తెలంగాణ

Hyderabad Road Accident: వీడియో ఇదిగో, నాగోల్ ఏరియాలో బైకును ఢీకొట్టిన లారీ, తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

జనవరి 5, శుక్రవారం నాడు హైదరాబాద్‌ నాగోల్ ప్రాంతంలోని పాపయ్యగూడ ఎక్స్‌రోడ్డు వద్ద వేగంగా వస్తున్న లారీ ట్రక్కు.. బైక్‌ను ఢీకొనడంతో తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చి ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్‌తో పాటు లారీ కూడా చాలావరకు మంటల్లో కాలిపోయింది.

UPI Charges: యూపీఐ పేమెంట్లపై వారికి ఛార్జీలు.. ఎన్‌పీసీఐ చీఫ్‌ దిలీప్‌ అస్బే కామెంట్స్‌

Rudra

రానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ దిలీప్‌ అస్బే అన్నారు. 'యూపీఐ చెల్లింపులపై చిన్న వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలూ ఉండవు.

TSRTC Special Buses: సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ 4,484 ప్రత్యేక బస్సులు.. జనవర్ 6 నుంచి 15 వరకూ అందుబాటులోకి.. సాధారణ చార్జీలు, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం

Rudra

పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగను పురస్కరించుకుని 4,484 ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహించనున్నట్టు చెప్పింది.

TS Constable Recruitment: 15,640 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్, కానిస్టేబుల్‌ నియామక పరీక్షపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

తెలంగాణ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శుభవార్త. 15,640 పోస్టుల భర్తీకి నాలుగు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ (High Court) గురువారం ఆదేశించింది, అయితే అభ్యర్థులకు గతంలో నాలుగు మార్కులు కలపాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం కొట్టివేసింది

Advertisement

MLC Bye-Election in Telangana: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 29న పోలింగ్, అదే రోజు ఫలితాలు, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

Hazarath Reddy

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 29న పోలింగ్‌ జరగనుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి

TSRTC Rental Bus Owners Strike Row: చర్చలు సఫలం..తెలంగాణలో రేపటి నుంచి ఎలాంటి సమ్మె లేదని తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, బస్సులు యథావిధిగా నడుస్తాయని ప్రకటన

Hazarath Reddy

తెలంగాణలో ఆర్టీసీ అద్దె బస్సుల సమ్మె లేదని (TSRTC Rental Bus Owners Strike Row) స్పష్టం చేశారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. గురువారం బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు.

CM Jagan Meet KCR: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌, ఏపీ ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికిన కేటీఆర్

Hazarath Reddy

సీఎం జగన్‌ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా కాలి తుంటికి శస్త్ర చికిత్స అనంతరం నందినగర్‌లోని తన నివాసంలో కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి విదితమే.

YS Sharmila Joins Congress: వీడియో ఇదిగో, కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల, అధికారికంగా హస్తం పార్టీలో విలీనమైన వైఎస్సార్ తెలంగాణ పార్టీ

Hazarath Reddy

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన షర్మిలా రెడ్డి.. గురువారం ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

Advertisement

Bandi Sanjay: బండి సంజయ్ కు బీజేపీ బిగ్ పోస్టు, లోక్ సభ ఎన్నికల ముందు జాతీయ స్థాయిలో కీలక పదవి అప్పగించిన అధిష్టానం

VNS

బీజేపీ అనుబంధ రైతు సంఘం అయిన కిసాన్ మోర్చా (Kisan Morcha) ఇన్‌చార్జీగా బండి సంజయ్ ను బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నియమించారు. యువమోర్చా ఇన్‌చార్జీగా సునీల్ బన్సల్, మహిళా మోర్చా నాయకురాలిగా బైజయంత్ జే పాండా, ఎస్సీ మోర్చా ఇన్‌చార్జీగా తరుణ్ చుగ్, ఎస్టీ మోర్చా ఇన్‌చార్జీగా రాధా మోహన్ దాస్ లన జేపీ నడ్డా నియమించారు

Zomato Delivery Boy: గుర్రంపై ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తికి ఆర్ధికసాయం, రూ. 10వేలు అందించిన ఎంబీటీ నేత, విధి నిర్వహణలో అతని నిబద్దతకు సలాం

VNS

ప్రతీరోజూ బైక్ పై వెళ్లి ఆర్డర్ డెలివరీ చేసే జొమాటో డెలివరీ బాయ్.. పెట్రోల్ కొరత కారణంగా ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అనుకున్న సమయానికి కస్టమర్ కు ఆర్డర్ డెలివరీ చేయాలన్న ఉద్దేశంతో గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ చేశాడు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ గా మారింది.

Sankranti Holidays 2024: జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, హాలిడేస్ ప్రకటన విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.

CM Jagan To Meet KCR: రేపు కేసీఆర్‌తో భేటీ కానున్న సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించనున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును పరామర్శించనున్నారు. గత నెల 8వ తేదీన కేసీఆర్‌ గజ్వేల్‌ ఫాంహౌజ్‌లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగన సంగతి తెలిసిందే.

Advertisement

Hyderabad Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, అతివేగంతో దూసుకొచ్చిన బైకులను ఢీకొట్టిన చెత్త ఆటో, ఒకరు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. చెంగిచర్లలో చెత్త సేకరించే ఆటో అతివేగంగా దూసుకొచ్చి ఎదురొచ్చిన రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాచారం వాసి బాబీ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Hyderabad Fire: వీడియో ఇదిగో, ఉప్పల్ సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం, భారీగా ఆస్తి నష్టం

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న, సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా నాలుగంతస్తుల భవనంలోని ముందు భాగంలో మంటలు చెలరేగాయి

Zomato Rider On Horse Video: పెట్రోల్ లేకపోతే ఏంటి? గుర్రం ఉంది కదా! గుర్రంపై వెళ్లి ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి, సోషల్ మీడియాలో వైరల్ వీడియో

VNS

బైక్ పై కాదు ఏకంగా గుర్రంపై వెళ్లి మరీ ఫుడ్ డెలివరీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral Video) మారింది. హైదరాబాద్ లోని చంచల్ గూడలో ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రంపై (Zomato Rider On Horse) వెళ్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

YS Sharmila: వీడియో ఇదిగో, కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించుకున్నాం, రేపు ఢిల్లీ వెళ్తున్నానని తెలిపిన వైఎస్ షర్మిల

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించుకున్నామని వైఎస్ షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 31 స్థానాల్లో 10వేలలోపు మెజారిటీతో గెలిచిన ప్రాంతాల్లో వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రభావం ఎంతో ఉందని అన్నారు. రేపు ఢిల్లీ వెళ్తున్నా..వచ్చాక అన్ని విషయాలు మాట్లాడాతని తెలిపారు. కాగా జనవరి 4వ తేదీన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించిన సంగతి విదితమే.

Advertisement

MLA Kavvampally Satyanarayana: మానకొండూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ చిలిపి చేష్టలు వీడియో వైరల్, ఇంకా అధికారికంగా స్పందించని ఎమ్మెల్యే

Hazarath Reddy

క‌రీంన‌గ‌ర్ జిల్లా మాన‌కొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ.. నియోజకవర్గంలో నిర్వ‌హించిన నూతన సంవత్సర వేడుక‌ల్లో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు.కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది.

Telangana: పెండింగ్ చలానాలు ఈ వెబ్‌సైట్‌లో కడుతున్నారా, అయితే మీ డబ్బులు పోయినట్లే, అలర్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలో పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేయటానికి వాహనదారులకు భారీ రాయితీని ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్‌ మోసగాళ్లు ఫేక్ వెబ్‌సైట్‌ క్రియేట్లతో రెచ్చిపోతున్నారు. www.echallantspolice.in పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించారు.

YSRTP Merge With Congress: పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల, రేపు సాయంత్రం ఢిల్లీకి వైఎస్సార్టీపీ అధినేత్రి

Hazarath Reddy

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వెఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు షర్మిల. అనంతరం కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై ప్రకటన చేశారు. ఈ నెల 4న పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు సాయంత్రం షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు.

Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల ? సాధ్యాసాధ్యాలపై పార్టీ నేతలతో సమావేశం, పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం

Hazarath Reddy

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement