తెలంగాణ

TSRTC MD Sajjanar Tweet: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, రైలు డోర్ దగ్గర నిలబడిన యువతి, రెప్పపాటులో పక్కనుంచి ట్రైన్ రావడంతో షాక్

Hazarath Reddy

రైల్లో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి డోర్ వద్ద నిల్చొని తల బయటకు పెట్టింది. క్షణాల్లోనే మరో రైలు పక్కనే ఉన్న పట్టాలపైకి రాగా.. వెంటనే ఇతర ప్రయాణికులు ఆ అమ్మాయిని లోపలికి లాగగా.. ప్రాణాలతో బయట పడింది.

Hyderabad Shocker: ప్రియురాలికి పిజ్జా తీసుకెళ్లిన ప్రియుడు, ఆమె తండ్రి వస్తున్నాడనే భయంతో నాలుగో అంతస్తు నుంచి దూకిన లవర్, చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

హైదరాబాద్‎లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రియురాలు కోరిందని ప్రేమతో పిజ్జా తీసుకెళ్లిన కుర్రాడు నాలుగో అంతస్తు నుంచి దూకి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.బోరబండలో ఈ ఘటన జరిగింది. యువకుడి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు

Hazarath Reddy

హైదరాబాద్ శివార్లలోని బాలాజీ నగర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న మహిళను వివస్త్రను చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

Hyderabad Shocker: సిగ్గు సిగ్గు.. ఓ తాగుబోతు నడిరోడ్డు మీద మహిళను నగ్నంగా మార్చుతుంటే వీడియోలు తీసిన పాదచారులు, దారుణమైన వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న యువతిని వివస్త్రను చేసి, దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.బాలాజీనగర్‌ శివాజీనగర్‌కు చెందిన పెద్ద మారయ్య (30)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసగా మారి భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, గంజాయి పుల్లుగా తీసుకుని ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేసిన ముగ్గురు యువకులు, సూరారం పీఎస్‌ పరిధిలో ఘటన

Hazarath Reddy

హైదరాబాద్ - సూరారం పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ డ్రైవర్ మీద దాడి చేసి ముగ్గురు గంజాయి బ్యాచ్. హైదరాబాద్‌లోని సూరారం పీఎస్‌ పరిధిలో ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ పై దాడి చేసి పారిపోవడంతో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌ లో మరో విద్యార్థి బలవన్మరణం.. మృతుడిని ఒడిశా వాస్తవ్యుడిగా గుర్తించిన పోలీసులు

Rudra

ప్రతిష్టాత్మక సంస్థ ఐఐటీ హైదరాబాద్‌ లో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న మమైత నాయక్ మానసిక ఒత్తిడి కారణంగా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Tomato Prices: సామాన్యులకు ఊరట.. హైదరాబాద్‌ లో దిగొస్తున్న టమాటా ధర.. మార్కెట్‌ కు నిన్న 2,450 క్వింటాళ్లు.. రైతు బజార్లలో కిలో టమాటా రూ. 63

Rudra

పెరిగిన టమాటా ధరలతో కుదేలైన సామాన్యులకు ఊరటనిచ్చే విషయమిది. మార్కెట్లోకి టమాటాల రాక మళ్లీ పెరుగుతుండడంతో ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. హైదరాబాద్‌ కు నిన్నమొన్నటి వరకు 850 క్వింటాళ్ల టమాటాలు రాగా నిన్న 2,450 క్వింటాళ్లు వచ్చాయి.

Vizag Car Accident: విశాఖలో కారు బీభత్సం.. డివైడర్ ను దాటి బైక్ ను ఢీకొట్టి.. ఆపై చెట్టు పొదల్లోకి వెళ్లిన వాహనం.. ప్రమాద ఘటనలో ముగ్గురి మృతి

Rudra

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా బైక్ పై వస్తున్న వారిని అనంతరం ఢీకొట్టింది. ఆపై చెట్టు పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పైన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతి చెందాడు.

Advertisement

Malayalam Director Siddique: మలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ కు గుండెపోటు... పరిస్థితి విషమం

Rudra

మలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ గుండెపోటుతో కొచ్చిలోని ఆసుపత్రిలో చేరారు. 69 ఏళ్ల ఈ దర్శకుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Jagtial Shocker: శిథిలావస్థకు ఎంపీడీఓ ఆఫీసు.. హెల్మెట్లు ధరించి డ్యూటీ చేస్తున్న ఉద్యోగులు.. జగిత్యాల జిల్లా బీర్‌ పూర్ లో ఘటన.. ఫోటోలు వైరల్

Rudra

జగిత్యాల జిల్లా బీర్‌ పూర్ ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకొండి. చూరు ఎప్పుడు కూలుతుందా అని భయపడుతూ ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయం పెచ్చులూడిపోతుండంతో నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం బయటే టేబుళ్లు వేసుకుని పని చేసుకుంటున్నారు.

Gaddar Last Rites: బౌద్ధ మత ఆచారంలో ముగిసిన గద్దర్ అంత్యక్రియలు, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయ ఆవరణలో అంతిమ సంస్కారాలు పూర్తి

Hazarath Reddy

గద్దర్ అంత్యక్రియలు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగిశాయి. అల్వాల్‌లోని మహాబోధి స్కూల్ ఆవరణలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో బౌద్ధ సంప్రదాయం ప్రకారం పూర్తి చేశారు. బౌద్ధ మత ఆచారంలో గద్దర్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

Gaddar's Funeral: గద్దర్ అంతిమ యాత్రలో తొక్కిసలాట, సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి

Hazarath Reddy

గద్దర్ అంత్యక్రియల సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రజా గాయకుడుకు అంతిమ వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందారు.

Advertisement

Eco-Friendly Electric Buses: హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టనున్న1300 పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు, ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలివే

Hazarath Reddy

హైదరాబాద్ ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని #TSRTC నిర్ణయించింది.

Gaddar Funeral: గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి నివాళి అర్పించిన సీఎం కేసీఆర్, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సోమ‌వారం సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. అనంత‌రం గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చారు

Telangana: మద్యం మత్తులో లారీ డ్రైవర్ భీభత్సం, షాపు ముందు బైక్ పార్కింగ్ చేస్తున్న వ్యక్తిని వేగంగా వచ్చి ఢీకొట్టిన లారీ, నిందితుడుకి తీవ్ర గాయాలు

Hazarath Reddy

భూపాలపల్లి పట్టణంలోని ఓ షాపు ముందు టూ వీలర్ పార్కింగ్ చేస్తున్న క్రమంలో మైపల్లి గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తిని లారీ ఢీకొట్టింది. రంజిత్ లారీ ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. పార్కింగ్ చేసిన కార్లు, బైక్ పై నుంచి లారీ దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయ్యాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Video: వీడియో ఇదిగో, బండి లేదు నా గుండు లేదు పత్తా లేకుండా పోయారు, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సైటైర్లు

Hazarath Reddy

అసెంబ్లీలొ చివరి రోజు సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంటా సీఎం బండి సంజయ్ మీద పరోక్షంగా సెటైర్లు వేశారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే బండి పోతే బండి .. గుండు పోతే గుండు అన్నోల్లు ఇప్పుడు బండి లేదు గుండు లేదు పత్తా లేకుండా పోయారు - సీఎం కేసీఆర్

Advertisement

Road Accident Video: ఘోర విషాదం వీడియో ఇదిగో, రూ. 500 చిల్లర కోసం వెళ్లి సిమెంట్ ట్యాంకర్ కింద పడి చనిపోయిన యువకుడు

Hazarath Reddy

500 రూపాయల చిల్లర కోసం వెళ్లి సిమెంట్ ట్యాంకర్ కింద పడి చనిపోయాడు. హైదరాబాద్ - మొయినాబాద్ సమీపంలో విగ్నేష్ చారి అనే యువకుడు రోడ్డుపక్కన భోజనం చేసి, రూ.500నోటు ఇవ్వడంతో హోటల్ నిర్వాహకుడు చిల్లర లేదని చెప్పాడు. చిల్లర తీసుకొని వెనుదిరగగా లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు

Telangana: చేనేత మిత్ర పథకం కింద ప్రతి చేనేత కార్మికుడికి, ప్రతి మగ్గానికి నెలకు రూ.3000, చేనేత భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ (Minister KTR) శంకుస్థాన చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణతో కలిసి చేనేత భవన్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. 500 గజాల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు.

CM KCR Speech in Assembly: అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు, రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగా అలవికా నీ హామీలు ఇచ్చి, ప్రజలను వంచించబోమని సీఎం కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తమ అమ్ములపొదిలో మరిన్ని అస్ర్తాలు ఉన్నాయని చెప్పారు.

MLA Vanama Venkateswara Rao: వనమా వెంకటేశ్వరరావు అనర్హత వేటుపై స్టే విధించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జలగం వెంకరావు సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుందో లేదో తెలుస్తామని చెప్పింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement
Advertisement