తెలంగాణ
Telangana Shocker: మహబూబాబాద్‌లో దారుణం, మంత్రాలు చేస్తున్నాడనే నేపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన మరో వ్యక్తి..వీడియో ఇదిగో
Arun Charagondaమహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో మల్లం యాకయ్య(66) అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి రాజు అనే యువకుడు దారుణంగా కొట్టి చంపాడు. స్థానికులు వెంటనే రాజును తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Dasara Navaratri Celebrations in Vijayawada: బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. అక్టోబర్ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు షురూ.. అమ్మవారు ఏ రోజున ఎలా దర్శనం ఇస్తారంటే?
Rudraదసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు బెజవాడలోని ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
MLA Balu Naik: కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్‌కు నిరసన సెగ, బాలు నాయక్‌ని అడ్డుకున్న కుర్మెడ్ గ్రామస్తులు..తమ గ్రామంలోకి రావొద్దని నిరసన..వీడియో ఇదిగో
Arun Charagondaనల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్‌ను తమ గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం కుర్మెడ్ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బాలు నాయక్‌ని అడ్డుకున్నారు గ్రామస్తులు. తమ గ్రామంలో రావద్దు అంటూ నిరసన తెలియజేశారు గ్రామస్తులు.
ED Raids in Minister Ponguleti Srinivasreddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు.. భారీగా పోలీసు బందోబస్తు
Rudraతెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నాయి.
Food Poison at Jangaon: జనగామలోని ఏబీవీ కాలేజ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. 15 మంది ఇంటర్ విద్యార్థులకు అస్వస్థత (వీడియో)
Rudraజనగామలోని ఏబీవీ కాలేజ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తున్నది. ఈ ఘటనలో 15 మంది ఇంటర్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Clash at Devara Movie: 'దేవర' సినిమా ప్రదర్శనలో ఘర్షణ.. కడప రాజా థియేటర్ లో యువకుల వీరంగం.. సిబ్బందిని చితకబాదుతూ గలాటా (వీడియోతో)
Rudraకడపలోని రాజా ధియేటర్ లో 'దేవర' మూవీ ప్రదర్శన సమయంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టికెట్స్ లేకుండానే కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్లోకి దూసుకొచ్చిన క్రమంలో వాగ్వాదం జరిగింది.
Ayudha Pooja Song: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే! ఎన్నోరోజులుగా వెయిట్ చేస్తున్న ఆయుధ పూజ సాంగ్ వచ్చేసింది (వీడియో ఇదుగో)
VNSటాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర (Devara). నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి
Musi River Survey: వీడియో ఇదిగో, నేను పెట్రోల్ పోసుకొని సచ్చిపోతా, నా చావుకి నువ్వే కారణం రేవంత్ రెడ్డి అంటూ బాధితుడు ఆందోళన, మూసీ నది పరివాహక ప్రాంతంలో అధికారులు సర్వే
Hazarath Reddyనా చావుకి రేవంత్ రెడ్డినే కారణం ఓ బాధితుడు వీడియో విడుదల చేశాడు. నువ్వు మంచి చేస్తావని ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ నుండి వరంగల్ పోయి మరీ ఓటు వేసి గెలిపిస్తే.. మాకు అన్యాయం చేస్తున్నావు. నేను పెట్రోల్ పోసుకొని సచ్చిపోతా.. నా చావుకి నువ్వే కారణం రేవంత్ రెడ్డి అంటూ మూసి పరివాహక ప్రాతంలో బాధితుడి ఆందోళన చేపట్టాడు.
Telangana: వీడియో ఇదిగో, రైల్వే పట్టాలపై రాళ్లు పెట్టి హైదరాబాద్ యువకుడు వీరంగం, రైల్వే గేట్ మెన్ రావడంతో అక్కడి నుంచి పరార్
Hazarath Reddyహైదరాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేటు వద్ద ఓ యువకుడు వీరంగం... రైల్వే పట్టాలపై రాళ్లు పెట్టాడు. అనంతరం రైల్వే ట్రాక్పై కూర్చున్నాడు. అదే సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మల్టీ ఇంజన్ లోకో పైలట్ యువకుడిని గమనించి వెంటనే మాధవనగర్ గేట్మెన్‌కు సమాచారం ఇచ్చాడు.
Couple Romance on Bike: వీడియో ఇదిగో, అబ్బాయి ముందర పార్టుపై యువతి కూర్చుని.. పట్టపగలు బైకు మీద వెళుతూ ముద్దులతో రెచ్చిపోయిన లవర్స్
Hazarath Reddy21 సెకన్ల క్లిప్‌లో ఒక అమ్మాయి ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి ఒడిలో కూర్చొని, పట్టపగలు రద్దీగా ఉండే రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు అతన్ని కౌగిలించుకొని ముద్దుపెట్టుకోవడం చూపిస్తుంది.
KTR: ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇదేనా..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రశ్నల వర్షం, అర్హతలు లేని బావమరిది కంపెనీకి వేల కోట్లు కట్టబెట్టడమేనా ఇన్నోవేటివ్!
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికగా కడిగిపారేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి ? అని రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత మాట తప్పడం. దేవుళ్ళ మీద ఒట్టేసి వారికి కూడా శఠగోపం పెట్టడం.. నూరు రోజులు, ఆరు గారంటీలు అని ఊదరగొట్టి తర్వాత వాటిని మర్చిపోవడం, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిరోజూ ఒక కొత్త డ్రామా సృష్టించి, హెడ్ లైన్ మానేజ్మెంటు చెయ్యడం ఇన్నోవేటివ్ థింకింగా అని ప్రశ్నించారు.
Nizamabad Shocker: కూతురు మరణంతో మనస్తాపం..వియ్యంకుడి హత్య, నిజామాబాద్ జిల్లా కంజర్ గ్రామంలో విషాద సంఘటన
Arun Charagondaనిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామంలో విషాదం నెలకొంది. కూతురు మరణానికి కారణం వియ్యంకుడు నరహరిని హత్య చేశారు సత్యనారాయణ. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది సత్యనారాయణ కుమార్తె. దీంతో కోపం పెంచుకున్న సత్యనారాయణ...వియ్యంకుడిని హతమార్చాడు.
Tirupati Laddu Row: వీడియో ఇదిగో, వందేభారత్ రైలులో భజనలు చేస్తూ తిరుపతికి మాధవీలత, నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్న బీజేపీ మహిళా నేత
Hazarath Reddyవందేభారత్ రైలులో బీజేపీ మహిళా నేత హైదరాబాద్ నుంచి తిరుమలకు పయనమయ్యారు. వేంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని బీజేపీ నేత దర్శించుకోనున్నారు.
Drun And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబు హల్‌చల్, ఏకంగా పోలీసులపైకే ఆటోను తీసుకెళ్లిన డ్రైవర్, ఆటోను సీజ్ చేసిన పోలీసులు..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందు బాబు హల్చల్ చేశాడు. చంపాపేటలోని ప్రధాన రహదారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు మీర్ చౌర్ ట్రాఫిక్ పోలీసులు. ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా.. ఏకంగా పోలీసులపైకే ఆటోను తీసుకెళ్లాడు డ్రైవర్. ఫుల్‌గా తాగి ఉన్నట్లు నిర్దారణ కాగా ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.
MLA Raja Singh Slams Jagan: నమ్మకం లేనప్పుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారు, జగన్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
Arun Charagondaతిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పందించారు. ప్రసాదం అపవిత్రం కావడంపై హిందువులంతా బాధపడుతున్నారన్నారు.
Hydra Demolition: సంగారెడ్డిలో చెరువులో కట్టిన మూడంతస్తుల భవనం, బాంబులతో పేల్చేసిన అధికారులు..వీడియో ఇదిగో
Arun Charagondaసంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి పెద్ద చెరువులో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. చెరువులో కట్టిన ఈ భవనాన్ని బాంబులతో కూల్చేశారు అధికారులు. శిథిలాలు తగిలి ఇద్దరికి గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Bhatti Vikramarka America Tour: అమెరికా పర్యటనలో బిజీగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,హువర్ డ్యామ్‌ను సందర్శించిన భట్టి, మైనింగ్ ఎగ్జిబిషన్‌లో ఆధునిక యంత్రాల పరిశీలన
Arun Charagondaఅమెరికా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీ బిజీగా ఉన్నారు. నెవాడా, ఆరిజోనా పర్యటనలో భాగంగా హూవర్ డ్యామ్ ను సందర్శించారు భట్టి. అలాగే లాస్ వెగాస్ లో మైనింగ్ ఎగ్జిబిషన్ లోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం చర్చలు జరిపారు.
Protests Against Musi Riverfront: మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే, అధికారులను అడ్డుకున్న స్థానికులు...వీడియో ఇదిగో
Arun Charagondaమూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే చేపట్టడానికి వచ్చిన అధికారులకు చుక్కెదురైంది. సర్వే కోసం వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేయబోమని కొత్తపేట, మారుతీనగర్, సత్యా నగర్ వాసులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక అధికారులు వెనుదిరిగారు.
Land Mafia Sells Graveyard: స్మశన వాటికను వదలని రియల్టర్లు, ఓ వ్యక్తి అంత్యక్రియలు చేయకుండా అడ్డుకున్న వైనం, ఎక్కడ అంత్యక్రియలు చేయాలని బాధితుల ఫైర్
Arun Charagondaమంచిర్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలు ఆగడం లేదు. స్మశానవాటికను కూడా వదల్లేదు రియల్టర్లు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓ వ్యక్తి అంత్యక్రియలు కూడా చేయకుండా అడ్డుకున్నారు.
Revanth Reddy On Indiramma Housing Scheme: దసరాకు ఇందిరమ్మ కమిటీలు, రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, విధివిధానాలు రూపొందించాలని సూచన
Arun Charagondaదసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే ఈ విషయంలో తెలంగాణ వెనుకబడి ఉందని, ఈ దఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గరిష్ట సంఖ్యలో రాష్ట్రానికి ఇళ్లు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.