తెలంగాణ

Telangana DSC Notification Update: 11 వేలకు పైగా పోస్టులతో తెలంగాణలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రేవంత్ రెడ్డి సర్కారు (Telangana Government) రద్దు చేసింది.5089 టీచర్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు (Telangana Government, Cancelled, Dsc Notification) చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Horror: సూర్యాపేటలో దారుణం, బ్లేడుతో భార్య, వదినలపై దాడి చేసి గొంతు కోసిన భర్త, కుటుంబ కలహాలే కారణమని తెలిపిన స్థానికులు

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవలో భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. భార్య నాగలక్ష్మి, వదిన స్వరూప గొంతును బ్లేడుతో కోసేశాడు. తీవ్ర గాయాలతో ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు నాగార్జునను బంధువులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Attack on Bandi Sanjay with Eggs: వీడియో ఇదిగో, బండి సంజయ్ మీద కోడి గుడ్ల దాడి, పోలీసు బందోబస్తు నాకు ఏమీ వద్దని కోరిన కరీంనగర్ ఎంపీ

Hazarath Reddy

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ వరంగల్‌ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో, బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే సంజయ్‌ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లతో దాడికి చేశారు.

Kadiyam Srihari Slams CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మగతనం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్, నీ మగ తనాన్ని నిరూపించుకోమని సవాల్

Hazarath Reddy

తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరి కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంటోంది. నిన్న చేవెళ్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ నేతలను, కేటీఆర్ ను మగాడివైతే వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలిపించి చూపించు అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Advertisement

Accident Caught on Cam: ఈ రోడ్డు ప్రమాదంలో తప్పెవరది? సిగ్నల్ లేని చోట రోడ్డు దాటుతున్న యువకుడిని ఢీకొట్టిన బొలెరో వాహనం, అక్కడికక్కడే మృతి, సీసీటీవీ ఫుటేజీ వీడియో ఇదిగో..

Hazarath Reddy

సోషల్ మీడియాలో తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ద్విచక్రవాహనంలో రోడ్డు దాటుతుండగా యువకుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం అక్కడున్న సీసీటీవీ పుటీజీలో రికార్డు అయింది.

Suryapet Road Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరో 12 మందికి గాయాలు

Hazarath Reddy

సూర్యాపేట జిల్లా కేంద్రానికి దగ్గరలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతేకు దగ్గరలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

Telangana Inter Exams 2024: ఇంటర్ పరీక్షలకు తొమ్మిది నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని వెనక్కి పంపిన అధికారులు, కంటతడి పెట్టుకున్న అమ్మాయి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇంటర్మీడియట్ పరీక్షలకు ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని పావని 9:09 నిమిషాలకు రాగా.. అధికారులు వెనక్కు పంపించగా అమ్మాయి కంటతడి పెట్టుకుంది.

Quthbullapur Fire Accident: కుత్బుల్లాపూర్ లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో చెల‌రేగిన మంట‌లు, స‌కాలంలో స్పందించ‌డంతో త‌ప్పిన ప్రాణన‌ష్టం (వీడియో ఇదుగో)

VNS

మేడ్చ‌ల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో (Quthbullapur) భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో రాత్రి మంట‌లు చెల‌రేగాయి. అవి కాస్తా అపార్ట్ మెంట్ మొత్తం వ్యాపించ‌డంతో మంట‌లు ఎగిసిప‌డ్డాయి. అయితే మంట‌లు చెల‌రేగిన వెంట‌నే అందులో ఉన్న‌వాళ్లు బ‌య‌ట‌కు ప‌రుగులు తీయ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది.

Advertisement

Telangana weather Alert: తెలంగాణ‌లో దంచికొడుతున్న ఎండ‌లు, నేటి నుంచి పెరుగ‌నున్న‌ మూడు డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు, మార్చి రెండో వారం నుంచి ఎండాకాలం షురూ

VNS

తెలంగాణలో బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు (Temperatures) పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వెల్లడించింది. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు (Temperatures) మరింత పెరుగుతాయని పేర్కొన్నది.

Telangana Intermediate Board Exams: తెలంగాణలో మొద‌లైన ఇంటర్మీడియట్ ప‌రీక్ష‌లు, మార్చి 19వ‌ర‌కు వ‌రుస ఎగ్జామ్స్, విద్యార్ధులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లివే!

VNS

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board Exams) ఏర్పాట్లు చేసింది. పరీక్షల పర్యవేక్షణ కోసం 1521 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, ఇదే సంఖ్యలో ప్రభుత్వ అధికారులను పరీక్షలకు వినియోగిస్తున్నారు. 27,900 మంది ఇన్విజిలేటర్లు పరీక్ష విధుల్లో ఉండబోతున్నారు.

CM Revanth Reddy Slams KTR: వీడియో ఇదిగో, కేటీఆర్ సన్నాసి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు మొగోడివైతే ఒక్క సీటు గెలిపించి చూపించు అని సవాల్

Hazarath Reddy

చేవెళ్లలో జన జాతర పేరుతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో పాటు ఆ పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించు బిడ్డా... నువ్వు వస్తావా? నీ అయ్య వస్తాడా? చూసుకుంటాం బిడ్డా' అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Mahalakshmi Scheme in Telangana: సోనియా గాంధీ హామీ ఇస్తే శిలాశాసనం, తప్పక అమలు చేసి తీరతామని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మహాలక్ష్మి, గృహ జ్యోతి ప్రారంభం

Hazarath Reddy

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme in Telangana) ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు.

Advertisement

Mahalakshmi Scheme Guidelines: తెల్లరేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే రూ. 500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

అర్హులైనవారికి రూ 500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్‌ను రేవంత్ సర్కారు విడుదల చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘మహాలక్ష్మి’లో మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.

Telangana: కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా ఇన్వర్టర్స్ నుండి రివర్స్ పవర్, విద్యుత్ స్తంభం పై నుండి పడ్డ ఔట్ సోర్సింగ్ హెల్పర్, తలకు బలమైన గాయాలు

Hazarath Reddy

నారాయణపేట - జిల్లా కేంద్రంలోని సరాఫ్ బజార్ ప్రాంతంలో లైన్‌మెన్‌కు చెప్పకుండా ఔట్ సోర్సింగ్ హెల్పర్ అల్లావుద్దీన్ కరెంటు స్తంభం ఎక్కి సర్వీస్ కనెక్షన్ ఇస్తున్నాడు. పవర్ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ ఆ ఏరియాలో ఉండే ఇన్వర్టర్స్ నుండి రివర్స్ పవర్ రావడంతో ప్రమాదం జరిగింది.

Bio Asia 2024: బయోఏషియా సదస్సు ప్రారంభం నేడే.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇప్పటికే నగరానికి చేరుకున్న ప్రతినిధులు

Rudra

ఔషధ, జీవశాస్ర్తాల వార్షిక సదస్సు ‘బయోఏషియా-2024 సమ్మిట్‌’కు హైదరాబాద్‌ మళ్లీ వేదికైంది. మంగళవారం ఉదయం పది గంటలకు హెచ్‌ఐసీసీలో సదస్సు ప్రారంభం కానున్నది.

Viral Video: డివైడర్ ఎక్కి అవతలి వైపు నుండి వస్తున్న కారును ఢీకొట్టిన మరో కారు.. కుకునూర్ పల్లి రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు.. వీడియో వైరల్

Rudra

సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కి అవతలి వైపు నుండి వస్తున్న కారును ఢీ కొట్టింది.

Advertisement

Lok Sabha Elections: ఖమ్మం లేదా భువనగిరి నుండి లోక్‌సభ బరిలోకి దిగనున్న రాహుల్ గాంధీ.. పత్రికల్లో కథనాలు

Rudra

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం లేదా భువనగిరి స్థానం నుంచి పోటీ చేయొచ్చు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని, దీనికి రాహుల్ గాంధీ కూడా అంగీకరించినట్లు పలు పత్రికల్లో, సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.

TSPSC Group 1 Exam Date: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 14 చివరి తేదీ.. ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

Rudra

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 9న నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం వీటి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.

Congress Two Guarantees: మహాలక్ష్మి, గృహలక్ష్మీ పథకాలకు నేడే శ్రీకారం.. చేవెళ్లలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. లోక్‌సభ ఎన్నికల కోడ్ లోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఫథకం

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరో రెండింటిని అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.

Telangana: వీడియో ఇదిగో, రాంగ్ రూట్‌లో జాగ్వార్ నడిపిన మహిళ, అడ్డుకున్న ట్రాఫిక్ హోంగార్డుపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ దాడి

Hazarath Reddy

తెలంగాణలోని బంజారాహిల్స్‌లో, ఫిబ్రవరి 24, శనివారం నాడు జాగ్వార్ నడుపుతున్న ఓ మహిళ ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేసినట్లు విస్తృతంగా ప్రచారం చేయబడిన వీడియోలో చిత్రీకరించబడింది. జాగ్వార్‌ను తప్పుడు మార్గంలో నడుపుతూ మహిళను అధికారి ఆపడంతో వాగ్వాదం జరిగింది.

Advertisement
Advertisement