తెలంగాణ

Half-Day Schools in TS: తెలంగాణ‌లో రేప‌ట్నుంచి ఒంటిపూట బ‌డులు, ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు కొనసాగనున్న స్కూల్స్

Hazarath Reddy

తెలంగాణ‌లో రేప‌ట్నుంచి (మార్చి 15) ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో మంగ‌ళ‌వారం నుంచి ఒంటిపూట బ‌డులు (Half-Day Schools in TS) నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Gutha Sukender Reddy: శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌గా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, రెండో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ

Hazarath Reddy

తెలంగాణ శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి (Gutha Sukender Reddy) రెండోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మండ‌లి చైర్మ‌న్‌గా సుఖేంద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ( legislative council chairman ) ఎన్నిక‌య్యారు. ఈ ఎన్నిక‌కు ఒకే ఒక్క నామినేష‌న్ రావ‌డంతో.. గుత్తా ఏక‌గ్రీవంగా ఎన్నికైనట్లు మండ‌లి అధికారులు ప్ర‌క‌టించారు.

TS Budget Session 2022: రేప‌టితో తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు ముగింపు, ఆరో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఆరో రోజు (TS Budget Session 2022) ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అయితే నేడు జీరో అవర్ కూడా ఉంటుందని, సభ్యులు ప్రశ్నలు అడగాలని, ఉపన్యాసాలు ఇవ్వద్దని తెలిపారు.

Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 50 మందికి కరోనా, హైదరాబాదులో అత్యధికంగా 23 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 16,128 కరోనా పరీక్షలు నిర్వహించగా, 50 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement

Bandi sanjay warns KTR : దమ్ముంటే కరంట్ కట్ చేయ్! మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్, కేసీఆర్, కేటీఆర్ దేశ ద్రోహులంటూ ఫైరయిన బండి, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Naresh. VNS

మంత్రి కేటీఆర్‌కు (Minister KTR) సవాల్ విసిరారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కంటోన్మెంట్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దమ్ముంటే కంటోన్మెంట్ (cantonment) కరెంటు కట్ చేయండి చూస్తాం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు

Good News For Telangana Beer Lovers: తెలంగాణలో బీరు ప్రియులకు గుడ్ న్యూస్, బాటిల్‌పై ఏకంగా 30 రూపాయలు తగ్గించే చాన్స్, వేసవిలో బీర్ల సేల్స్ పెరిగే చాన్స్..

Krishna

మద్యం అమ్మకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. బీర్ బాటిల్ పై రూ.20-30 వరకూ తగ్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Kandikonda Passes Away: పాటల రచయిత కందికొండ కన్నుమూత, చివరిదశలో చాలా ఇబ్బందుల పడ్డ కందికొండ, మళ్లీకూయవే గువ్వతో అరంగేట్రం, రెండేళ్లుగా మంచానికే పరిమితం

Naresh. VNS

సినీ గేయ రచయిత (Lyricist) కందికొండ(49) (Kandikonda) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. వెంగళరావు నగర్‌లోని తన ఇంట్లో కందికొండ తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్‌ జిల్లా (Warangal) నర్సంపేట (Narsampet) మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు.

MLA Rasamayi Balakishan: తెలంగాణ అసెంబ్లీలో కలకలం, డిప్యూటీ స్పీకర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి గరంగరం, మైక్ కట్ చేయడంతో తీవ్రఆగ్రహం, మంత్రి కేటీఆర్ ముందే అసహనం

Krishna

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ సభ్యులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిప్యూటీ స్పీకర్ పద్మారావుపై అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Hijra Love Marriage With A Man: హిజ్రాను ప్రేమించి, సహజీవనం చేసి, పెద్దలను ఒప్పించి పెళ్లాడిన యువకుడు, భద్రాద్రి కొత్తగూడెంలో వింత ఘటన

Krishna

హిజ్రాను ప్రేమించి, ఆమెతో సహజీవనం చేసి, పెద్దలను ఒప్పించి పెళ్లాడాడో యువకుడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది.

Corona in TS: తెలంగాణలో 13 జిల్లాల్లో కొత్త కేసులు నిల్, గత 24 గంటల్లో 90 కొత్త కేసులు నమోదు, హైదరాబాదులో 35 కొత్త కరోనా కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గడచిన 24 గంటల్లో 25,658 కరోనా పరీక్షలు నిర్వహించగా, 90 కొత్త కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో 35 కొత్త కేసులు నమోదు కాగా... 13 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 172 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

CM KCR Health Update: య‌శోద‌ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీఎం కేసీఆర్, ఎలాంటి గుండె సంబంధిత స‌మ‌స్య‌లు లేవ‌ని తెలిపిన వైద్యులు

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేప‌టి క్రితం య‌శోద‌ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నేటి ఉద‌యం కాస్త న‌ల‌త‌గా అనిపించ‌డంతో ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు య‌శోద ఆసుప‌త్రికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఎడ‌మ చేయితో పాటు కాలు కూడా లాగుతున్న‌ట్లుగా ఉంద‌ని కేసీఆర్ చెప్ప‌డంతో ఆయ‌న‌కు గుండె సంబంధిత వ్యాధులేమైనా ఉన్నాయా? అన్న‌ కోణంలో య‌శోద ఆసుప‌త్రి వైద్యులు ప‌లు వైద్య ప‌రీక్ష‌లు చేశారు.

CM KCR Health Update: కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన యశోద ఆస్పత్రి డాక్టర్లు, ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని ప్రకటన, సీఎంకు ఏటా ఫిబ్ర‌వ‌రిలో సాధార‌ణ చెక‌ప్ చేస్తామ‌ని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నార‌ని, ఎవ‌రూ ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని య‌శోద ఆస్ప‌త్రి వైద్యులు డాక్ట‌ర్ ఎంవీ రావు స్ప‌ష్టం చేశారు. సీఎంకు ఏటా ఫిబ్ర‌వ‌రిలో సాధార‌ణ చెక‌ప్ చేస్తామ‌ని చెప్పారు. గ‌త రెండు రోజుల నుంచి బ‌ల‌హీనంగా (CM KCR Health Update) ఉన్న‌ట్లు సీఎం చెప్పారు.

Advertisement

Telangana: యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్, సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్న తెలంగాణ ముఖ్యమంత్రి, యాదాద్రి పర్యటన రద్దు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (Telangana CM KCR) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్న ఆయన.. హుటాహుటిన యశోద ఆస్పత్రికి (Yashoda Hospital) వెళ్లారు. ఆస్పత్రిలో ఆయన సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 91 మందికి కరోనా, హైదరాబాదులో 33 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 24,444 కరోనా పరీక్షలు నిర్వహించగా, 91 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 33 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 184 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona in TS: తెలంగాణలో భారీగా తగ్గిన కేసులు, గత 24 గంటల్లో 92 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 36 కోవిడ్ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు తగ్గు ముఖం పడుతోంది. ఈ రోజు కొత్తగా 92 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 36 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో జీరో కేసులు నమోదు కాగా…. తొమ్మిది జిల్లాల్లో ఒక్కోక్క కేసు చొప్పున నమోదయ్యాయి.

Telangana Jobs: నిరుద్యోగులకు అలర్ట్, తెలంగాణలో జిల్లాలు, శాఖల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో, వయోపరిమితి ఎంత పెంచారో ఇక్కడ చెక్ చేసుకోండి

Krishna

రాష్ట్రంలో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. హోం, విద్య‌, వైద్యారోగ్య శాఖ‌లో భారీగా ఖాళీలు ఉన్నాయి.

Advertisement

CM KCR On Jobs: నిరుద్యోగుల‌కు కేసీఆర్ గుడ్‌న్యూస్, తెలంగాణలో 80 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

Krishna

తెలంగాణలోని నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (CM KCR) తీపి క‌బురు అందించారు. 80 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం సభలో ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

CM KCR Wanaparthy Tour: మ‌త పిచ్చి లేపి దేశాన్ని నాశ‌నం చేస్తున్నారు, బీజేపీని బంగాళాఖాతంలో విసిరి పారేయండి, వనపర్తి టీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభంతో పాటు శంకుస్థాపన చేశారు. వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ని (CM KCR launches 'Mana Ooru-Mana Badi) ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR ) మాట్లాడుతూ విద్యారంగాన్ని పటిష్టం చేసే కార్యక్రమానికి వనపర్తి వేదికగా శ్రీకారం చుట్టామన్నారు.

Telangana: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, అసెంబ్లీలో రేపు 10 గంటలకు ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

Hazarath Reddy

అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ (CM KCR) శుభవార్త చెప్పనున్నారు. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేయనున్నారు. నిరుద్యోగులందరూ ( unemployed youth in Telangana) బుధవారం ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Corona in TS: తెలంగాణలో తగ్గిపోయిన కేసులు, గత 24 గంటల్లో 91 మందికి కరోనా, హైదరాబాద్ పరిధిలో 40 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,966 కరోనా పరీక్షలు నిర్వహించగా, 91 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాద్ పరిధిలో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 241 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement
Advertisement