తెలంగాణ

Omicron in Telangana: తెలంగాణలో కరోనా అలర్ట్, కలవర పెడుతున్న BA5, BA4, BA.2.12.1 రకాల ఓమిక్రాన్ వేరియంట్లు, కోవిడ్ కేసుల పెరుగుదలకు ఇదే కారణమంటున్న INSACOG

Hazarath Reddy

భారత్ లో కరోనా వైరస్ జన్యు శ్రేణి, వైరస్ వైవిధ్యాన్ని అధ్యయనం చేసే INSACOG సంస్థ నివేదిక ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం BA5, BA4, BA.2.12.1 రకాల ఒమిక్రాన్ వేరియంట్లు సామాజిక వ్యాప్తి దశలో ఉన్నాయని తేలింది.

KTR Letter to Nirmala: తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మొద్దు, ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయండి, ఉపసంహరణ పేరుతో అడ్డికి పావుశేరు అమ్ముతున్నారంటూ మంత్రి కేటీఆర్ మండిపాటు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ

Naresh. VNS

దేశాభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను (PSU) బీజేపీ (BJP) ప్రభుత్వం ‘అడ్డికి పావుశేరు’ చొప్పున అమ్ముతుందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్మండిపడ్డారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలు చేయని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరణ పేరుతో వాటి ఆస్తులను అప్పనంగా అమ్ముతోందని దుయ్యబట్టారు.

Secunderabad Violence Suspect In Custody: సికింద్రాబాద్ అల్లర్ల ప్రధాన సూత్రధారి అరెస్ట్, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే మెసేజ్‌లు పెట్టినట్లు గుర్తింపు, రహస్య ప్రాంతంలో దర్యాప్తు, నర్సరావుపేటలో డిఫెన్స్ అకాడమీ నడుపుతున్న అనుమానితుడు

Naresh. VNS

ఈ కేసులో దాడులకు ప్రధాన సూత్రధారిగా సాయి డిఫెన్స్ అకాడమీ (Sai Defense Academy) డైరెక్టర్ ఆవుల సుబ్బారావుని (Subbarao) అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే సుబ్బారావుని అరెస్ట్ చేసిన నరసరావుపేట పోలీసులు.. అతడిని ప్రశ్నిస్తున్నారు. విచారణలో అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Vijaya Reddy joins Congress: గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్, పార్టీని వీడనున్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటన, రేవంత్‌ రెడ్డితో కలిసి ప్రెస్‌ మీట్

Naresh. VNS

గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ పార్టీకి (TRS) బిగ్ షాక్. టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయా రెడ్డి (Vijaya reddy) కాంగ్రెస్ లో చేరనున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నెల 23న కాంగ్రెస్ లో (Joining in Congress) చేరుతున్నట్లు విజయారెడ్డి ప్రకటించారు. మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కలిశానని తెలిపారు.

Advertisement

Rakesh Funeral: అశ్రునయనాల మధ్య ముగిసిన రాకేష్ అంత్యక్రియలు, పాడె మోసిన మంత్రులు, వేలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు, టీఆర్‌ఎస్‌ జెండాలతో సాగిన అంతిమయాత్ర, పలుచోట్ల ఉద్రిక్తతలు

Naresh. VNS

సికింద్రాబాద్ అల్లర్లలో మృతి చెందిన దామెర రాకేష్ అంత్య క్రియలు ముగిశాయి. వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్‌పేటలో రాకేష్ అంత్యక్రియలు నిర్వహించారు. రాకేశ్ పాడెను మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మోసి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.

Agnipath scheme: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ మృతదేహంతో ర్యాలీ, నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

Krishna

రాకేష్ మృతదేహంతో నిరసన ర్యాలీని నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాకేష్ మృతి చెందారని ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

Ex-gratia to Family of Rakesh: సికింద్రాబాద్ అల్లర్లలో మృతి చెందిన రాకేష్ కుటుంబానికి రూ.25లక్షలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రాకేష్ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్, రాకేష్ కుటుంబ నేపథ్యమిదీ!

Naresh. VNS

సికింద్రాబాద్‌ (Secundrabad)రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన ధర్నా హింసాత్మకం కావడంపై సీఎం కేసీఆర్‌ (Cm KCR) ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్‌ జిల్లాకు చెందిన రాకేశ్ (Rakesh) మ‌ర‌ణించ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాకేశ్ కుటుంబానికి సీఎం కేసీఆర్‌ 25 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా (Ex-gratia)ప్ర‌క‌టించారు

Telanagana Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 10వేల పోస్టుల భర్తీకి ఆర్ధికశాఖ ఉత్తర్వులు, ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలో తెలుసా?

Naresh. VNS

తాజాగా రాష్ట్రంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉత్తర్వుల విషయాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish rao) తన ట్విటర్ ద్వారా వెల్లడించారు.

Advertisement

Telangana Corona Cases: తెలంగాణలో నానాటికీ తీవ్రమవుతున్న కరోనా కేసులు, హైదరాబాద్, రంగారెడ్డిల్లో ఆందోళనకరస్థాయిలో కేసులు నమోదు. వైద్యాధికారులను అలర్ట్ చేసిన ప్రభుత్వం, దేశలోనూ అదే పరిస్థితి

Naresh. VNS

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కరోనావైరస్ (Corona Virus) మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. దేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలోనూ కొవిడ్ కొత్త కేసుల సంఖ్య (New Covid cases) వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య రెండు వందలు (279) దాటింది.

Agnipath Protests: లైన్ క్లియర్.. సికింద్రాబాద్ నుండి ప్రారంభం కానున్నరైళ్ల రాకపోకలు, రూ. 7 కోట్ల‌కు పైగా ఆస్తి న‌ష్టం జ‌రిగింద‌ని తెలిపిన DRM AK Gupta

Hazarath Reddy

ఆర్మీ ఉద్యోగార్థులు చేప‌ట్టిన ఆందోళ‌న‌ల‌తో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ అట్టుడికిన (Agnipath Protests) సంగతి విదితమే.. ఈ విధ్వంసంలో రూ. 7 కోట్ల‌కు పైగా ఆస్తి న‌ష్టం జ‌రిగింద‌ని సికింద్రాబాద్ డివిజ‌న‌ల్ రైల్వే మేనేజ‌ర్ గుప్తా (Secunderabad DRM AK Gupta) స్ప‌ష్టం చేశారు

Weather Forecast: భారీ వర్షాలు, తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, అన్ని జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

Agnipath Row: ప్రయాణికులు అలర్ట్, సికింద్రాబాద్‌ పరిధిలో 71 రైళ్లు రద్దు, హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం

Hazarath Reddy

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమయింది. అగ్నిపథ్‌ ఆందోళనలు హైదరాబాద్‌కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు (SCR Cancels 71 Trains) చేసింది. ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా రద్దు చేసింది.

Advertisement

Agnipath Scheme Protest: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం, ఒకరు మృతి, పలువురికి గాయాలు, రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో భారీగా బందోబస్తు

Hazarath Reddy

ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఓ యువకుడు మృతిచెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికికు తరలించారు.

Agnipath Scheme Row: అసలేం జరిగింది..సికింద్రాబాద్‌లో అగ్గి రాజేసిందెవరు, అదుపు తప్పిన యువకులతో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, క్షణాల్లో రైల్వే స్టేషన్ అంతటా దట్టమైన మంటలు

Hazarath Reddy

త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై (Agnipath Scheme Row) దేశంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల సర్వీస్ అంటూ కేంద్ర ప్రభుత్వం తమ జీవితాలను నాశనం చేస్తోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Agnipath Scheme Protest: మంటల్లో చిక్కుకున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌, అగ్నిపథ్‌ ఆందోళనతో అట్టుడికిన హైదరాబాద్, రైల్వే స్టేషన్‌ ప్రాంగణం, ప్లాట్‌ఫారమ్స్‌ల దగ్గర యుద్ధవాతావరణం

Hazarath Reddy

నిరసనకారుల ఆందోళనతో (Agnipath Scheme Protest) సికింద్రాబాద్‌ స్టేషన్‌ రణరంగంగా మారింది. అగ్నిపథ్‌తో తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. ఒక్కసారిగా దూసుకువచ్చిన విద్యార్థులతో రైల్వే స్టేషన్‌ ప్రాంగణం, ప్లాట్‌ఫారమ్స్‌ల దగ్గర యుద్ధవాతావరణం నెలకొంది.

Agnipath Scheme Protest: వైరల్ అవుతున్న విధ్వంసం వీడియోలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హై‌అలర్ట్, అగ్నిపథ్‌ స్కీం నిరసిస్తూ పలు రైళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

Hazarath Reddy

అగ్నిపథ్‌ ఆందోళన హైదరాబాద్‌కు పాకింది. నిరసనకారుల ఆందోళనతో (Agnipath Scheme Protest) సికింద్రాబాద్‌ స్టేషన్‌ రణరంగంగా మారింది. అగ్నిపథ్‌తో తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు.

Advertisement

Agnipath Scheme Protest: సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు, అగ్నిపథ్‌ ఆందోళనతో రణరంగంగా మారిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం

Hazarath Reddy

అగ్నిపథ్‌ ఆందోళన హైదరాబాద్‌కు పాకింది. నిరసనకారుల ఆందోళనతో (Agnipath Scheme Protest) సికింద్రాబాద్‌ స్టేషన్‌ రణరంగంగా మారింది. అగ్నిపథ్‌తో తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు.

IMD Alert For Telengana: తెలంగాణకు అతిభారీ వర్ష సూచన, రానున్న మూడు రోజుల పాటూ భారీ వర్షాలు కురిసే అవకాశం, పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

Naresh. VNS

నైరుతి రుతుపవనాలు (Monsoon) తెలంగాణవ్యాప్తంగా విస్తరించాయి. రాష్ట్రంలో ప్రవేశించిన మూడు రోజుల్లోనే విస్తరించడంతో వర్షాలు (Rians) కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy rains) కురిశాయి. అత్యధికంగా నిర్మల్‌ జిల్లా (Nirmal) ముధోల్‌ 13.28 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.

Jobs in Singareni: సింగరేణిలో కొలువుల జాతర, 177 పోస్టులకు నోటిఫికేషన్ జారీ, ఈ జిల్లాల వారికి బంపర్ ఆఫర్, పోస్టుల్లో 95 శాతం వాళ్లకే, దరఖాస్తు చేసుకునే పద్దతి ఇదే!

Naresh. VNS

సింగరేణి (Singareni) యాజమాన్యం నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది. 177 ఎక్స్‌‌టర్నల్‌ క్లర్కు (Externel clerks) పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. సింగరేణిలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ (Sridhar) ఆదేశించారు. నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను www.scclmines.com లోని Careers లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.

Covid in TS: తెలంగాణలో మెల్లిగా పెరుగుతున్న కేసులు, నిన్న 205 కేసులు కాగా కొత్తగా 285 మందికి కరోనా పాజిటివ్, రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు లేవని తెలిపిన ఆరోగ్యశాఖ

Hazarath Reddy

తెలంగాణలో మెల్లిగా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 205 కేసులు నమోదు కాగా.. కొత్తగా 285 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,95,293 ఉండగా మరణాలు 4,111గా ఉన్నాయి.

Advertisement
Advertisement