తెలంగాణ
Onion Price: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు.. హైదరాబాద్‌ లో కేజీ రూ.60-80
Rudraఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం వరకు రూ.100కు 6 కేజీల వరకు దొరికిన ఉల్లి, ఇప్పుడు వందకు కేజీన్నరకు పడిపోయింది.
Telangana Elections 2023: అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోతే పొత్తు కుదరదు - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అల్టిమేటం..
ahanaహైదరాబాద్లో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. తాము అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోతే పొత్తు కుదరదని తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. ఎల్లుండి మరోసారి రాష్ట్ర కార్య వర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
Massage Centre: నెలకు లక్ష జీతం అనగానే సంబురపడింది.. ఫిట్‌ నెస్ శిక్షకురాలిగా చేరింది.. అయితే, ఉద్యోగంలో కొనసాగాలంటే కస్టమర్లకు ముద్దులతో పాటు ఇంకా చాలా చేయాలన్న యజమాని.. ఆ తర్వాత ఆ మహిళ ఏం చేసింది? హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన ఘటన
Rudraఉద్యోగంలో కొనసాగాలంటే సెంటర్ కు వచ్చిన పురుష కస్టమర్లకు ముద్దులతో పాటు ఇంకా చాలా చేయాల్సిందేనని అప్పుడే ఉద్యోగంలో చేరిన ఓ మహిళను ఒత్తిడి చేసిన నిర్వాహకులపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది.
Chandrababu Arrest: రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన నారా లోకేష్, భువనేశ్వరి
ahanaటీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును 50 రోజులుగా జైల్లో బంధించారని, ఆయనకు బెయిల్ రాకుండా ప్రభుత్వం వ్యవస్థలు నిర్వహిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. భువనేశ్వరితో కలిసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును పరామర్శించిన లోకేష్ అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు.
Nalgonda Road Accident: నార్కట్‌పల్లిలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..డ్రైవర్ మృతి, 8 మందికి తీవ్రగాయాలు
ahanaశనివారం తెల్లవారుజామున నార్కట్‌పల్లి మండలం లొంగోటం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, పాల్వాయి స్రవంతిని నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి, మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించిన హైకమాండ్
Hazarath Reddyగత ఏడాది మునుగోడు ఉపఎన్నికల్లో స్రవంతికి రేవంత్ ఇచ్చిన వాగ్ధానం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 15 స్థానాలు కేటాయిస్తామని.. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇస్తామని ప్రచార సభ వేదికగా హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
Telangana Elections 2023: జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరణతో పి.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం, బీజేపీ నుండి లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వార్నింగ్..
ahanaజూబ్లీహిల్స్ టికెట్ నిరాకరించడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ పీజేఆర్ కొడుకుకి కాకుండా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు కేటాయించడంతో విష్ణు ఆగ్రహంతో ఉన్నారు.
Onion Price Hike: నిన్నటివరకు టమోటా మోత, నేడు ఉల్లి ఘాటు.. 57 శాతం పెరిగిన రిటైల్‌ ఉల్లి ధర.. ధరాఘాతంతో విలవిలలాడుతున్న సామాన్యుడు
Rudraధరల మోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరాఘాతంలో దేశంలోని ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో కడుపు నిండా తినే పరిస్థితి కూడా లేదు.
TS Weather: తెలంగాణలో చలి పంజా, మరో మూడు రోజుల పాటూ ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న ఐఎండీ, తెల్లవారుజామున కనిష్టానికి ఉష్ణోగ్రతలు
VNSతెలంగాణను చలి (Cold) వణికిస్తున్నది. రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారు జామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కనిష్ఠంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడురోజులు చలి తీవ్రత (Cold wave) కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు ఏర్పడగా.. ఇందులో ఒకటి నైరుతి దిశలో తమిళనాడుకు దగ్గరలో ఉన్నది.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 45 మందితో కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల, అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 45 మందితో తన రెండో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాలో బోథ్ నుంచి వెన్నెల అశోక్, ముథోల్ నుంచి నారాయణ్ రావు, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కీ గౌడ్, ఎల్లారెడ్డి నుంచి మధన్ మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతిరెడ్డి, మహేశ్వరం నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, దుబ్బాక నుంచి శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేశ్ పోటీ చేయనున్నారు.
Telangana Assembly Elections 2023: మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయనతో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి
Hazarath Reddyఎన్నికలు సమీపించే కొద్ది తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్‌ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు.
Telangana Assembly Elections 2023: ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఏపీ మిథున్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది బీజేపీ. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించించింది కమలం పార్టీ.
Board Of Intermediate: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు తేదీల విడుదల.. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ జరిమానా లేకుండానే ఫీజు చెల్లింపునకు అవకాశం.. ఆ తర్వాత జరిమానా ఎలాగంటే?
Rudraతెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ ఎటువంటి జరిమానా లేకుండా ఫీజులు చెల్లించవచ్చని పేర్కొంది.
TS Police Seized: తెలంగాణలో ఎన్నికల తనిఖీలు.. పెద్దయెత్తున నగదు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం స్వాధీనం.. ఇప్పటివరకు రూ.347 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.347.16 కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad Blasts Conspiracy Case: హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర కేసు, 11 మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించిన ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు
Hazarath Reddyహైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర కేసులో పదకొండు మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ ఎన్‌ఐఏ(National Investigation Agency)కోర్టు. ఈ కేసులో కీలక సూత్రధారి ఒబెద్‌ ఉర్‌ రెహమాన్‌తో పాటు 10 మందికి జైలు శిక్ష ఖరారు చేసింది ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.
YSR Telangana Party Symbol: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, వైఎస్సార్‌టీపీకి బైనాక్యులర్‌ గుర్తు కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఆ పార్టీకి బైనాక్యులర్‌ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌టీపీ బైనాక్యులర్‌ గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగనుంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వైఎస్‌ షర్మిల ప్రకటించారు.
Viral Video: చొక్కా పట్టుకొని టీవీ లైవ్‌లో స్టేజీ మీదనే కొట్టుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకా, బీజేపీ నేత శ్రీశైలం గౌడ్..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
ahanaకుత్బుల్లా పూర్ లో ఓ ప్రైవేటు న్యూస్ చానెల్ నిర్వహించిన డిబేట్ లో ప్రస్తుత ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చొక్కాలు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. దీంతో డిబేట్ నిర్వాహకులు మధ్యలో జోక్యం చేసుకొని గొడవను సర్దుబాటు చేసే యత్నం చేశారు.
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసి పడుతున్న మంటలు..
ahanaసికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా, నిప్పు కీలలు ఎగిసి 5వ అంతస్తు వరకూ మంటలు వేగంగా వ్యాపించాయి.