందన్న మాజీ మంత్రి హరీశ్ రావు
Arun Charagondaధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు.. ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా మేమే ఒక రక్షణ కవచం లాగా నిలబడతాం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మూసీ పరివాహాక ప్రాంతాల బాధితుల ఇళ్లను పరామర్శించిన హరీశ్..అనంతరం మీడియాతో మాట్లాడారు.
Ponnam Prabhakar On Hydra: హైడ్రాకు మూసీకి సంబంధం లేదు, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారంపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్,బాధితులు ఒప్పుకుంటే డబుల్ బెడ్ రూం ఇస్తాం
Arun Charagondaహైడ్రాకు మూసీకి సంబంధం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీడియాతో మాట్లాడిన పొన్నం.. కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. హైడ్రా చెరువుల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేస్తుందన్నారు. హైడ్రాకు మూసీకి ఎలాంటి సంబంధం లేదు...గత పదేళ్లలో అనేక సార్లు వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయిందన్నారు.
BJP MLA Rajasingh: తన ఇంటివద్ద రెక్కీ నిర్వహించడంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, తన ఫోటోలు ముంబైకి పంపినట్లు వెల్లడి, ఇద్దరిని పట్టుకున్న స్థానికులు
Arun Charagondaనా ఫోటోలు తీసి ముంబైకి పంపిస్తున్నారు అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడంపై స్పందించిన రాజాసింగ్..నిన్న రాత్రి నలుగురు అనుమానితులు వచ్చారు అన్నారు. అందులో ఇద్దరు పారిపోగా.. మరో ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారని..అనుమానితుల సెల్ ఫోన్ లో మా ఇంటి ఫోటోస్, నా ఫోటోస్ ముంబైలో ఉన్న కొందరికి పంపినట్లు గుర్తించారన్నారు