తెలంగాణ
TS Police Constable Exam: రేపే తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష, ఎగ్జామ్ రాయనున్న ఆరు లక్షల మంది అభ్యర్ధులు, పరీక్ష కోసం కఠిన నిబంధనలు, ఎగ్జామ్‌ కు వెళ్లే ముందు ఇవి ఉన్నాయో చెక్ చేసుకోండి!
Naresh. VNSహాల్ టికెట్ ను (Hall ticket) ఏ4 సైజ్ పేపర్ లో ప్రింట్ తీసుకొని దానిపై నిర్ధేశిత స్థానంలో దరఖాస్తు సమయంలో డిజిటల్ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి అతికించాలి. కేవలం గమ్ తోనే అతికించాలి. అభ్యర్థులు చేతులకు మెహిందీ, టాటూలు ఉంచుకోవద్దు. మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదు. ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మత సంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్ క్టీస్ గా పరిగణిస్తారు.
TS EDCET Result 2022 Out: టీఎస్ ఎడ్‌సెట్‌–2022 ఫలితాలు విడుదల, రేపు మధ్యాహ్నం 3గంటలకు ఐసెట్‌ ఫలితాలు, edcet.tsche.ac.in ద్వారా EdCET ఫలితాలు చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణలో బీఈడీ కోర్సులో ప్ర‌వేశానికి నిర్వ‌హించిన‌ టీఎస్ ఎడ్‌సెట్‌–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేశారు. తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఎడ్‌సెట్‌ ఫలితాలను విడుద‌ల చేశారు.
Hyderabad Shocker: హోం వర్క్ చేయలేదని స్టూడెంట్‌ని మోకాళ్లపై నిల్చోబెట్టిన టీచర్, తోటి విద్యార్థుల ముందు అవమానం జరిగిందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
Hazarath Reddyభాగ్యనగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్‌లో టీచర్ మందలించిందని 8వ తరగతి విద్యార్థిని (Class 8 Girl Student Commits Suicide) అక్షయ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Telangana Horror: తాగిన మత్తులో భార్యలను గొడ్డలితో దారుణంగా నరికిన ఇద్దరు భర్తలు, గర్భిణి అని కూడా నరికేసిన కిరాతక భర్త, తెలంగాణ రాష్ట్రంలో దారుణ ఘటనలు
Hazarath Reddyతెలంగాణలో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. మద్యం మత్తులో ఇద్దరు భర్తలు తమ భార్యలను దారుణంగా గొడ్డలితో (Two Men hacks their wives) నరికిచంపారు. ఈ ఘటనలు ఒకటి శంషాబాద్‌ పట్టణంలో చోటు చేసుకోగా మరోకటి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండ‌ల ప‌రిధిలోని చిట్యాల గ్రామంలో చోటు చేసుకుంది.
Hyderabad Shocker: రోగి ముక్కులో 150 గుడ్లు పెట్టిన ఈగలు, ఆ గుడ్లు పొదిగి అక్కడే లార్వాగా మారడంతో వాటిని చికిత్స ద్వారా తొలగించిన సెంచరీ ఆస్పత్రి వైద్యులు
Hazarath Reddyఅరుదైన సందర్భాల్లో, హైదరాబాద్ లోని సెంచరీ హాస్పిటల్‌లోని వైద్యులు (Doctors at Century Hospital) తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగి ముక్కు నుండి దాదాపు ఈగ యెక్క 150 మాగ్గోట్‌లను (బేబీ హౌస్‌ఫ్లైస్) తొలగించారు. మహిళ సెమీ కోమాటోస్ స్థితిలో, మతిమరుపు మరియు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి తీసుకురాబడింది.
CM KCR on National Politics: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు,నేను బతికుండగా తెలంగాణను ఆగం కానివ్వను, మ‌త పిచ్చిగాళ్ల‌ను తరిమికొట్టాలని సీఎం పిలుపు
Hazarath Reddyతెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో (CM KCR Public Meeting) కేసీఆర్ ప్ర‌సంగించారు. ఇండియాలో దరిద్రపుగొట్టు వాతావరణం చూస్తున్నామని, మనకు పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా? అంటూ ప్రశ్నించారు.
Prophet Remark Row: ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్, పాత కేసులకు సంబధించి మళ్లీ నోటీసులు ఇచ్చిన పోలీసులు, బీజేపీ రౌడీయిజం చేస్తే సహించేది లేదని తెలిపిన హోం మంత్రి మహమూద్‌ అలీ
Hazarath Reddyబీజేపీ సస్పెండ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు (Prophet Remark Row) చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లీస్‌ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. దీంతో, పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం, కోర్టు రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు.
Prophet Remark Row: పాతబస్తీలో ప్రశాంత వాతావరణం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో భద్రత ఏర్పాటు, ఓల్డ్ సిటీలో సాయంత్రం నుంచి ఆంక్షలు
Hazarath Reddyబీజేపీ సస్పెండ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Rajasingh) వ్యాఖ్యలతో నిరసనలతో వేడెక్కిన పాతబస్తీ (Old city)లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆందోళనలు, నిరసనలు తగ్గాయి. చార్మినార్ (Charminar) వద్ద షాపులు తెరుచుకున్నాయి. రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో భద్రత ఏర్పాటు చేశారు.
Prices of Lord Ganesh Idols Hike: హైదరాబాద్‌లో చుక్కలనంటుతున్న వినాయక విగ్రహాల ధరలు, రెండేళ్లతో పోలిస్తే భారీగా పెరిగిన ధరలు, ఎంత పెరిగాయి? ఎందుకు పెరిగాయో తెలుసా?
Naresh. VNSరెండేళ్లుగా కరోనా కారణంగా వినాయక చవితిని ఆడంబరంగా జరుపుకోలేని పరిస్థితి, ఈ సారి వైభవంగా వేడుకలను నిర్వహించాలని ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు భావిస్తున్నారు. దీంతో ధరలు భారీగా పెరిగాయి.
Bandi Sanjay: వృద్ధురాలి పాదాల‌కు చెప్పులు తొడిగిన బండి సంజయ్, సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ, పెద్ద‌ల‌ను గౌర‌వించండి అంటూ కామెంట్
Hazarath Reddyప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజ‌య్ తెలంగాణ‌లో యాత్ర సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర‌లో భాగంగా ఆయ‌న ఇటీవ‌లే ఓ వృద్ధురాలి పాదాల‌కు చెప్పులు తొడిగారు. ఈ ఫొటోల‌ను బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ శాఖ వైరి వ‌ర్గాల‌కు కౌంటర్ ఇచ్చింది.
Telangana: బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో విషాదం, వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య, న్యాయం కోసం తరగతులు బహిష్కరించి ఆందోళనకు పిలుపునిచ్చిన విద్యార్థులు
Hazarath Reddyబాసర ట్రిపుల్‌ ఐటీలో మరో విషాదం చోటు చేసుకుంది. కళాశాలలో ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ (ఈ–1) చదువుతున్న రాథోడ్‌ సురేశ్‌(22) గోదావరి హాస్టల్‌ భవనంలోని తన గదిలో మంగళవారం ఫ్యాన్‌కు (Basara IIIT Scholar Ends Life ) ఉరేసుకున్నాడు.ఈ నేపథ్యంలో మరోమారు విద్యార్థులు ఆందోళనలకు పిలుపునిచ్చారు.
Eatala Rajender Father Dies: అనారోగ్యంతో ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య మృతి, తండ్రి భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన హుజురాబాద్ ఎమ్మెల్యే
Hazarath Reddyహుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య(104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. దీంతో స్వగ్రామం కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రే కమలాపూర్‌కు చేరుకున్న ఈటల.. తండ్రి భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
MLA Rajasingh Got Bail: MLA రాజాసింగ్‌కు బెయిల్, విడుదల చేయాలని కోర్టు ఆదేశం
Krishnaగోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కు నాంపల్లి కోర్టు..బెయిల్‌ మంజూరు చేసింది. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేశారని రాజాసింగ్‌ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు.
Delhi Liquor Scam: లిక్కర్‌ స్కాం కేసుపై సీబీఐ విచారణ, కాషాయపు నేతలపై పరువునష్టం దావా వేసిన ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేతల అరెస్టులపై మండిపడిన కిషన్ రెడ్డి, మీరు మిగులుతారా అంటూ తలసాని మాస్ వార్నింగ్
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కాంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోందని బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది వెల్లడించారు.
BJP Suspends MLA Raja Singh: వేటు పడింది, ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు, పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు బీజేపీ ప్రకటన
Hazarath Reddyమహ్మద్‌ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. నుపూర్‌ శర్మ ఎపిసోడ్‌తో రాజాసింగ్‌పై తక్షణం చర్యలు చేపట్టింది పార్టీ హైకమాండ్‌. దీంతో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది.
Telangana: తెలంగాణలో లిక్కర్‌ స్కామ్‌ ప్రకంపనలు, కల్వకుంట్ల కవితే ప్రధాన సూత్రధారి అంటూ బీజేపీ ఆరోపణలు, నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కేసీఆర్‌ కూతురు, బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ఏమన్నారంటే..
Hazarath Reddyఢిల్లీలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కామ్‌ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కుంభకోణం తెలంగాణకు తాకింది. లిక్కర్‌ మాఫియాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Prophet Remark Row: రెండో పార్ట్ రెడీ అంటున్న రాజాసింగ్, పాతబస్తీలో హై టెన్షన్‌, ధర్మం కోసం నేను చావడానికైనా రెడీగా ఉన్నానని తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే, అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించిన పోలీసులు
Hazarath Reddyగోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Telangana BJP MLA Raja Singh ) మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచే విధంగా యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలు పాతబస్తీలో హై టెన్షన్‌ క్రియేట్‌ చేశాయి.
Prophet Remark Row: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్, మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే, హైదరాబాద్‌లోని పలు పీఎస్‌లలో రాజాసింగ్‌పై కేసులు నమోదు
Hazarath Reddyమహ్మద్ ప్రవక్తపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ( BJP MLA Raja Singh) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోలీసులు ఆయన్ను మంగళవారం ఉదయం అరెస్ట్‌ చేశారు. డబీర్‌పురా పీఎస్‌లో నమోదైన కేసులో భాగంగా పోలీసులు.. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేశారు.
Bandi Sanjay Arrest: బండి సంజయ్‌ అరెస్ట్, కార్యకర్తల తోపులాట మధ్యే ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బీజేపీ కార్యకర్తలపై-పోలీసుల దాడికి నిరసనగా సంజయ్ దీక్ష
Hazarath Reddyతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ (Telangana BJP chief Bandi Sanjay arrested ) చేశారు. జనగామ పాంమ్నూరు వద్ద బండి సంజయ్‌ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. కార్యకర్తల తోపులాట మధ్యే ఆయన్ని అదుపులోకి (Bandi Sanjay Arrest) తీసుకున్నారు.
Schools Bandh In Telangana, AP: రేపు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు, తెలంగాణలో ఇంటర్ కాలేజీలు రేపు బంద్ అని ప్రకటించిన ABVP
Krishnaతెలంగాణ, ఏపీలో రేపు అన్ని స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. మంగళవారం విద్యార్థి సంఘాల బంద్ పిలుపుతో తెలుగు రాష్ట్రాల్లో రేపు అన్ని విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ‌నున్నాయి. ఏపీ, తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు బంద్ కు స‌హ‌క‌రించాల‌ని విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి.