తెలంగాణ

CM KCR on 'The Kashmir Files': క‌శ్మీర్ ఫైల్స్ సినిమాపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం, ఈ ర‌క‌మైనటువంటి దేశ విభ‌జ‌న, ప్ర‌జ‌ల విభ‌జ‌న స‌రికాదని మండిపాటు

Hazarath Reddy

ఇటీవ‌ల విడుద‌లైన క‌శ్మీర్ ఫైల్స్ సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై యువ‌త ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం ముగిసిన అనంత‌రం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

Hyderabad Shcoker: ముగ్గురు కన్నకూతుళ్లపై తండ్రి అత్యాచారయత్నం, హైదరాబాద్ లో కలకలం, భార్యను ఇంటి నుంచి తన్ని తరిమేసి, కూతుళ్లతో కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నం...

Krishna

రాత్రి మద్యం మత్తులో వచ్చి తన రెండవ కూతురుపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఇది గమనించిన మిగతా ఇద్దరు గట్టిగా అరవడంతో నుండి జారుకున్నాడు. ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా బయట గేటుకు తాళం వేసి వెళ్లిపోయాడు

Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 35 కేసులు, అత్యధికంగా హైదరాబాదులో 21 కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 13,569 కరోనా పరీక్షలు నిర్వహించగా, 35 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 21 కేసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 5, హన్మకొండ జిల్లాలో 3, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3, ఖమ్మం జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 1, యాదాద్రి జిల్లాలో 1 కేసు నమోదు కాగా... మిగిలిన జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

KTR In USA: లాస్​ ఏంజిల్స్​ లో మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు, పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి పర్యటన

Krishna

తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఆయనకు లాస్ ఏంజెల్స్ లో ఘన స్వాగతం లభించింది. పార్టీ అభిమానులు, ఎన్ఆర్ఐలు కేటీఆర్ కు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలతో మంత్రి కేటీఆర్ కాసేపు సమావేశమయ్యారు.

Advertisement

Tollywood Actress Died: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో టాలివుడ్ నటి మృతి, శోక సంద్రంలో తెలుగు సినీ పరిశ్రమ, కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ నటి సురేఖ వాణి..

Krishna

తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న డాలీ నిన్న రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ప్రమాద సమయంలో కారులో రోహిత్ అనే యువకుడితో పాటు మరో యువతి, డాలీ ఉన్నట్లు సమాచారం.

Chinna Jeeyar on Yadadri: యాదాద్రికి పిలిస్తే వెళ్తా, లేకపోయినా చూసి ఆనందిస్తా..మేడారం జాతరపై చేసిన వ్యాఖ్యల వీడియో 20 సంవత్సరాల పాతది, చిన్న జీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు..

Krishna

20 ఏళ్ల క్రితం మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి వారి సొంత లాభాల కోసం వివాదం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలపై పూర్వాపరాలు తెలుసుకోకుండా కొందరు పనిగట్లుకొని సమస్యగా మారుస్తున్నారన్నారు. గ్రామ దేవతల్ని అవమానించారనడం సరికాదన్నారు.

Hyderabad Road Accident: జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే పేరుతో ఉన్న కారు బీభత్సం, రెండు నెలల పసికందు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురిక తీవ్రగాయాలు, స్పందించిన ఎమ్మెల్యే

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం (Hyderabad Road Accident) చోటు చేసుకుంది. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పేరుతో స్టిక్కర్‌ ఉన్న కారు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో అభంశుభం తెలియని 2 నెలల పసికందు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

TSRTC: చిల్లర సమస్యకు చెక్, తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో రౌండప్‌ చార్జీలను ఖరారు చేసన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

Hazarath Reddy

తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు ఇకపై చెక్ పడింది. బస్సుల్లో చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ (V.C Sajjanar) దీన్ని పరిష్కరించేందుకు రౌండప్‌ చార్జీలను (TSRTC Bus Fares 2022) ఖరారు చేశారు.

Advertisement

Chicken Rate in Hyd: తెలంగాణలో మండుతున్న చికెన్ ధ‌ర‌లు, రూ.180 ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ. 280 నుంచి రూ.300 మ‌ధ్యలోకి, మరి కొన్ని నెల‌ల వ‌ర‌కు ఇలాగే కొన‌సాగే అవ‌కాశం

Hazarath Reddy

తెలంగాణ‌లో చికెన్ ధ‌ర‌లు ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌న‌ప‌డ‌ట్లేదు. నెల రోజుల క్రితం వ‌ర‌కు రూ.180 లోపు ఉన్న కిలో చికెన్ ధ‌ర (Chicken Rate in Hyd) ఇప్పుడు రూ. 280 నుంచి రూ.300 మ‌ధ్య ఉంది. కోళ్ల దాణా రేట్లు పెరిగాయ‌ని అందుకే చికెన్ ధ‌ర‌లు (Chicken Rate in Hyderabad Today) పెరిగాయ‌ని హ్యాచ‌రీస్ య‌జ‌మానులు అంటున్నారు

Telangana Temperatures: రెండు రోజులు బయటకెళ్తే మాడిపోతారు, తెలంగాణలో వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరిక, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

Naresh. VNS

ఈ రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా మే నెలలో వడగాలులు వీస్తాయని కానీ ఈ సంవత్సరం మార్చిలోనే వీస్తుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.

Telangana Traffic Challans: ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్లకు భారీ డిమాండ్, 15 రోజుల్లో రూ.140 కోట్లు వసూల్, మొత్తం టార్గెట్ ఎంతో తెలుసా? సర్వర్ మొరాయిస్తుండటంతో చాలా మంది అవస్థలు

Naresh. VNS

మొదటి రోజే రూ. 5.5 కోట్ల ఫైన్లు చెల్లించారు. తెలంగాణ (Telangana)వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ వరకు ఆఫర్ వర్తించనుంది. మొత్తంగా రూ. 140 కోట్ల జరిమాన వసూలైంది. రాయితీకి మరో 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువును ఉపయోగించుకోని వారు..తనిఖీల్లో చలాన్లు () ఉంటే.. మొత్తం బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Liquor Outlets to be Closed: మద్యం షాపులు 2 రోజులు బంద్, హోలీ పండుగ సందర్భంగా జంటనగరాల్లో పోలీసుల నిర్ణయం, షాపుల ముందు క్యూకట్టిన మద్యం ప్రియులు

Naresh. VNS

హోలీ (Holi) పండుగకు ఎంజాయ్ చేద్దామనుకుంటున్నవారికి షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. పండుగ సందర్భంగా తాగి ఎలాంటి గొడవలు జరుగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ పోలీసులు (Telangana police) ఆంక్షలు విధించారు.

Advertisement

Vikas Raj New CEO of TS: తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా వికాస్‌రాజ్‌, ఉత్త‌ర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి (సీఈఓ) పోస్టు గ‌త కొంత కాలంగా ఖాళీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టిదాకా ఆ పోస్టులో కొన‌సాగిన శ‌శాంక్ గోయ‌ల్ ఇదివ‌ర‌కే బ‌దిలీ కాగా.. తాజాగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ రాష్ట్రఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా నియ‌మిస్తూ కేంద్ర ఎన్నిల సంఘం బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 75 కేసులు, గత 24 గంటల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 34 మందికి కరోనా

Hazarath Reddy

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 75 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. హైదరాబాద్ లో అత్యధికంగా 34 మంది కరోనాకు గురయ్యారు. కరోనా రికవరీ రేటు 99.37 శాతానికి పెరిగింది

TS Inter Exams 2022: తెలంగాణలో మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు, స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు, పూర్తి వివరాలు కథనంలో..

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. జేఈఈ అడ్వాన్స్ పరీక్షల తేదీల మార్పు కారణంగా ఇంటర్ పరీక్షల్లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం విడుద‌ల చేసింది.

Telangana: తెలంగాణలో ఘోర విషాదాలు, వనపర్తిలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి, పెద్దపల్లి జిల్లాలో మరొకరు మృతి, ఏపీలో రోడ్డు ప్రమాదంలొ మరో ముగ్గురు చిన్నారులు మృతి

Hazarath Reddy

వనపర్తి (wanaparthy) జిల్లా కేంద్రంలో విషాదం ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు శవాలుగా (3 children drown in lake) తేలారు. పట్టణంలో బండార్‌నగర్‌కు చెందిన మున్నా, అజ్మద్‌, భరత్‌.. పదో తరగతి చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం సరదాగా వనపర్తి శివారులోని చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు

Advertisement

Corona in TS: తెలంగాణలో కొత్తగా 81 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 35 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా వ్యాప్తిపై ప్రజారోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గిపోతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 24,848 కరోనా పరీక్షలు నిర్వహించగా, 81 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

TS Budget Session 2022: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా, బడ్జెట్‌పై ప్రసంగించిన సీఎం కేసీఆర్, హిజాబ్ వివాదం ఎందుకని ప్రశ్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. బుధవారం అసెంబ్లీ సమావేశాలు జరిగిన అనంతరం అసెంబ్లీని (TS Budget session 2022) నిరవధిక వాయిదా వేశారు.ఏడు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో (TS Budget session 2022) మొత్తం 4 బిల్లులు ఆమోదం పొందాయి

CM KCR on Hijab Controversy: హిజాబ్ వివాదంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు ఏం అభ్యంతరమని సూటి ప్రశ్న

Hazarath Reddy

దేశంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన హిజాబ్ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. బెంగుళూరులో హిజాబ్ పంచాయతీ పెడుతున్నారని... ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు ఏం అభ్యంతరమని ప్రశ్నించారు. ప్రజలు తొడుక్కునే వస్త్రాలతో ప్రభుత్వాలకు ఏం పని అని అడిగారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 67 మందికి కరోనా, హైదరాబాదులో 19 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 21,843 కరోనా పరీక్షలు నిర్వహించగా, 67 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 19 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 152 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement
Advertisement