తెలంగాణ
Cyclone Sitrang: తెలుగు రాష్ట్రాలకు తప్పిన సిత్రంగ్ తుఫాన్ ముప్పు, రానున్న మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, 23వ తేదీకి తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి గురువారం ఉదయం అల్పపీడనంగా (Low pressure area forms in Bay of Bengal) మారిందని, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది.
Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్, రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌ నియామకం, జగన్నాథరావును బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Hazarath Reddyమునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. రోహిత్‌ సింగ్‌ను ఆర్‌వోగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్‌వో జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు.
Diwali Holiday 2022: తెలంగాణలో ఈ నెల 24న దీపావళి సెలవు, కీలక ప్రకటన చేసిన తెలంగాణ ప్రభుత్వం, 25వ తేదీ నుంచి 24వ తేదీకి మార్చినట్టు ఉత్తర్వుల్లో వెల్లడి
Hazarath Reddyదీపావళి పండుగ సెలవుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటక చేసింది. ఈ నెల 24వతేదీన(సోమవారం) సెలవు దినంగా (Diwali holiday on October 24) ప్రకటించింది. కాగా, సెలవును 25వ తేదీ నుంచి 24వ తేదీకి మార్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Sex Offenders Register: తెలంగాణలో సెక్స్ నేరస్థుల రిజిస్టర్‌, సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyతెలంగాణ మంత్రి కె.టి. రామాారవు అమెరికాలోని సెక్స్ నేరస్థుల రిజిస్టర్‌ను (Sex Offenders Register) రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రతిపాదనకు గురువారం అంగీకరించారు.ఈ ప్రతిపాదనను ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ప్రతిపాదించారు.
Munugode Bypoll: మునుగోడులో రోలర్ గుర్తు మార్పు, ఆర్వోపై సీరియస్‌ అయిన సీఈసీ, గురువారం సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో (Munugode Bypoll) గుర్తులపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గుర్తుల విషయంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ ఎన్నికల్లో గుర్తుల విషయంలో తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదేనని (CEC) స్పష్టం చేసింది.
Weather Forecast: దీపావళినాటికి భారీ వర్షాలు, వరుసగా ఐదురోజుల పాటూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్, ఏపీలో తీర ప్రాంతాలకు హెచ్చరికలు, అప్రమత్తమైన అధికార యంత్రాంగం
Naresh. VNSఒకవేళ ఏపీ – ఒడిశా మధ్య తుపాను తీరందాటే పరిస్థితి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంటుందని, వాయుగుండం తుపానుగా మారే సమయంలో గంటకు 46 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.
Woman Duped by Fake Godman: పూజల గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేసింది! ఏకంగా రూ.47 లక్షలు మోసపోయింది, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చూసి ఫోన్ చేసినందుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నిండా ముంచిన ఫేక్ బాబా
Naresh. VNSఒక సమయంలో నీపై దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంది. త్వరలోనే నువ్వు చచ్చిపోతావంటూ బెదిరించాడు. ఇందుకోసం స్పెషల్ పూజలు చేయాలంటూ చెప్పాడు. దీనికోసం లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పాడు. దాంతో భయపడ్డ మహిళ విడతల వారిగా రూ. 47 లక్షలు పంపించింది.
Telangana Shocker: తాగిన మత్తులో కానిస్టేబుల్‌పై గొడ్డలితో దాడి చేసిన మందుబాబు, తెలంగాణలో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
Hazarath Reddyమెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో వాహనం స్వాదీనం చేసుకున్నారన్న కోపంతో ఒక మందుబాబు గొడ్డలితో కానిస్టేబుల్‌పై దాడి చేశాడు.
Telangana: తెలంగాణ కాలేజీల్లో కనీస ఫీజు రూ.45 వేలకు పెంపు, ఎంజీఐటీలో చదవాలంటే ఏడాదికి రూ.1.60లక్షలు చెల్లించాల్సిందే, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులను ఖరారు చేసిన ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాల్లో ఫీజులను తెలంగాణ ప్రభుత్వం (TS Govt) ఖరారు చేసింది. అడ్మిషన్‌, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ) సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ తెలంగాణ సర్కార్‌ బుధవారం జీవో జారీ చేసింది.
Diwali 2022: జీహెచ్‌ఎంసీ పరిధిలో టపాసులు పేల్చడంపై ఆంక్షలు, రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య టపాకులను కాల్చాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు, గాలి కాలుష్యాన్ని 15-20 శాతం తగ్గించాలనే లక్ష్యంతో మార్గదర్శకాలు జారీ
Hazarath Reddyభాగ్య నగరంలో టపాసులు పేల్చడంపై ఆంక్షలు వచ్చేశాయి. కాలుష్యకారక పటాకుల విక్రయాలపై నిషేధం విధిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ (GHMC Commissioner Lokesh Kumar) ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana: తెలంగాణలో తప్పిన ఘోర ప్రమాదం, కుప్పకూలిన పెద్దవాగుపై బ్రిడ్జి, వంతెనపై రాకపోకలను నిలిపివేసిన అధికారులు
Hazarath Reddyతెలంగాణలోని కుమ్రం భీమ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కాగజ్‌నగర్‌ మండలం అందెవెళ్లి వద్ద పెద్దవాగుపై (Peddavagu) ఉన్న వంతెన కూలిపోయింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పినట్లయింది. గతేడాది కురిసిన వానలకు వంతెన కొద్దిగా కుంగిపోయింది.
Hyderabad Shocker: షాకింగ్ వీడియో, పెట్రోల్ పంపులో తుపాకీతో రచ్చ చేసిన యువకుడు, పెట్రోల్ పైసలు చెల్లించమన్నందుకే గొడవ, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyపెట్రోల్ ఆన్‌లైన్‌లో చెల్లించే విషయమై ఉద్యోగితో వాగ్వాదానికి దిగిన ఓ యువకుడు సోమవారం హైదరాబాద్‌లోని ఓ పెట్రోల్ పంపులో తుపాకీతో రచ్చ సృష్టించాడు. అతను మరో ఇద్దరితో కలిసి పంపు కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశాడు. పాతబస్తీలోని బహదూర్‌పురా ప్రాంతంలోని ఇండియన్‌ ఆయిల్‌ పంపులో ఈ ఘటన చోటుచేసుకుంది.
Yadadri Temple: ఈనెల 25న యాదాద్రి ఆలయం మూసివేత, సాయంత్రం 4.59 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6.28 గంటలకు సమాప్తం కానున్న సూర్యగ్రహణం
Hazarath Reddyఈ నెల 25న సూర్యగ్రహణం (partial solar eclipse) ఉన్నందున యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు (Yadadri hill shrine will be closed) ఆలయ ఈవో గీతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Cyclone Sitrang: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీగా వర్షాలు పడే అవకాశం.. ఉత్తర అండమాన్ సముద్రంలో నేడు సిత్రాంగ్ ఏర్పడుతుందన్న కెనడా శాస్త్రవేత్తలు.. కొట్టిపారేసిన ఐఎండీ.. అయితే, వర్షాలు మాత్రం కురుస్తాయని వెల్లడి
Jai Kఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షాలతో అల్లాడుతుండగా.. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు పొంచి ఉండొచ్చని తాజాగా కెనడాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Munugode Bypoll 2022: వైరల్ వీడియో, నువ్వు ఆఫ్ట్రాల్ ఒక ఎస్సైవో, సీఐవో, అయాం డాక్టర్ కేఏ పాల్... బీ కేర్ ఫుల్, పోలీసు అధికారిపై మండిపడిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
Hazarath Reddyమునుగోడు ఎన్నికల బరిలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్..తన పట్ల ఒక పోలీసు అధికారి అనుచితంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. నాపై మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తావా? అంటూ ఫైర్ అయ్యారు. మిగిలిన పోలీసులంతా తనతో గౌరవంగా ఉన్నారని... నీవు మాత్రం గౌరవం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నావని మండిపడ్డారు
Money laundering Case: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి ఈడీ షాక్, రుణాల పేరిట మోసం చేసిన కేసులో 28 స్థిరాస్తులను జప్తు చేసిన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
Hazarath Reddyతెలంగాణలో రుణాల పేరిట మోసం చేసిన కేసులో (Money laundering case) అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం షాకిచ్చింది.
Cyber Cheating: ‘హేయ్.. మొత్తం తీసెయ్యాలా?’.. ‘నేను విప్పేసాగా.. నువ్వు కూడా తీసేయ్’.. అమ్మాయిలను ఎర వేసి.. నగ్న వీడియోలు సేకరించి.. చర్లపల్లి జైలు ఉన్నతాధికారిని నిండా ముంచిన సైబర్ నేరగాళ్లు.. అయోమయంలో లక్ష సమర్పించుకున్న అధికారి.. తర్వాత ఏమైంది?
Jai Kచర్లపల్లి జైలు డిప్యూటీ సూపరిటెండెంట్‌కు సైబర్ నేరగాళ్ల బురిడీ.. తొలుత అమ్మాయిలతో నగ్నంగా మాట్లాడించిన కేటుగాళ్లు.. నగ్న వీడియోలపై యూట్యూబ్ నుంచి ఫిర్యాదు అందిందంటూ సీబీఐ అధికారి పేరుతో ఫోన్.. రూ. 97,500 సమర్పించుకున్న అధికారి.. పశ్చిమ బెంగాల్‌ నుంచి కాల్ చేసినట్టు గుర్తించిన పోలీసులు
Intelligence Alert: తెలంగాణలో భారీ విధ్వంసానికి పీఎఫ్‌ఐ కుట్ర, ఇంటలిజెన్స్ పోలీసుల హెచ్చరిక, ఆర్‌ఎస్‌ఎస్‌- హిందూ ధార్మిక సంస్థలే లక్ష్యంగా దాడుల చేసే అవకాశం, సున్నిత ప్రాంతాల్లో భద్రత పెంపు
Naresh. VNSతెలంగాణలోనూ పీఎఫ్ఐ (PFI) కార్యకర్తలు ఆర్ఎస్ఎస్‌ను (RSS) టార్గెట్‌ చేసుకొని దాడులు చేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాల దర్యాప్తులో తేలింది. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ అధికారులు నిఘా పెట్టాలని.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని నిఘా అధికారులు సూచించారు.
Boora Narsaiah Goud: మునుగోడు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు షాక్.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ రాజీనామా
Jai Kమునుగోడు ఎన్నికల సమయంలో అధికార టీఆర్ఎస్ కు అనుకోని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Fraud Gang: అలవైకుంఠపురం, RRR, లవ్‌ స్టోరీ సినిమాకు మీరే నిర్మాతలంటూ రూ.6 కోట్లు మోసం, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, సొంత బంధువులనే మోసం చేసిన కేటుగాళ్లు, రాజమౌళి, ప్రభాస్, అల్లు అర్జున్ పేర్లు కూడా వాడేసిన మోసగాళ్లు
Naresh. VNSఆర్ఆర్ఆర్ (RRR), అల వైకుంఠపురం (Ala vikuntapuram lo), లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది వంటి చిత్రాలలో పెట్టుబడులు పెడతామని నిందితులు నమ్మించారు. ఈ సినిమాల్లో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు.