తెలంగాణ
Attack On BRS Leaders At Suryapet: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై దాడి, రాళ్లు - కోడిగుడ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, ఖండించిన హరీశ్ రావు
Arun Charagondaసూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు హరీశ్ రావు. కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయటం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
Telangana Farm Loan Waiver: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, రైతులు రూ. 2 లక్షల పైన ఉన్న రుణం డబ్బులు కడితే వాళ్లవి మాఫీ చేస్తామని ప్రకటన
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మూడు విడతల్లో రుణమాఫీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా ప్లాన్ రచించింది. అయినప్పటికీ అర్హత ఉండి కూడా కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు.
Telangana Group 2 Schedule: తెలంగాణ గ్రూప్-2 ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల, డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
Arun Charagondaతెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షను నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేయగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
Hydrabad Police On Free Journey: రాత్రివేళ మహిళలకు ఫ్రీ జర్నీ అనేది ఫేక్ న్యూస్, క్లారిటీ ఇచ్చిన పోలీసులు, తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaరాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతామని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు పోలీసులు. 1091, 78370 18555 నంబర్‌కు ఫోన్ చేస్తే స్థానిక పోలీసుల వాహనం వచ్చి తీసుకెళ్తారని కొంతమంది ప్రచారం చేస్తున్నారని దీనిని నమ్మవద్దని కోరారు. ఈ మెసేజ్‌తో తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Jagtial Shocker: జగిత్యాలలో దారుణం, హోంవర్క్ పూర్తి చేయలేదని రక్తమొచ్చేలా పాపని కొట్టిన టీచర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలోని జగిత్యాల్లోని ఎంపీపీఎస్ టీఆర్ నగర్ పాఠశాలలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. హోంవర్క్ పూర్తి చేయనందుకు రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని ఉపాధ్యాయుడు దారుణంగా శిక్షించడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆ పాపని చెవిపై బలంగా కొట్టడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం మొదలైంది.
MLC Kavitha Injured: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న కవిత
Arun Charagondaబీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత గైనిక్ సమస్య , వైరల్ జ్వరంతో బాధపడుతుండగా వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
KTR Questions Revanth Reddy: ఇదేనా ఇందిరమ్మ పాలన?, మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా?, సీఎం రేవంత్ రెడ్డి సొంతగ్రామంలో మహిళా జర్నలిస్టుల దాడిని ఖండించిన కేటీఆర్
Arun Charagondaవిధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదేనా ఇందిరమ్మ పాలన?, మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు
Defamation Case: పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో బీజేపీ పార్టీపై ప్రజల్లో అపనమ్మకం, గందరగోళం ఏర్పడ్డాయంటూ పిటిషన్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంకు నోటీసులు పంపింది.
Harishrao Slams CM Revanth Reddy: 'స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు'..రేవంత్‌పై హరీశ్ ఫైర్, మాట తప్పిన సీఎం ఆలయాలను శుద్దిచేయాలని కామెంట్, రుణమాఫీ చేసే వరకు వదలిపెట్టమని వార్నింగ్
Arun Charagondaప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేసిన ఏకైక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తుండగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ఆలేరులో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు హరీశ్ రావు.
Telangana Shocker: నాలాలో పడి చిన్నారి మృతి, ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు, నిన్న సాయంత్రం ఆడుకుంటూ నాలాలో పడిక బాలిక, విషాద ఛాయలు
Arun Charagondaనిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాలాలో గల్లంతైన బాలిక మృతి చెందింది. బాలిక అనన్య మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఇంటి ముందల ఆడుకుంటుండగా నాలాలో పడింది బాలిక.
Teachers Protest At Praja Bhavan: ప్రజాభవన్ ముందు అర్థరాత్రి టీచర్ల ఆందోళన, జీవో 317 పేరుతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోస్టింగ్‌లు ఇస్తున్నారని మండిపాటు
Arun Charagondaప్రజాభవన్ ముందు అర్ధరాత్రి ఆందోళన టీచర్లు ఆందోళన బాటపట్టారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, 317 జీఓ బాధితులు బుధవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు పోస్టింగ్లు ఇస్తున్నారని, స్థానికతను కోల్పోతున్నామని నిరసిస్తూ బేగంపేట ప్రజాభవన్ ముందు ధర్నాకు దిగారు.సబ్ కమిటీ నిర్ణయం తీసుకోకముందే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేయడం పై మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
BRS Protests For Runamafi: రుణమాఫీపై బీఆర్ఎస్ పోరు, యాదాద్రి నుండి హరీశ్ రావు ఆలయాల యాత్ర, 119 నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు
Arun Charagondaవందశాతం రుణమాఫీ అమలు చేయాలని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట పట్టనుంది బీఆర్ఎస్. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేయనుంది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నేతలకు ఇవాళ్టి కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఏ నియోజకవర్గాల్లో ఎవరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారో కార్యకర్తలకు వివరించారు.
Andhra Pradesh: వీడియో...కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు
Arun Charagondaకెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందగా 18 మందికి గాయాలు అయ్యాయి. అనకాపల్లి - అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో పేలింది రియాక్టర్. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
Telangana: కల్తి కల్లు ఎఫెక్ట్, 8 మందికి అస్వస్థత, వికారాబాద్‌లో ఘటన, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
Arun Charagondaకల్తీ కల్లు తాగి ఎనిమిది మందికి అస్వస్థత చోటు చేసుకుంది. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామంలో కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది అస్వస్థతకు గురికాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలుషితమైన నీరు కలపడం వల్లే తాగిన వారు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు.
Telangana High Court On Janwada Farmhouse: అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రాకు ఊరట, నిబంధనల ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని ఆదేశం
Arun Charagondaఅక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు ఊరట లభించింది. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది హైకోర్టు. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతపై జీఓ 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశం ఇచ్చింది. జన్వాడ ఫాంహౌస్‌కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
KTR: నాకు ఎలాంటి ఫామ్‌హౌస్ లేదు, హైడ్రా పేరుతో బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులు, కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలను కూల్చరా?
Arun Charagondaతను ఎలాంటి ఫామ్ హౌస్ లేదని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..ఎఫ్‌టీఎల్‌లో కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని వాటిపై చర్యలు ఎవని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, వివేక్ వెంకటస్వామి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్నారు
Hyderabad Rain Videos: హైదరాబాద్ వర్ష భీభత్సం వీడియోలు ఇవిగో, వరదలో వాహనాలతో పాటు కొట్టుకుపోయిన మనిషి మృతి
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది.పార్సీగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది.
KTR On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ గులాం, 'చీప్ మినిస్టర్' అని మండిపడ్డ కేటీఆర్, రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టమని హెచ్చరిక
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ఢిల్లీ గులాం అని, చీప్ మినిస్టర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ నేతలను వదిలిపెట్టమన్నారు.
Konda Surekha Birthday: ఏసీపీ నందిరాం నాయక్‌కు షోకాజ్ నోటీస్, ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలన్న సీపీ, మంత్రి కొండా సురేఖ బర్త్ డే వేడుకల్లో పాల్గొనడంపై వివాదం
Arun Charagondaమంత్రి కొండా సురేఖ బర్త్ డే వేడుకల్లో పోలీస్ సిబ్బంది వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీని పై స్పందించిన వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా.. ఐదు రోజుల్లో జవాబు చెప్పాలని ఏసీపీ నంది రామ్ నాయక్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర అనుమతి అవసరం లేదు, హైకోర్టులో కేంద్రం కౌంటర్, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై తమకు సమాచారం లేదని వెల్లడి
Arun Charagondaతెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని, ఇందులో కేంద్రం అనుమతి అవసరం లేదని వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉంటుందని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.