తెలంగాణ

Nagole Metro:నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత.. ప్రయాణికుల ఆందోళన, ఎల్‌ అండ్ టీ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు, ఉద్రిక్తత

Arun Charagonda

హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ ప్రయాణీకుల ఆందోళనతో దద్దరిల్లిపోయింది. నాగోల్‌లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించి, డబ్బులు వసూలు చేస్తుండడంతో మెట్రో ప్రయాణికులు ఆగ్రహంం వ్యక్తం చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Independence Day 2024: తెలంగాణ పోలిస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డ్‌, ఎందుకు ప్రదానం చేశారంటే..

Hazarath Reddy

తెలంగాణ పోలిస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) అవార్డ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్‌ అధికారి యాదయ్యకు దక్కడం విశేషం

Har Ghar Tiranga railey:హైదరాబాద్ పాతబస్తీలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ, చాంద్రయణగుట్ట నుండి చార్మినార్ వరకు ర్యాలీ, వీడియో

Arun Charagonda

దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. సిఆర్‌పిఎఫ్ క్యాంపస్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఫలకనుమ, శాలిబండ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి సిఆర్‌పిఎఫ్ డీజీపీ విజయ్ భాస్కర్ బిళ్ళ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

Telangana Shocker: దారుణం, కొడుకు జైలుకు వెళ్లాడని తల్లీకూతుళ్లతో మాట్లాడని గ్రామస్తులు, తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య

Hazarath Reddy

మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఎవరూ మాట్లాడటం లేదని తల్లీకూతుళ్ల ఆత్మహత్య చేసుకున్నారు.కాగా పది నెలల క్రితం కోడలిని హత్య చేసిన కొడుకు జైలుకు వెళ్లాడు. ఇదే కేసులో జైలుకి వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు

Advertisement

CM Revanth Reddy In Hyderabad: సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం, భారీ ర్యాలీతో స్వాగతం పలికిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెట్టుబడులే లక్ష్యంగా సాగిన రేవంత్ టూర్

Arun Charagonda

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన సాగింది.

Andhra Pradesh: తెలంగాణ స్థానిక‌త ఉన్న 122 మంది ఉద్యోగుల‌ను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం, ఇకపై సొంత రాష్ట్రంలోనే ప‌ని చేయ‌నున్న ఉద్యోగులు

Hazarath Reddy

తెలంగాణ స్థానిక‌త ఉన్న 122 మంది ఉద్యోగుల‌ను రిలీవ్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఇక‌పై తెలంగాణ‌లో ప‌ని చేయ‌నున్నారు.

KTR Questions CM Revanth Reddy: పడకేసిన పల్లెలు, కంపు కొడుతున్న పట్టణాలు?, ఇదేనా ప్రజా పాలన అంటే మండిపడ్డ కేటీఆర్

Arun Charagonda

రాష్ట్రంలో పల్లెలు పడకేశాయన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు కేటీఆర్. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు.

Nalgonda: వాగులో చిక్కుకుపోయిన ఎస్సై వెంకట్‌ రెడ్డి, స్థానికుల సాయంతో బయటపడ్డ ఎస్సై, వీడియో వైరల్

Arun Charagonda

నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షాలకు గట్టుప్పల్, పుట్టపాక మధ్యలోని ఆరుమాళ్ల వాగు పొంగి పొర్లింది. దీంతో సొంతూరు వెళ్తూ వాగులో చిక్కుకుపోయారు గట్టుప్పల్ ఎస్సై గుత్త వెంకట్ రెడ్డి. సిబ్బంది, స్థానికుల సహాయంతో బయయటపడ్డారు ఎస్సై.

Advertisement

Train Hits Goats At Vikarabad: 50 మేకలను ఢీ కొట్టిన ట్రైన్స్, అక్కడికక్కడే మేకలు మృతి,వీడియో వైరల్

Arun Charagonda

వికారాబాద్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 50 మేకల్ని ఢీకొట్టాయి రెండు రైళ్లు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండల్ డీకే తండాకు చెందిన రైతులు మేకల్ని తీసుకొస్తుండగా ఘటన చోటు చేసుకుంది. అడవి పందుల గుంపు ఎదురవడంతో రైలు పట్టాలపైకి వెళ్లాయి మేకలు. 50 మేకలు మృత్యువాత పడ్డాయి.

Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య యత్నం, ట్యాంక్ బండ్ శివ సాయంతో యువతి సేఫ్‌..వీడియో

Arun Charagonda

హైదరాబాద్ - ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది మహిళ. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు.. ట్యాంక్ బండ్ శివ సహాయంతో ఆమెను బయటకుతీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana Nominated Posts: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మధుయాష్కి, కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల జాతర, మంత్రివర్గ విస్తరణ కూడా, రేసులో ఉంది ఎవరంటే?

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ జాతర మొదలు కానుందా?, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందా?, ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ACB Rides On Rangareddy Additional Collector:ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ధరణిలో మార్పులు చేసేందుకు రూ.8 లక్షలు డిమాండ్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ధరణిలో మార్పులు చేసేందుకు రూ. 8 లక్షలు డిమాండ్ చేయగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నిన్న రాత్రి నుంచి ఇద్దరి ఇళ్లలో అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి.

Advertisement

Telangana Shocker: గంజాయి మత్తులో సీఐ కొడుకు వీరంగం, రోడ్డుపై మూత్రం పొయవద్దని చెప్పినందుకు ఓ డ్రైవర్‌పై దాడి, వీడియో వైరల్‌

Arun Charagonda

గంజాయి మత్తులో సిద్దిపేట AR CI పూర్ణ చందర్ కొడుకు హర్ష వీరంగం సృష్టించాడు. వరంగల్ జిల్లా కాజీపేట చౌరస్తాలో రోడ్డు మీద మూత్రం పొయ్యకని చెప్పిన కారు డ్రైవర్ మీద విచక్షణ రహితంగా దాడి చేశాడు. సీఐ కొడుకుతో పాటు స్నేహితులు కూడా గంజాయి తీసుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం, పంజాగుట్ట, అమీర్ పెట్, బంజారాహిల్స్‌లో భారీ వర్షం, వీడియో వైరల్‌

Arun Charagonda

హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. పంజాగుట్ట, అమీర్ పెట్, బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్, బేగంపేట,కోటి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Jurala Dam: జూరాల డ్యామ్‌ లో లీకేజీలు... తుంగభద్ర గేట్ ఘటన నేపథ్యంలో జూరాల డ్యామ్ భద్రతపై అనుమానాలు.. ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసివేత (వీడియో)

Rudra

తుంగభద్ర డ్యామ్ లో ఓ గేటు ఇటీవల కొట్టుకుపోవడం ఆ డ్యాం భద్రతపై అనుమానాలను రేకెత్తించింది. గేటు కొట్టుకుపోవడంతో భారీ ఎత్తున నీరు వృథాగా పోయింది. వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది.

Hyderabad Shocker: హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. ట్రాఫిక్‌ ఎస్‌ఐపై మహిళల దాడి.. అసలేం జరిగింది?

Rudra

ప్రజల భద్రత కోసమే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే, కన్నూమిన్నూ కానకుండా డ్యూటీలో ఉన్న పోలీసులపట్ల కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ, హోంగార్డుపై కొందరు మహిళలు దాడికి పాల్పడటం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.

Advertisement

Sagar, Srisailam Gates Closed: తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు

Rudra

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అన్ని గేట్లను అధికారులు మూసి వేస్తున్నారు.

Telangana JAC Again: తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్లీ ఉద్యోగ జేఏసీ, ఒకటో తేదీ జీతాలేవి?, రేవంత్ సర్కార్‌ పై పోరాటానికి ఉద్యోగులు రెడీ

Arun Charagonda

తెలంగాణ ఉద్యమం తర్వాత ఉద్యోగ జేఏసీ మళ్లీ ఏర్పాటైంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాటు చేశాం.. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు ఉద్యోగులు. మేనిఫెస్టోలో పీఆర్సీ, టీఏ, డీఏ అని అన్నారు కానీ 9 నెలలు అయిన ఇంకా ఇవ్వలేదు.. ఇప్పటికీ 4 డీఏలు ఇవ్వలేదు అన్నారు.

Warangal Shocker: చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య, వరంగల్ జిల్లా రాయపర్తిలో ఘటన, పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

వరంగల్ జిల్లా: రాయపర్తి చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు హన్మకొండ జిల్లా పైడిపెల్లికి చెందిన దూకి అంజలి (25), సంగాల దిలీప్ (30) గా గుర్తించగా ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు స్మితా సబర్వాల్ కాంట్రవర్సీ కామెంట్స్ వ్యవహారం...పూర్తి సమాచారంతో అఫిడవిట్ ఇవ్వాలన్న న్యాయస్థానం

Arun Charagonda

దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను వెనెక్కి తీసుకునేలా యూపీఎస్సికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సామాజికవేత్త వసుందర. ఈ సందర్భంగా పిటీషనర్ అర్హతను ప్రశ్నించింది ధర్మాసనం. తాను ఒక వికలాంగురాలని, స్మితా వ్యాఖ్యలు తన మనోభావాలు దెబ్బతీసే లాగా ఉన్నాయని పేర్కొంది వసుందర. పూర్తి సమాచారంతో అఫిడవిట్ సమర్పించాలని కోరింది హైకోర్టు.

Advertisement
Advertisement